settings icon
share icon
ప్రశ్న

నా రక్షణ యొక్క నిశ్చయతను నేను ఎలా కలిగియుండగలను?

జవాబు


యేసు క్రీస్తు అనుచరులు అనేకమంది రక్షణ యొక్క నిశ్చయత కొరకు సరికాని స్థలములలో వెదకుతుంటారు. దేవుడు మన జీవితాలలో చేస్తున్న పనులలో, మన ఆత్మీయ ఎదుగుదలలో, మరియు క్రైస్తవ నడతలో మనం చేయు సత్ క్రియలు మరియు దేవుని వాక్యమునకు లోబడియుండుటలో మన రక్షణ యొక్క నిశ్చయతను వెదకుటకు ప్రయత్నిస్తుంటాము. ఈ విషయములు మన రక్షణకు రుజువు కావచ్చుగాని, మన రక్షణ యొక్క నిశ్చయతను వాటిపై మనం ఆధారపరచకూడదు. అయితే, మన రక్షణ యొక్క నిశ్చయతను దేవుని వాక్యము యొక్క నిష్పాక్షిక సత్యములో మనం పొందాలి. మన పాక్షిక అనుభవాల వలనగాక, దేవుడు ఘోషించిన వాగ్దానముల ఆధారంగా మనం రక్షణ పొందాము అనే నిశ్చయత మనకు ఉండాలి.

మీరు రక్షణ యొక్క నిశ్చయత ఎలా కలిగియుండగలరు? 1 యోహాను 5:11–13 చూడండి: “దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేని వాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే.” కుమారుడు ఎవరి దగ్గర ఉన్నాడు? ఆయనను నమ్మువారిలో ఆయన ఉన్నాడు (యోహాను 1:12). మీలో యేసు ఉంటె, మీలో జీవితం ఉంది. తాత్కాలిక జీవితం కాదు, శాశ్వతమైనది.

మన రక్షణ యొక్క నిశ్చయత మనం కలిగియుండాలని దేవుడు కోరుచున్నాడు. మనం నిజముగా రక్షించబడ్డామా లేదా అని అనుదినము ఆలోచన చేయుచు చింతించుచు మన క్రైస్తవ జీవితాలను మనం జీవించకూడదు. అందువలనే రక్షణ ప్రణాళికను బైబిల్ చాలా స్పష్టం చేస్తుంది. యేసు క్రీస్తునందు నమ్మికయుంచుడి (యోహాను 3:16; అపొ. 16:31). “అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు” (రోమా. 10:9). మీ పాపముల నుండి మీరు మారుమనస్సు పొందారా? మీ పాపముల యొక్క పరిహారమును చెల్లించుటకు యేసు మరణించి మరణము నుండి తిరిగిలేచాడని మీరు నమ్ముచున్నారా (రోమా. 5:8; 2 కొరింథీ. 5:21)? మీ రక్షణ కొరకు కేవలం ఆయనను మాత్రమే నమ్ముచున్నారా? ఈ ప్రశ్నలకు మీ జవాబు “అవును” అయినయెడల, మీ రక్షించబడినట్లే! నిశ్చయత అనగా సందేహము నుండి స్వతంత్రత. దేవుని వాక్యమును హృదయములోనికి తీసుకొనుట ద్వారా, మీ నిత్య రక్షణ యొక్క సత్యమును గూర్చి మీలో ఎలాంటి సందేహము ఉండదు.

ఆయనను నమ్మువారికి యేసు స్వయంగా నిశ్చయత ఇచ్చుచున్నాడు: “నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు” (యోహాను 10:28–29). నిత్య జీవితము కేవలము-నిత్యము. ఎవరు కూడా, మీరు సహితం, క్రీస్తులో దేవుడిచ్చు రక్షణ బహుమానమును తీసివేయలేరు.

ఆయనకు విరోధంగా పాపం చేయకుండా ఉండుటకు దేవుని వాక్యమును మన హృదయాలలో దాచుకుంటాము (కీర్తనలు 119:11), మరియు దీనిలో సందేహమను పాపం కూడా ఉంది. దేవుని వాక్యము మీతో చెప్పుదానిలో ఆనందించండి: సందేహించుటకు బదులు, మనం నిశ్చయతతో జీవించవచ్చు! మన రక్షణ ఎన్నడు ప్రశ్నించబడదు అను క్రీస్తు యొక్క సొంత మాటలలో మనం నిశ్చయత కలిగియుండవచ్చు. మన రక్షణ యొక్క నిశ్చయత యేసు క్రీస్తు ద్వారా దేవుడిచ్చిన పరిపూర్ణ రక్షణపై ఆధారపడియుంది.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

నా రక్షణ యొక్క నిశ్చయతను నేను ఎలా కలిగియుండగలను?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries