settings icon
share icon
ప్రశ్న

దేవుని లక్షణములు ఏవి? దేవుడు ఎలా ఉంటాడు?

జవాబు


దేవుని వాక్యమైన బైబిల్ మనకు దేవుడు ఎలా ఉంటాడు మరియు దేవుడు ఎలా ఉండడు అనే విషయాలను చెప్తుంది. బైబిల్ అధికారము లేకుండా, దేవుని లక్షణములు వివరించుటకు చేసే ఎట్టి ప్రయత్నమైనను ఒక అభిప్రాయము కంటే ఎక్కువేమి కాదు, ప్రత్యేకంగా దేవుని అర్ధం చేసుకునే విషయంలో (యోబు 42:7) ఇట్టి అభిప్రాయములు చెప్పడం అనేది సరైనది కాదు. దేవుడు ఎలాగు ఉంటాడో మనం అర్ధం చేసుకొనుటకు ప్రయత్నించాలని చెప్పడం అనేది పెద్ద మాటే అవుతుంది. అలా చేయుటకు మనం విఫలమైతే దేవుని చిత్తమునకు విరుద్ధముగా వ్యర్ధ దేవతలను చేసుకొని, అనుసరించి, వాటిని ఆరాధించుటకు దారి తీస్తుంది (నిర్గమ. 20:3-5).

దేవుడు ఆయనను గురించి ఏమి బయలుపరచాలనుకుంటాడో మనం తెలుసుకొనగలుగుతాం. దేవుని గుణములలో లేదా లక్షణములలో ఒకటి “వెలుగు,” అంటే ఆయనను గూర్చిన సమాచారంలో ఆయన స్వీయప్రత్యక్షత ఇచ్చేవాడు (యెషయా 60:19; యాకోబు 1:17). దేవుడు తనను గూర్చిన జ్ఞానమును బయలుపరచాడు అనే వాస్తవం నిర్లక్ష్యపరచబడకూడదు (హెబ్రీ 4:1). సృష్టి, దేవుని లేఖనములు, మరియు శరీరధారియైన వాక్యము (యేసు క్రీస్తు) దేవుడు ఎలాగు ఉంటాడో తెలుసుకొనుటకు మనకు సహాయపడతాయి.

దేవుడు మన సృష్టికర్త అనియు మనము ఆయన సృష్టిలోని భాగములనియు (ఆదికాండము 1:1; కీర్తన 24:1) మరియు ఆయన పోలికలో మనము చేయబడ్డాము అనే జ్ఞానముతో మనము ప్రారంభిద్దాము. మానవుడు సృష్టి అంతటిమీద ఉండి దాని మీద అధికారము ఇవ్వబడ్డాడు (ఆది. 1:26-28). పతనము ద్వారా సృష్టి మాసిపోయినది, అయినను అది దేవుని చేతికార్యములకు కొన్ని సంగ్రహ అవలోకనములను ఇస్తుంది (ఆది. 3:17-18; రోమా. 1:19-20). సృష్టి యొక్క విస్తీర్ణాన్ని, సంక్లిష్టతను, అందాన్ని, మరియు క్రమాన్ని పరిగణిస్తే దేవుని యొక్క ఔన్నత్యం యొక్క భావం మనకు కలుగుతుంది.

దేవునికి ఇయ్యబడిన కొన్ని పేరుల అధ్యయనము దేవుడు ఎలాగు ఉంటాడో అనే మన పరిశీలనలో కొంత సహాయపడుతుంది. అవి కొన్ని ఈ క్రింద పేర్కొనబడ్డాయి:

ఎలోహీం – బలమైన వాడు, దైవికమైన వాడు (ఆది. 1:1)
అదోనాయ్ – ప్రభువు, ఇది యజమాని-సేవకుని బంధాన్ని సూచిస్తుంది (నిర్గమ. 4:10, 13)
ఎల్ ఎల్యోన్ – సర్వోన్నతుడు, అత్యంత బలశాలి (ఆది. 14:20)
ఎల్ రోయి – చూచుచున్న బలమైన వాడు (ఆది. 16:13)
ఎల్ షద్దాయ్ – సర్వశక్తిగల దేవుడు (ఆది. 17:1)
ఎల్ ఒలామ్ – నిత్యుడైన దేవుడు (యెషయా 40:28)
యాహ్వే – యెహోవా, “నేను,” ఐనవాడు, అనగా నిత్యుడైన స్వయంచలిత దేవుడు (నిర్గమ. 3:13, 14)

దేవుడు నిత్యుడు, అంటే ఆయనకు ఆరంభం లేదు మరియు ఆయన మనుగడ ఎన్నడు నిండదు. ఆయన మరణములేని వాడు మరియు అనంతుడు (ద్వితీయ. 33:27; కీర్తన 90:2; 1 తిమోతి 1:17). దేవుడు మార్పులేనివాడు, అంటే ఆయన మారనివాడు; దీనికి ఇంకా అర్ధం ఆయన నిశ్చయంగా ఆధారపడదగినవాడు మరియు నమ్మకమైనవాడు (మలాకీ 3:6; సంఖ్య. 23:19; కీర్తన 102: 26, 27). దేవుడు పోల్చలేనివాడు; ఆయన క్రియలలోగాని తత్వంలో గాని ఆయన వంటివారు ఎవరు లేరు. ఆయన అసమానుడు మరియు పరిపూర్ణుడు (2 సమూ. 7:22; కీర్తన 86:8; యెషయా 40:25; మత్తయి 5:48). దేవుడు అన్వేషణావకాశంలేనివాడు, అర్ధంకాని వాడు, పరిశోధనావకాశంలేనివాడు, మరియు ఆయనను పరిపూర్ణంగా అర్ధం చేసుకొనే విషయంలో అన్నిటిని అధిగమించినవాడు (యెషయా 40:28; కీర్తన. 145:3; రోమా. 11:33, 34).

దేవుడు న్యాయవంతుడు; ఆయన పక్షపాతం చూపే విషయంలో వ్యక్తులను చూసి గౌరవించేవాడు కాదు (ద్వితీయ. 32:4; కీర్తన. 18:30). ఆయన సర్వశక్తిగల వాడు; ఆయన సమస్త-శక్తిని కలిగిన వాడు మరియు ఆయనకు ఇష్టమొచ్చింది ఏదైనా చేయగలడు, కాని ఆయన చేసే పనులు ఆయని ఇతర గుణములను అనుసరించే ఉంటాయి (ప్రకటన. 19:6; యిర్మియా 32:17,27). దేవుడు సర్వాంతర్యామి, అంటే ఆయన అన్ని చోట్లా ఉన్నవాడు, అంటే దీని అర్ధం ఆయన సమస్తము అని కాదు (కీర్తన 139:7-13; యిర్మియా 23:23). ఆయన సర్వజ్ఞాని, అంటే ఆయనకు భూత, వర్తమాన మరియు భవిష్యత్తు కాలములు మరియు ఏ సమయములోనైనా మనము ఏమి ఆలోచిస్తున్నామో ఆయనకు తెలుసు. ఆయనకు సమస్తము తెలుసు గనుక, ఆయన తీర్చే తీర్పు ఎల్లప్పుడూ కూడా న్యాయవంతంగా ఉంటుంది (కీర్తన. 139:1-5; సామెతలు 5:21).

దేవుడు ఒక్కడే; ఆయన తప్ప వేరే ఎవరు లేకపోవడం మాత్రమే కాదు, మన హృదయముల యొక్క ఆశలను మరియు లోతైన అవసరతలు తీర్చగలిగేది వ్యక్తిగా ఆయనకే సాధ్యం. ఆయన మాత్రమే మన ఆరాధనకు మరియు భక్తికి అర్హుడు (ద్వితీయ. 6:4). ఆయన నీతిమంతుడు, అంటే దేవుడు తప్పిదములను వదలిపెట్టడం చేయలేదు, చేయబోడు. మన పాపములు క్షమించబడుటకు దేవుని నీతి మరియు న్యాయము వలననే మన పాప భారములు యేసుపై మోపబడినప్పుడు ఆయన దేవుని ఉగ్రతను అనుభవించవలసి వచ్చింది (నిర్గమ. 9:27; మత్తయి. 27:45-46; రోమా. 3:21-26).

దేవుడు సార్వభౌముడు, అంటే ఆయనే ఉన్నతమైనవాడు. ఆయన సృష్టించింది అంతయు కలిసి కూడా ఆయన ప్రణాళికలను నిర్వీర్యము చేయలేవు (కీర్తన. 93:1; 95:3; యిర్మియా 23:20). దేవుడు ఆత్మ, అంటే ఆయన అదృశ్యుడు (యోహాను 1:18; 4:24). ఆయన త్రియేకుడు. అయన ఒక్కడిలో ముగ్గురుగా ఉన్నను ఒకే మూలము కలవారు, సామర్ధ్యంలోను మరియు మహిమలోను సమానతగలవారు. దేవుడు సత్యమైనవాడు, ఆయన నశించనివాడిగా ఉండి అబద్ధమాడువాడు కాదు (కీర్తన 117:2; 1 సమూ. 15:29).

దేవుడు పరిశుద్ధుడు, సమస్త నైతిక అపవిత్రత మరియు ద్వేషమునకు అతీతుడు. దేవుడు సమస్త చెడును చూస్తాడు మరియు అది ఆయనకు కోపాన్ని కలిగిస్తుంది. ఆయన దహించు అగ్నిగా చెప్పబడ్డాడు (యెషయా 6:3; హబక్కుకు 1:13; నిర్గమ. 3:2, 4-5; హెబ్రీ. 12:29). దేవుడు కృపగలవాడు, ఆయన కృప తన మంచితనమును, దయను, కరుణను మరియు ప్రేమను కలిగియుంటుంది. ఆయన కృప లేకుంటే, ఆయన యొక్క పరిశుద్ధత మనలను ఆయన ప్రసన్నత నుండి దూరం చేసేది. కాని మంచిది ఇలా కానందుకు, ఎందుకంటే ఆయన మనలో ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటున్నాడు (నిర్గమ. 34:6; కీర్తన. 31:19; 1 పేతురు 1:3; యోహాను 3:16, 17:3).

దేవుడు పరిమితులు లేనివాడు గనుక, దేవుని అంత పెద్దగా ఉన్న ఈ ప్రశ్నకు ఏ మానవుడు సమాధానం ఇవ్వలేడు, కాని దేవుని వాక్యము ద్వారా, దేవుడు ఎవరో ఆయన ఎలా ఉంటాడో అనే దాని గూర్చి మనము ఎక్కువగా తెలుసుకొనగలము. మనము అందరమూ హృదయపూర్వకంగా ఆయనను వెదుకుట కొనసాగించుదుము గాక (యిర్మియా 29:13).

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

దేవుని లక్షణములు ఏవి? దేవుడు ఎలా ఉంటాడు?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries