బైబిలు అధ్యయనము చేయటకు సరియైన విధానము ఏది?ప్రశ్న: బైబిలు అధ్యయనము చేయటకు సరియైన విధానము ఏది?

జవాబు:
ఒక విశ్వాసికి తన జీవితంలోనున్న ప్రాముఖ్యమైన పనియే లేఖనముల అర్థాన్ని సరిగ్గా నిర్వచించవలెనని నిర్థారించుకోవడం.దేవుడు మనకు నిష్కపటముగా బైబిలు చదవమిని చెప్పలేదు. దానిని బాగుగా అధ్యయనం చేసి సరిగ్గా వాడవలెను ( 2తిమోతి 2:15).అధ్యయనము చేయుట అనేది కొంచెం కష్టతరమైన పని. పైపైన లేక సంక్షేపముగా లేఖనాలను పరిశోధించుట కొన్ని సార్లు తప్పుడు భాష్యంతో సమాప్తి చేయడానికి దారితీయవచ్చు. అందుచేత, లేఖనముల అర్థాన్ని సరిగ్గా నిర్థారించటకు నిశ్చయించుకొనుటలో కొన్ని కీలకమైన మూల సూత్రాలు ప్రాముఖ్యమని గ్రహించాలి.

మొదటిగా, బైబిలు అధ్యయనము చేసే విధ్యార్థి పరిశుధ్దాత్ముని నడిపింపుతో అర్థాన్ని గ్రహించుటకు, ఎందుకంటె అది పరిశుధ్దాత్ముని పని గనుక ప్రార్థన చేయవలెను. "అయితే ఆయన, అనగా సత్య స్వరూపియైన ఆత్మ వచ్చినపుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు భోదింపక , వేటిని వినునో వాటిని భోధించి సంభవింపబోవు సమ్గతులను మీకు తెలియ జేయును" (యోహాను 16:13). అపోస్తలు నూతన నిబంధన రాయుటకు పరిశుధ్దాత్ముడు నడిపించిన విధంగా, లేఖనముల అర్థాన్ని గ్రహించటానికి మనలను కూడ ఆయన నడిపించును. ఙ్ఞాపకముంచుకోండి, బైబిలు దేవుని గ్రంధం, గనుక దాని అర్థమేంటో ఆయనను మనము అడగాలి. నీవు క్రైస్తవుడవైనట్లైతే, లేఖనాల రచయిత- పరిశుధ్దాత్ముడు- నీలో నివసిస్తున్నవాడు, మరియు తాను రాసినదానిని నీవు గ్రహించాలని ఇష్టపడుతున్నాడు.

రెండవది, లేఖనభాగాలలోనుండి ఒక వచనము బయటకు లాగి ఆవచనపు భాగం చుట్టూ ఉన్న అర్థాన్ని, ఆ సంధర్భము బయట దాని అర్థాన్ని నిర్థారించుటకు మనము ప్రయత్నించకూడదు. మనము ఎప్పుడూ సంధర్భాన్ని అర్థంచేసుకొనడానికి వచనము చుట్టూ నున్న వచనభాగాలను, అధ్యాయాలను బాగా చదివాలి. లేఖనమంతయు దేవునినుండి వచ్చినవే (2 తిమోతీ 3:16; 2 పేతురూ 1:21),దేవుడు మానవులను రాయుటకు ఉపయోగించుకున్నాడు. ఈ మానవరచయితలకు వారి మనస్సులలో ఒకే అంశం, వ్రాయుటలో ఒకే ఉధ్దేశ్యము, మరియు వారు ఒక ప్రత్యేక విషయాన్ని సంభోధించారు. బైబిలులోని ఆ పుస్తకముయొక్క పూర్వనుమానమును తెలిసికొనుటకు చదవవలెను. ఆ పుస్తకమును ఎవరు రాశారు, ఎవరికోసం వ్రాయబడింది, ఎప్పుడు వ్రాయబడింది, మరియు ఎందుకొరకు రాయబడింది అని తెలిసికొనుటకు మనము చదవవలెను. మరియు, ఆ వాక్య భాగము దానికదే మనతో మాట్లాడటానికి మనము జాగ్రత్తవహించాలి. కొన్నిసార్లు ప్రజలు వారు అనుకున్న రీతిలో వారి సొంత మాటలకు అర్థాన్ని సంపాదించుకొనుటకు వారికి ఇష్టంవచ్చినట్లు భాష్యం చెప్పటానికి అప్పగించుకుంటారు.

మూడవది, బైబిలు అధ్యనము చేయుటలో మనమీదమనమే సంపూర్తిగా అధారపడకూడదు. జీవితాంతము లేఖనాలను బాగ అధ్యయించిన వారి పని నుండి మనము ఎందుకు నేర్చుకొనవలెను అనే దుర్వాహంకారమును వలన మనను దాని అర్థాన్ని గ్రహించలేం. కొంతమంది, తప్పుడు అభిప్రాయాలలో, కేవలము పరిశుధ్దాత్ముని మీదనే అధారపడుదామని బైబిలు ధ్యానించుటకు సమీపించడం మరియు వారు లోతైన మర్మములను కనుగొనగలరని అనుకోవడం. క్రీస్తు , పరిశుధ్దాత్ముని అనుగ్రహించుటలో క్రీస్తు శరీరములోనివారికి ఆత్మీయవరాలను అనుగ్రహించాడు. ఈ వచనాలలో ఒక ఆత్మీయవరాన్ని భోధించడం గురించి చెప్పబడింది ( ఎఫెసీయులకు 4:11-12; 1 కొరింథీయులకు 12:28). దేవుడు లేఖనాలను సరిగ్గా అర్థాన్ని గ్రహించడానికి. విధేయత చూపించటానికి ఈ భోధకులను అనుగ్రహించాడు. తోటి విశ్వాసులతో కలిసి బైబిలును అధ్యయనించటం, అర్థంగ్రహించటానికి ఆ దేవుని వాక్కులో నున్న సత్యాన్ని ఒకరినొకరు అన్వయించుకోవటంలో తొడ్పడగలరు.

గనుక ముగింపులో, బైబిలు అధ్యయనంచేయుటకు ఏది సరియైన పద్దతి? మొదట, ప్రార్థన మరియు వినయత, అర్థం గ్రహించడానికి పరిశుధ్దాత్ముని మీ ద ఆధారపడటం. రెండవది, వాక్య భాగాన్ని ఎప్పుడు సంధర్భానుసారంగా చదవటం, బైబిలు దానికదే మనకు భోధించుటను గమనించటం , మూడవది, వర్తమాన భూత భవిష్యత్కాలములో ఇతర కష్టపడి చదివిన దానిని గౌరవించటం, వారు కూడ బైబిలును సరిగ్గ అధ్యయనం చేయుటలొ వారి కష్టాన్ని గుర్తించటం. ఙ్ఞప్తిలోనికి తెచ్చుకోండి, దేవుడే బైబిలు రచయిత , మరియు నీవు దానిని గ్రహించాలని ఆయన ఇష్టపడుతున్నాడు.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


బైబిలు అధ్యయనము చేయటకు సరియైన విధానము ఏది?