ఒకసారి రక్షింపబడితే, ఎల్లప్పుడూ రక్షింపబడినట్లే?


ప్రశ్న: ఒకసారి రక్షింపబడితే, ఎల్లప్పుడూ రక్షింపబడినట్లే?

జవాబు:
ఒక వ్యక్తి ఒక సారి రక్షింపబడితే, అతడు ఎల్లప్పుడూ రక్షింపబడినట్లేనా? ప్రజలు క్రీస్తును మన రక్షకునిగా యెరిగినప్పుడు, వారు దేవునితో అనుబంధంలోనికి తీసుకొనిరాబడతారు మరియు అది వారికి నిత్య రక్షణను నిశ్చయిస్తుంది. ఈ సత్యమును అనేక లేఖనములు ప్రకటిస్తాయి. (a) రోమా 8:30 ప్రకటిస్తుంది, “మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.” దేవుడు మనలను ఎన్నుకొన్న తక్షణం నుండి పరలోకంలో ఆయన సన్నిధిలో మనం మహిమపరచబడినట్లు అవుతామని ఈ వచనం చెబుతుంది. దేవుడు పరలోకంలో నిర్థారించాడు కాబట్టి, విశ్వాసి ఒక రోజు మహిమపడచబడకుండా ఆపగలగినది ఏది లేదు. ఒక సారి ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడితే, ఆయన రక్షణ భద్రపరచబడుతుంది – ఆయన ఇప్పుడే పరలోకములో ఉన్నంత భద్రత ఉంటుంది.

(b) రోమా 8:33-34లో పౌలు రెండు ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతున్నాడు, “దేవుని చేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే; శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే.” దేవుడు ఎన్నుకున్న వారిపై నేరము ఎవరు మోపగలరు? ఎవరు మోపలేరు, ఎందుకంటే క్రీస్తు మన న్యాయవాది. మనలను ఎవరు శిక్షించగలరు? ఎవరు కారు, ఎందుకంటే మన కొరకు మరణించిన యేసే శిక్షించువాడు. మనకు న్యాయవాది మరియు న్యాయాధిపతి రక్షకునిగా ఉన్నాడు.

(c) విశ్వాసులు నమ్మినప్పుడు తిరిగి జన్మిస్తారు (నూతనపరచబడతారు) (యోహాను 3:3; తీతు. 3:5). ఒక క్రైస్తవునికి రక్షణ కోల్పోవుటకు, అతడు తన నూతన అవస్థను తిరగబెట్టాలి. నూతన జన్మ వెనక్కి తీసుకోబడుతుందని బైబిల్ ఎలాంటి రుజువు ఇవ్వదు. (d) పరిశుద్ధాత్మ విశ్వాసులందరిలో నివసించి (యోహాను 14:17; రోమా. 8:9) నమ్మువారందరికి క్రీస్తు శరీరములోనికి బాప్తిస్మమిస్తుంది (1 కొరింథీ. 12:13). ఒక విశ్వాసి తన రక్షణను కోల్పోవుటకు, పరిశుద్ధాత్మ “నివాసము-విడిచిపెట్టాలి” మరియు క్రీస్తు శరీరము నుండి వేరవ్వాలి.

(e) యేసు క్రీస్తును నమ్ము ప్రతి వాడు “నిత్య జీవమును” పొందుతాడని యోహాను 3:15 వ్యాఖ్యానిస్తుంది. నేడు నీవు క్రీస్తును నమ్మి నిత్య జీవము పొంది, రేపు దానిని కోల్పోయిన యెడల, అది అసలు “నిత్యమైనదే” కాదు. కాబట్టి మీరు రక్షణను కోల్పోతే, బైబిల్ లోని నిత్య జీవమును గూర్చిన వాగ్దానములు తప్పులవుతాయి. (f) అత్యంత నిర్థారణ కలిగించు ముగింపు కొరకు, లేఖనం స్వయంగా మాట్లాడుతుంది, “మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను” (రోమా. 8:38-39). మిమ్మును రక్షించిన దేవుడే మిమ్మును కాపాడతాడని గుర్తుంచుకోండి. మన రక్షణ నిశ్చయంగా నిత్య భద్రత కలిగినది!

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
ఒకసారి రక్షింపబడితే, ఎల్లప్పుడూ రక్షింపబడినట్లే?

ఎలా దొరుకుతుందో తెలుసుకోండి ...

దేవునితో శాశ్వతత్వం ఖర్చుదేవుని నుండి క్షమాపణ పొందండి