settings icon
share icon
ప్రశ్న

వెనుకకు జారిపోయిన క్రైస్తవుడు ఇంకా రక్షించబడినవాడేనా?

జవాబు


సంవత్సరాలుగా ఇది అంతులేకుండా చర్చించబడుతున్న ఒక ప్రశ్న. "బ్యాక్‌స్లైడర్" లేదా "బ్యాక్‌స్లైడింగ్" అనే పదం కొత్త నిబంధనలో కనిపించదు మరియు పాత నిబంధనలో ప్రధానంగా ఇశ్రాయేలుకు ఉపయోగించబడింది. యూదులు, వారు దేవుని ఎన్నుకున్న ప్రజలు అయినప్పటికీ, నిరంతరం ఆయనకు వెన్ను తిరిగారు మరియు ఆయన వాక్యానికి తిరుగుబాటు చేశారు (యిర్మియా 8:9). అందుకే వారు తాము కించపరిచిన దేవునితో తమ సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి, పాపమునకు పదే పదే బలి అర్పించవలసి వచ్చింది. అయితే, ఒక క్రైస్తవుడు క్రీస్తు యొక్క పరిపూర్ణమైన, ఒకేసారి శాశ్వతంగా జరిగిన బలిని పొంది, తన పాపమునకు ఇకపై మరే బలి అర్పించాల్సిన అవసరం లేదు. దేవుడే మనకు రక్షణను సంపాదించాడు (2 కొరింథీయులు 5:21), మరియు మనం ఆయన ద్వారా రక్షించబడినందున, ఒక నిజమైన క్రైస్తవుడు తిరిగి రాకుండా పూర్తిగా దారితప్పలేడు.

క్రైస్తవులు పాపం చేస్తారు (1 యోహాను 1:8), కానీ క్రైస్తవ జీవితం పాప జీవితంగా గుర్తించబడకూడదు. విశ్వాసులు ఒక నూతన సృష్టి (2 కొరింథీయులు 5:17). మనలో పరిశుద్ధాత్మ ఉండి మంచి ఫలాలను కలుగజేస్తాడు (గలతీయులు 5:22-23). క్రైస్తవ జీవితం ఒక మార్పు చెందిన జీవితం కావాలి. క్రైస్తవులు ఎన్నిసార్లు పాపం చేసినప్పటికీ వారికి క్షమాపణ లభిస్తుంది, కానీ అదే సమయంలో వారు క్రీస్తుకు దగ్గరవుతున్న కొద్దీ క్రమంగా మరింత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. తాను విశ్వాసి అని చెప్పుకుంటూ, కానీ దానికి విరుద్ధంగా జీవిస్తున్న వ్యక్తి గురించి మనం తీవ్రమైన సందేహాలు కలిగి ఉండాలి. అవును, పాపంలోకి తిరిగి పడిపోయిన ఒక నిజమైన క్రైస్తవుడు కూడా రక్షించబడతాడు, కానీ అదే సమయంలో పాపం చేత నియంత్రించబడిన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి నిజంగా క్రైస్తవుడు కాదు.

క్రీస్తును తిరస్కరించే వ్యక్తి సంగతేమిటి? ఒక వ్యక్తి క్రీస్తును తిరస్కరిస్తే, అతను మొదటి నుండి క్రీస్తును నిజంగా ఎరుగడని బైబిల్ మనకు చెబుతుంది. 1 యోహాను 2:19 ఇలా ప్రకటిస్తుంది, "వారు మనలో నుండి బయలు వెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతో కూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడునట్లు వారు బయలు వెళ్లిరి." క్రీస్తును తిరస్కరించి, విశ్వాసానికి వీపు తిరిగిన వ్యక్తి, తాను ఎన్నడూ క్రీస్తుకు చెందినవాడు కాదని నిరూపించుకుంటున్నాడు. క్రీస్తుకు చెందినవారు క్రీస్తుతో నిలిచి ఉంటారు. తమ విశ్వాసాన్ని విడిచిపెట్టేవారికి, మొదటి నుండి విశ్వాసం అనేదే లేదు. 2 తిమోతి 2:11-13, "ఈ మాట నమ్మదగినది, ఏదనగా–మన మాయనతోకూడ చనిపోయినవారమైతే ఆయనతోకూడ బ్రదుకుదుము; సహించిన వారమైతే ఆయనతోకూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును; మనము నమ్మదగని వారమైనను, ఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు."

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

వెనుకకు జారిపోయిన క్రైస్తవుడు ఇంకా రక్షించబడినవాడేనా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries