settings icon
share icon
ప్రశ్న

మన పాపముల కొరకు క్రీస్తు మరణించుటకు ముందు ప్రజలు ఎలా రక్షణపొందేవారు?

జవాబు


మనుష్యుని పతనము మొదలుకొని, ఎల్లప్పుడూ క్రీస్తు మరణమే రక్షణకు పునాదిగా ఉంది. సిలువకు ముందు లేక సిలువ తరువాత, ఎవ్వరు కూడా లోక చరిత్రలో ఆ ప్రాముఖ్యమైన సన్నివేశమునకు వేరుగా రక్షణపొందలేరు. క్రీస్తు మరణము పాత నిబంధన పరిశుద్ధుల యొక్క పురాతన పాపములకు మరియు క్రొత్త నిబంధన పరిశుద్ధుల యొక్క భవిష్యత్ పాపములకు వెలను చెల్లించింది.

రక్షణకు విశ్వాసము ఎల్లప్పుడూ ఒక అవసరతగా ఉంది. రక్షణ కొరకు ఒకని విశ్వాసమునకు మూలం దేవుడైయున్నాడు. “ఆయనను ఆశ్రయించువారు ధన్యులు” అని కీర్తనాకారుడు వ్రాస్తున్నాడు (కీర్తనలు 2:12). అబ్రాహాము దేవుని నమ్మెను మరియు అది అతనికి నీతిగా ఎంచబడెను అని ఆది. 15:6 మనకు చెబుతుంది (రోమా. 4:3-8 కూడా చూడండి). హెబ్రీ. 10:1-10 స్పష్టముగా బోధించుచున్నట్లు, పాత నిబంధన బలుల వ్యవస్థ పాపమును తీసివేయలేదు. అయితే దేవుని కుమారుడు మానవజాతి పాపము కొరకు తన రక్తము చిందించిన రోజునకు అది చూపిస్తుంది.

అయితే తరాల తరబడి విశ్వాసి యొక్క విశ్వాసము మాత్రమే మారింది. ఏది నమ్మవలెను అనుదానికి దేవుని పెట్టిన అర్హత ఆ కాలము వరకు మానవజాతికి ఇవ్వబడిన ప్రత్యక్షతపై ఆధారపడియుంది. దీనిని పురోగమన ప్రత్యక్షత అని అంటారు. ఆది. 3:15లో స్త్రీ సంతతి సాతానును జయిస్తుందని దేవుడిచ్చిన వాగ్దానమును ఆదాము నమ్మాడు. ఆదాము ఆయనను నమ్మాడు, హవ్వకు అతడు ఇచ్చిన పేరులో అది వ్యక్తపరచబడింది (వ. 20) మరియు వారిని చర్మముతో కప్పుట ద్వారా దేవుడు వెంటనే అంగీకారమును వ్యక్తపరచాడు (వ. 21). ఆ సమయములో ఆదాముకు అంతమట్టుకే తెలుసు, కాని అతడు దానిని నమ్మాడు.

ఆది. 12 మరియు 15లో దేవుడు అతనికిచ్చిన వాగ్దానములు మరియు నూతన ప్రత్యక్షత ఆధారంగా అబ్రాహాము దేవుని నమ్మాడు. మోషేకు మునుపు లేఖనము వ్రాయబడలేదు, కాని దేవుడు బయలుపరచిన దానికి మానవులు బాధ్యులుగా ఉన్నారు. పాత నిబంధన అంతటిలో, దేవుడు ఒక రోజు వారి పాప సమస్యను తొలగిస్తాడని వారు నమ్మారు కాబట్టి విశ్వాసులు రక్షణలోనికి వచ్చారు. నేడు, సిలువ మీద దేవుడు మన పాపములను తీసివేశాడని నమ్ముతూ వెనుకకు చూస్తాం (యోహాను 3:16; హెబ్రీ. 9:28).

సిలువ మరియు పునరుత్థానముకు ముందు, క్రీస్తు దినములలో విశ్వాసుల విషయం ఏమిటి? వారు ఏమి నమ్మారు? వారి పాపముల కొరకు క్రీస్తు సిలువలో మరణించుట యొక్క పూర్ణ దృశ్యమును వారు గ్రహించారా? తర్వాత పరిచర్యలో, “అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లిపెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా” (మత్తయి 16:21-22). ఈ సందేశమునకు ఆయన శిష్యులు ఎలా స్పందించారు? “పేతురు ఆయన చేయి పట్టుకొనిప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను.” పేతురు మరియు ఇతర విశ్వాసులకు పూర్ణ సత్యము తెలియదు, అయినను దేవుడు వారి పాప సమస్యను తీసివేస్తాడని వారు నమ్మారు కాబట్టి వారు రక్షించబడ్డారు. ఆదాము, అబ్రాహాము, మోషే, లేక దావీదు వలెనే ఆయన దానిని ఎలా చేస్తాడో వారికి కూడా తెలియదు, కాని వారు దేవుని నమ్మారు.

నేడు, క్రీస్తు పునరుత్థానమునకు ముందు జీవించిన ప్రజలకంటే ఎక్కువ ప్రత్యక్షత మన యొద్ద ఉంది; మనకు పూర్తి దృశ్యము తెలుసు. “పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను” (హెబ్రీ. 1:1-2). ఇప్పటికీ మన రక్షణ క్రీస్తు మరణముపై ఆధారపడియుంది, రక్షణ కొరకు మన విశ్వాసము ఇప్పటికీ ఒక అవసరత, మరియు మన విశ్వాసమునకు మూలం నేటికి దేవుడే. నేడు, మన కొరకు, యేసు క్రీస్తు మన పాపముల కొరకు మరణించాడు, ఆయన పాతిపెట్టబడ్డాడు, మరియు మూడవ దినమున తిరిగిలేచాడు అనునది మన విశ్వాసములో ముఖ్యాంశము (1 కొరింథీ. 15:3-4).

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

మన పాపముల కొరకు క్రీస్తు మరణించుటకు ముందు ప్రజలు ఎలా రక్షణపొందేవారు?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries