settings icon
share icon
ప్రశ్న

క్రొత్తగా జన్మించిన క్రైస్తవునిగా ఉండుట అనగా ఏమిటి?

జవాబు


క్రొత్తగా జన్మించిన క్రైస్తవునిగా ఉండుట అనగా అర్థం ఏమిటి? బైబిల్ లో ఈ ప్రశ్నకు జవాబిచ్చు ఉత్తమమైన వాక్యము యోహాను 3:1-21. ప్రముఖ పరిసయ్యుడును యూదుల సన్హెద్రెనులో (యూదుల అధికారుల సభ) సభ్యుడునునైన నీకొదేముతో ప్రభువైన యేసు క్రీస్తు మాట్లాడుచుండెను. నీకొదేము కొన్ని ప్రశ్నలతో రాత్రి వేళ యేసు యొద్దకు వచ్చెను.

యేసు నీకొదేముతో మాట్లాడుతూ, ఇలా అనెను, “‘ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.’ అందుకు నీకొదేము, ‘ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు?’ అని అడిగెను. ‘రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడిగెను!’ అందుకు యేసు ఇట్లనెను, ‘ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు’” (యోహాను 3:3-7).

“క్రొత్తగా జన్మించుట” అను మాట యొక్క అక్షరార్థము “పైనుండి జన్మించుట.” నీకొదేముకు ఒక నిజమైన అవసరత ఉండెను. అతనికి హృదయ పరివర్తన-ఆత్మీయ మార్పు అవసరము. క్రొత్త జీవితం, తిరిగి జన్మించుట, అనునది దేవుని కార్యము మరియు విశ్వసించు వ్యక్తికి నిత్య జీవము ఇవ్వబడుతుంది (2 కొరింథీ. 5:17; తీతు. 3:5; 1 పేతురు 1:3; 1 యోహాను 2:29; 3:9; 4:7; 5:1-4, 18). “క్రొత్తగా జన్మించుట” అనగా యేసు క్రీస్తు నామమును నమ్ముట ద్వారా “దేవుని పిల్లలగుట” అను తలంపు కూడ వస్తుందని యోహాను 1:12, 13 సూచిస్తుంది.

“ఒక వ్యక్తి నూతనంగా ఎందుకు జన్మించాలి?” అనునది సాధారణంగా తలెత్తు ప్రశ్న. “మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను” అని ఎఫెసీ. 2:1లో అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” (రోమా. 3:23) అని ఆయన రోమీయులకు వ్రాసెను. పాపులు ఆత్మీయంగా “మరణించియున్నారు”; క్రీస్తు నందు విశ్వాసము ద్వారా వారు ఆత్మీయ జీవితమును పొందినప్పుడు, దానిని బైబిల్ నూతన జన్మతో పోలుస్తుంది. కేవలం నూతనంగా జన్మించినవారు మాత్రమే పాప క్షమాపణ పొంది దేవునితో అనుబంధం కలిగియుందురు.

ఇది ఎలా సాధ్యము? “మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు” అని ఎఫెసీ. 2:8-9 చెబుతుంది. ఒకరు రక్షింపబడినప్పుడు, అతడు/ఆమె క్రొత్తగా జన్మించి, ఆత్మీయంగా నూతనపరచబడి, క్రొత్త జన్మ హక్కు ద్వారా దేవుని బిడ్డ అవుతారు. సిలువపై మరణించుట ద్వారా పాపము యొక్క జీతమును చెల్లించిన యేసు క్రీస్తును నమ్ముట, “నూతనంగా జన్మించుటకు” మార్గము. “కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను!” (2 కొరింథీ. 5:17).

మీరు ఇప్పటి వరకు ప్రభువైన యేసు క్రీస్తును రక్షకునిగా విశ్వసించని యెడల, పరిశుద్ధాత్ముడు మీ హృదయములతో మాట్లాడుచుండగా ఆయన పిలుపును మీరు అంగీకరిస్తారా? మీరు పశ్చాత్తాప ప్రార్థన చేసి నేడు క్రీస్తులో నూతన సృష్టి కాగలరా? “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలనైనను శరీరేచ్చవలనైనను మానుషేచ్చవలననైనను పుట్టినవారు కారు" (యోహాను 1:12-13).

మీరు యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించి క్రొత్తగా జన్మించాలని కోరితే, ఇలా ప్రార్థన చేయవచ్చు. ఈ ప్రార్థన చెప్పుట లేక వేరే ఏ ప్రార్థన చెప్పుట కూడ మిమ్మును రక్షించదని జ్ఞాపకముంచుకోండి. కేవలం క్రీస్తును నమ్ముట మాత్రమే మిమ్మును పాపము నుండి రక్షించగలదు. ఈ ప్రార్థన కేవలం దేవునిలో మీకున్న విశ్వాసమును తెలియజేయుటకు మరియు మీకు రక్షణ ఇచ్చినందుకు ఆయనకు వందనములు చెల్లించుటకు ఒక మార్గము మాత్రమే. “దేవా, నేను నీకు విరోధముగా పాపము చేసితిని మరియు శిక్షకు పాత్రుడనని నాకు తెలుసు. అయితే నేను పొందవలసిన శిక్షను యేసు క్రీస్తు తీసుకొనెను మరియు ఆయనను విశ్వసించుట ద్వారా నేను క్షమాపణ పొందగలను. రక్షణ కొరకు నా విశ్వాసమును నీ మీద మోపుచున్నాను. నీ అద్భుత కృప కొరకు క్షమాపణ కొరకు-నిత్య జీవమను బహుమానము కొరకు వందనములు! ఆమేన్!”

మీరు ఇక్కడ చదివిన వాటి ఆధారంగా క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకున్నారా? అయిన యెడల, “క్రీస్తును నేడు అంగీకరించితిని” అను ఈ క్రింది బటన్ ను నొక్కండి.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

క్రొత్తగా జన్మించిన క్రైస్తవునిగా ఉండుట అనగా ఏమిటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries