ప్రశ్న
యేసును నమ్మడం అంటే అర్థం ఏమిటి?
జవాబు
"మీరు యేసును నమ్ముతారా?" అనేది వింతైన ప్రశ్నలా అనిపిస్తుంది. ఇది "మీరు శాంటా క్లాస్‌ను నమ్ముతారా?" లేదా "మీరు గ్రహాంతరవాసులను నమ్ముతారా?" అనే ప్రశ్నలాగే అనిపిస్తుంది. కానీ "మీరు యేసును నమ్ముతారా?" అనే ప్రశ్న, "యేసు క్రీస్తు ఉనికిలో ఉన్నాడని మీరు నమ్ముతున్నారా?" అనే దానికంటే చాలా ఎక్కువ అడుగుతుంది. ఆ ప్రశ్న యొక్క నిజమైన అర్థం ఏమిటంటే, "యేసు క్రీస్తు, బైబిల్ ఆయన గురించి ఏమి చెబుతుందో, ఆయనే అని మీరు నమ్ముతున్నారా, మరియు మీరు ఆయనను మీ రక్షకునిగా నమ్ముతున్నారా?"
కాబట్టి, మీరు యేసును నమ్ముతారా?
యేసు మానవ రూపంలో ఉన్న దేవుడని మీరు నమ్ముతున్నారా (యోహాను 1:1, 14)? మీ పాపాలకు శిక్ష చెల్లించడానికి యేసు సిలువపై మరణించాడని మీరు నమ్ముతున్నారా (1 కొరింథీయులు 15:3; 2 కొరింథీయులు 5:21), వాటి కారణంగా మీరు దేవుని నుండి శాశ్వతంగా వేరుగా ఉండటానికి అర్హులు (రోమీయులు 6:23)? దేవుడుగా అవతరించిన యేసు యొక్క త్యాగమే మీ పాపాలకు ఏకైక సరియైన చెల్లింపు అని మీరు నమ్ముతున్నారా (1 యోహాను 2:2; యోహాను 14:6; అపొస్తలుల కార్యములు 4:12)?
మీరు ఈ విషయాలను నమ్ముతున్నారా? ఒకవేళ అలా అయితే, అద్భుతం. కానీ యేసు గురించిన వాస్తవాలను నమ్మడం అనేది ఈ సమీకరణంలో కేవలం ఒక భాగం మాత్రమే. బైబిల్ విశ్వాసం అనేది కొన్ని విషయాలు నిజమని నమ్మడం కంటే చాలా ఎక్కువ. బైబిల్లో చెప్పబడిన రక్షణ కలిగించే విశ్వాసం అంటే ఆ వాస్తవాలను నమ్మడం/వాటిపై ఆధారపడటం కూడా.
ఒక కుర్చీ ఒక మంచి ఉదాహరణ. మీరు ఒక కుర్చీని చూసి, అది మీ బరువును మోయగలిగేంత బలమైన పదార్థాలతో తయారు చేయబడిందని, మరియు అది సరిగ్గా అమర్చబడిందని నమ్మవచ్చు. కానీ అది బైబిల్ విశ్వాసం కాదు. బైబిల్ విశ్వాసం అంటే ఆ కుర్చీలో కూర్చోవడమే. అంటే, మీ బరువును నేల మీద పడకుండా ఆ కుర్చీ పట్టుకుంటుందని నిజంగా ఆధారపడటమే.
యేసు మీ రక్షకుడని మీరు నమ్ముతున్నారా? మీ పాపాల అప్పుకు పూర్తి చెల్లింపుగా ఆయన మరణాన్ని మీరు ఆధారం చేసుకుంటున్నారా? మీరు కూడా మరణం తర్వాత నిత్యజీవానికి లేపబడతారనే హామీగా ఆయన పునరుత్థానాన్ని ఆధారం చేసుకుంటున్నారా? అది ఎప్పటికీ జరగదని తెలిసినా, ఆత్మీయంగా చెప్పాలంటే, యేసు క్రీస్తు అనే "కుర్చీ" మీ కింద నుండి లాగబడితే, మీరు నేల మీద పడిపోతారా, లేదా ఆ కుర్చీతో పాటు ఇతర విషయాలపై కూడా ఆధారపడుతున్నారా?
యేసు గురించి బైబిల్ చెప్పేదాన్ని మీరు అర్థం చేసుకుని, నమ్మి, మరియు రక్షణకు ఆధారంగా ఆ సత్యాలపై ఆధారపడితే—మీరు రక్షించబడ్డారు! మీరు బైబిల్ పరంగా "యేసును నమ్ముతున్నారు".
యేసులో నిజంగా నమ్మకం ఉందో లేదో మీకు అనిశ్చితంగా ఉన్నా, నమ్మాలని మీరు కోరుకుంటున్నా, లేదా దేవుడు మిమ్మల్ని యేసుపై విశ్వాసం వైపు నడిపిస్తున్నాడని మీకు అనిపిస్తున్నా, తదుపరి దశ చాలా సులభం. నమ్మండి! యేసుపై విశ్వాసం ఉంచండి! మీ రక్షణ కోసం ఆయనపై ఆధారపడండి. పాపం నుండి క్షమాపణ మరియు రక్షణ వైపు మిమ్మల్ని మళ్ళించడానికి దేవుడిని అనుమతించండి.
మీరు మీ కొత్త విశ్వాసాన్ని దేవునికి మౌఖికంగా వ్యక్తపరచాలనుకుంటే, మీరు చెప్పగలిగే దాని నమూనా ఇక్కడ ఉంది: "దేవా, నేను పాపము చేసిననని నాకు తెలుసు. నా పాపాలు నన్ను నీ నుండి వేరు చేస్తుందని నాకు తెలుసు. నా పాపాలు క్షమించబడకుండా ఉంటే, అది నన్ను నీ నుండి నిత్యత్వంవరకు వేరు చేస్తుందని నాకు తెలుసు. యేసు క్రీస్తు నా రక్షకుడని నేను నమ్ముచున్నాను మరియు విశ్వసిస్తున్నాను, ఆయన నా పాపముల యొక్క పూర్తి దండను చెల్లించడానికి మరణించాడని మరియు మూడవ రోజున మృతులలో నుండి తిరిగి లేచాడని నేను నమ్ముచున్నాను. నన్ను నీతో సరియైన సంబంధంలోకి తీసుకురావడానికి నేను ఆయన యొక్క త్యాగాన్ని మాత్రమే ఆధారపడుతున్నాను. నన్ను క్షమించినందుకు ధన్యవాదాలు. నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు. నా జీవితాంతం ప్రతిరోజూ నీకు మరింత దగ్గరగా ఎదగడానికి నాకు సహాయం చేయి."
ఇక్కడ మీరు చదివిన వాటి కారణంగా మీరు క్రీస్తును స్వీకరించడానికి నిర్ణయించుకున్నారా? అలా అయితే, దయచేసి కింద ఉన్న "నేను ఈ రోజు క్రీస్తును స్వీకరించాను" అనే బటన్‌పై క్లిక్ చేయండి.
English
యేసును నమ్మడం అంటే అర్థం ఏమిటి?