మనకు రెండు లేక మూడు భాగాలు ఉన్నవా? మనము శరీరము, ప్రాణము ఆత్మ- లేక- శరీరము, ఆత్మ, ప్రాణము కలిగిన వారమా?ప్రశ్న: మనకు రెండు లేక మూడు భాగాలు ఉన్నవా? మనము శరీరము, ప్రాణము ఆత్మ- లేక- శరీరము, ఆత్మ, ప్రాణము కలిగిన వారమా?

జవాబు:
ఆదికాండం 1:26-27 చెప్తుంది మానవ జాతి ప్రస్ఫుటముగ సృష్ఠి అంతటికన్న ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నవి. మానవులు దేవునితో సంభంధం కలిగియుండుటకు సృష్ఠించబడ్డాము. ఎలా అంటే, దేవుడు మనలను పదార్థముతోను, అభౌతికముకాని భాగములతోను సృష్ఠించాడు. పదార్థము ఖచ్చితముగా స్పర్శనీయమైనది: భౌతికమైన శరీరము, ఎముకలు, అవయవములు, మొదలగునవి. మరియు ఒక వ్యక్తి జీవించినంతకాలము ఆ భౌతిక కాయముండును. అభౌతికమైనవి అన్నియు స్పర్శలేనివి: ప్రాణము, ఆత్మ, బుద్ది, చిత్తము, మనసాక్షి మొదలగునవి. ఇవన్నియు ఒక వ్యక్తి జీవించనంతకాలముకంటే అతీతముగానుండును.

ప్రతి మానవులు పదార్థము, అపదార్థమైన గుణగణాలను కలిగియున్నారు. స్పష్ఠముగా అర్థమయ్యేదేంటంటే ప్రతి మానవుని శరిరములో మాంసము, రక్తము, ఇంద్రియాలు, మరియు కణములు వున్నవి. ఏదిఏమైనా, మానవునిలోనున్న స్పర్శలేని గుణములుగురించే తరచుగా వాదనలు జరుగుతూ వుంటాయి. వీటి గురించి లేఖనము ఏమని చెప్తుంది? ఆదికాండం 2:7 చెప్తుంది మానవుడు జీవించే ప్రాణంగా సృష్ఠించబడ్డాడు. సంఖ్యాకాండం 16:22 "శరీరాత్మలకు దేవుడవైన దేవా" పిలుస్తూ ప్రతీ మానవుడు వాటిని కలిగియున్నాడు. సామెతలు 4:23 చెప్తుంది, " నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము," హృదయమే మానవుని చిత్తము మరియు భావోద్రేకములకు కేంద్రమని సూచిస్తుంది. అపోస్తలులకార్యములు 23:1 "పౌలు మహా సభవారిని తేరిచూచి - 'సహోదరులారా,నేను నేటివరకు కేవలము మంచి మనసాక్శిగల వాడనై, దేవునియెదుట నడచుకొనుచుంటినని చెప్పెను.'" పౌలు ఇక్కడ మనసాక్షిని ఎత్తిచూపిస్తున్నాడు, అది తప్పు చెడు లను ఒప్పింపచేసే మనస్సులోని ఒకభాగమై యున్నది. రోమా 12:2 తెలియపిచేది "మీరు ఈ లోకమర్యాదను అనుసరింపక , ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవునిచిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీమనస్సుమారి నూతనమగుటవలన రూపాంతరముపొందుడి." ఈ వచనాలు, మరియు ఇంకా అనేకమైన రీతులలో, మానవునిలోని అపదార్థమైన భాగములను సూచిస్తుంది. మనము ఈ రెంటిని అంటే పదార్థమైనవి మరియు అపదార్థమైనవి లక్షణాలను కలిగియుంటాం.

గనుక, లేఖనములు కేవలము జీవుడు మరియు అత్మ అని సారాంశనివేదిక నిస్తుంది. మరేదో, జీవము, ప్రాణము, ఆత్మ, హృదయము, మనస్సాక్షి, మరియు మనస్సు ఇవన్నియు ఒకదానికొకటి సంభదించినవైయున్నవి.జీవుడు మరియు ఆత్మ , అయినప్పటికి, ప్రాధమికమైన అభౌతికమైన మానవులోని కన్పడే విషయాలు. అవి ఇతర విషయాలను కూడ ఇముడ్చుకున్నట్లు తెలిస్తుంది. ఈ మనస్సుతో, మాన్వతవము ద్విభాగము గా ( రెండుగా కోసినట్లయితే శరీరము/ జీవము/- ఆత్మ), లేక త్రిధావిభాగము ( మూడుగాకోసినట్లయితే శరీరము/ జీవము/ ఆత్మ). అది అహేతుకముగా వుండడం అశక్యమైనది. అక్కడ ఈ రెండు ధృక్పధాలకు మంచి వాదనలున్నవి. ఈ వచనము ఈ వాదనను గూర్చి రెండు విషయాలను తెలియచేస్తుంది. ఆత్మ మరియు జీవము/ ప్రాణమును విభజించవచ్చు, మరియు విభజించిన ఆత్మ మరియు ప్రాణము అనేవి కేవలము దేవుడే వివేచించగలడు. మనకు ఖచ్చితముగా తెలియని దాని గురించి దృష్ఠించే బదులు, ఏదైతే మనకు తెలుసో అంటే సృష్ఠికర్తయైన దేవునిని, మనలను సృష్ఠించినవానిని "నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించిన" వానిపై దృష్ఠించుట మంచిది (కీర్తనలు 139:14).


తెలుగు హోం పేజికు వెళ్ళండి


మనకు రెండు లేక మూడు భాగాలు ఉన్నవా? మనము శరీరము, ప్రాణము ఆత్మ- లేక- శరీరము, ఆత్మ, ప్రాణము కలిగిన వారమా?