settings icon
share icon
ప్రశ్న

నాస్తికత్వము అనగానేమి?

జవాబు


నాస్తికత్వము అనేది దేవుడు లేడు అనే చిత్రము. నాస్తికత్వము అనేది క్రొత్తగా అభివృద్ధి చేసినది కాదు. కీర్తనలు 14:1, దావీదుచే సుమారుగా 1000 B. C. లో వ్రాయబడెను, నాస్తికత్వమును ప్రస్తావిoచును: “దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు.” ఇటీవలి గణాంకాలు అధిక సంఖ్యలో ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా 10 శాతం మంది నాస్తికులుగా పేర్కొనుచున్నట్లు చూపును. అందువలన మరింతమంది ప్రజలు ఎందుకు నాస్తికులుగా మారుచున్నారు? నాస్తికులు పేర్కొన్నట్లు నాస్తికత్వము తార్కికంగా నిజమా?

ఎందుకు నాస్తికత్వం అనేది ఇంకా ఉంది? దేవుడు తననుతాను ప్రజలకు, ఆయన ఉన్నాడని సులువుగా ఎందుకు కనుపరచు కోలేదు? ఖచ్చితంగా ఒకవేళ దేవుడు అలా ప్రత్యక్షమైతే, ఆలోచన అలా వెళ్లి, ప్రతిఒక్కరు ఆయనను నమ్మియుండవచ్చు. ఇక్కడ సమస్య ఏమిటంటే ప్రజలు దేవుడు ఉన్నాడని కేవలం ఒప్పింపబడడం ఆయన కోరిక కాదు. ప్రజలు ఆయనను విశ్వాసము ద్వారా నమ్మాలని (2 పేతురు 3:9) మరియు ఆయన రక్షణ బహుమానమును విశ్వాసముచే అంగీకరించాలని దేవుని కోరిక (యోహాను 3:16). పాత నిబంధనలో చాలాసార్లు దేవుడు స్పష్టముగా తన ఉనికిని ప్రదర్శించాడు (ఆదికాండము 6-9; నిర్గమకాండము 14:21-22; 1 రాజులు 18:19-31). ప్రజలు దేవుడు ఉన్నాడని నమ్మారా? అవును. వారు వారి చెడు మార్గాలనుoడి తిరిగి మరియు దేవునికి విధేయత చూపారా? లేదు. ఒకవేళ ఒక వ్యక్తి దేవుడు ఉన్నాడని విశ్వాసం ద్వారా అంగీకరించుటకు ఇష్టపడకపోతే, అప్పుడు అతడు/ఆమె ఖచ్చితంగా యేసుక్రీస్తును విశ్వాసం ద్వారా రక్షకునిగా అంగీకరించుటకు సిద్ధముగా లేరు (ఎఫెసీ 2:8-9). కేవలం ఆస్తికులుగా (దేవుడు ఉన్నాడని నమ్మేవారు) కాకుండా, ప్రజలు క్రైస్తవులుగా మారాలని దేవుని కోరిక.

దేవుని ఉనికి విశ్వాసముద్వారానే అంగీకరించాలని బైబిలు మనకు చెప్తుంది. హెబ్రీ 11:6 ప్రకటిస్తూ, “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తనను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.” బైబిలు మనకు మనము దేవునిని విశ్వాసం ద్వారా నమ్మి మరియు విశ్వసించినప్పుడు ఆశీర్వదింపబడతామని గుర్తుచేయును: “యేసు – నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను” (యోహాను 20:29).

దేవుని ఉనికి విశ్వాసం ద్వారా అంగీకరించబడవలెను, కాని దీని అర్ధము దేవునిలో నమ్మకము న్యాయానుసారం కాదని కాదు. దేవుని ఉనికి కొరకు చాలా మంచి వాదనలు ఉండెను. విశ్వములో (కీర్తనలు 19:1-4), ప్రకృతిలో (రోమా 1:18-22), మరియు మన స్వంత హృదయాలలో (ప్రసంగి 3:11) దేవుని ఉనికి స్పష్టముగా కనబడునని బైబిలు మనకు బోధించును. చెప్పిన వాటన్నిటి బట్టి, దేవుని ఉనికి నిరూపించబడదు; అది విశ్వాసం ద్వారానే అంగీకరించబడాలి.

అదే సమయంలో, ఆస్తికత్వము నమ్ముటకు కూడా అంతే విశ్వాసం కావాలి. “దేవుడు లేడు” అని ఒక ఖచ్చితమైన ప్రకటన చేయుటకు ప్రతీది తెలిసికొనుటకు మరియు విశ్వములో ప్రతిచోటుకు వెళ్లి మరియు చూడవలసిన ప్రతీదానిని సాక్ష్యమిచ్చు టకు ప్రతీది ఖచ్చితముగా తెలుసుకొనవలెనని పేర్కొనును. అయినా, యే నాస్తికుడు ఈవిధముగా పేర్కొనడు. అయితే, దేవుడు ఖచ్చితముగా లేడు అని చెప్పడానికి వారు తప్పనిసరిగా పేర్కొనవలసినది అదే. నాస్తికులు దేవుడు లేదని నిరూపించలేరు, ఉదాహరణకు, సూర్యుని మధ్యలో, లేక బృహస్పతి మేఘాల క్రింద, లేక దూరపు మబ్బులలో నివసించడం. ఆ ప్రదేశాలు మనము గ్రహించుటకు మన సామర్థ్యాన్ని మించి ఉండెను, గనుక దేవుడు లేడని నిరూపించబడలేదు. ఒక ఆస్తికునిగా ఉండుటకు ఎంత విశ్వాసం కావాలో ఒక నాస్తికుడిగా ఉండుటకు కూడా అంతే విశ్వాసం ఉండాలి.

నాస్తికత్వము నిరూపింపబడదు, మరియు దేవుని యొక్క ఉనికి విశ్వాసం ద్వారా అంగీకరింపబడాలి. స్పష్టముగా, క్రైస్తవులు దేవుడు ఉన్నాడని బలముగా నమ్మును, మరియు దేవుని ఉనికి ఒక విశ్వాస విషయమని ఒప్పుకొనును. అదే సమయంలో, దేవునియందు నమ్మిక న్యాయానుసారం కాదు అనే ఆలోచనను మనము తిరస్కరిస్తాము. దేవుని ఉనికి స్పష్టముగా కనబడునని, ఆత్రుతతో గ్రహించి, మరియు తాత్వికంగా మరియు శాస్త్రీయంగా నిరూపింపబడుట అవసరమని మనము నమ్ముతాము. ‘’ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించియున్నది. లోకదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్లుచున్నవి” (కీర్తనలు 19:1-4).

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

నాస్తికత్వము అనగానేమి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries