settings icon
share icon
ప్రశ్న

త్రిత్వమును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?

జవాబు


క్రైస్తవ సిద్ధాంతమైన త్రిత్వములోని కష్టమైన విషయం ఏమిటంటే దానిని తగిన విధంగా వివరించే మార్గము లేదు. త్రిత్వం అనే ఆలోచనను ఏ మానవుడు కూడా సంపూర్ణంగా అర్థం చెసుకొనలేడు, వివరించుట ప్రక్కన పెట్టండి. దేవుడు మనందరికంటే మితిలేనంత గొప్పవాడు; కాబట్టి, మనం ఆయనను పూర్తిగా అర్థం చేసుకోవాలని ఆశించకూడదు. తండ్రి దేవుడని, యేసు దేవుడని, మరియు పరిశుద్ధాత్ముడు దేవుడని బైబిల్ బోధిస్తుంది. ఒకే దేవుడు ఉన్నాడని కూడా బైబిల్ బోధిస్తుంది. త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తిత్వాల యొక్క అనుబంధమును గూర్చి కొన్ని సత్యములను మనం అర్థం చేసుకోగలిగినప్పటికీ, చివరికి, అది మానవ జ్ఞానమునకు అందేదికాదు. అంటే, త్రిత్వం సత్యం కాదని మరియు బైబిల్ బోధలపై ఆధారపడిలేదని కూడా అర్థం కాదు.

త్రిత్వం అనగా ఏకైక దేవుడు మూడు వ్యక్తిత్వాలలో ఉండుట. అయితే ఇది ఏ విధంగా కూడా ముగ్గురు దేవుళ్ళను సూచించుట లేదని అర్థం చేసుకోండి. ఈ అంశమును చదువునప్పుడు “త్రిత్వం” అనే మాట లేఖనములో లేదని మనస్సులో పెట్టుకోండి. ఇది త్రియేక దేవుని వర్ణించుటకు ఉపయోగించబడిన ఒక పదం-దేవునిలో మూడు కలిసియుండు, కలిసి-నిత్యముండు వ్యక్తిత్వాలు ఉన్నారు. అయితే “త్రిత్వము” ప్రాతినిథ్యం వహించు ఆలోచన మాత్రం లేఖనములో ఉన్నదనునది ముఖ్యమైన విషయం. దేవుని వాక్యం త్రిత్వమును గూర్చి ఈ క్రింద విషయములను చెబుతుంది:

1) ఒకే దేవుడు ఉన్నాడు (ద్వితీ. 6:4; 1 కొరింథీ. 8:4; గలతీ. 3:20; 1 తిమోతి 2:5).

2) త్రిత్వములో ముగ్గురు వ్యక్తిత్వాలు ఉన్నారు (ఆది. 1:1, 26; 3:22; 11:7; యెషయా 6:8, 48:16, 61:1; మత్తయి 3:16-17, 28:19; 2 కొరింథీ. 13:14). ఆది. 1:1లో, Elohim అనే హెబ్రీ బహువచన నామవాచకం ఉపయోగించబడింది. ఆది. 1:26, 3:22, 11:7 మరియు యెషయా 6:8లో, “మా” కొరకు అనే బహువచన సర్వనామం ఉపయోగించబడింది. Elohim అను పదం మరియు “మా” అను సర్వనామం, హెబ్రీ భాషలో ఖచ్చితంగా రెండు కంటే ఎక్కువ మందిని సూచిస్తుంది. త్రిత్వమునకు ఇది స్పష్టమైన వాదన కానప్పటికీ, ఇది దేవునిలో బహుళత్వమును సూచిస్తుంది. దేవునికి హెబ్రీ పదమైన Elohim ఖచ్చితముగా త్రిత్వమును సూచిస్తుంది.

యెషయా 48:16 మరియు 61:1లో, తండ్రి మరియు పరిశుద్ధాత్మను సంబోధిస్తూ కుమారుడు మాట్లాడుతున్నాడు. కుమారుడు మాట్లాడుతున్నాడని చూచుటకు యెషయా 61:1ని లూకా 4:14-19తో పోల్చండి. మత్తయి 3:16-17 యేసు బాప్తిస్మమునకు సంబంధించిన సంఘటనలను వివరిస్తుంది. మత్తయి 28:19 మరియు 2 కొరింథీ. 13:14 త్రిత్వంలోని ముగ్గురు విశేష వ్యక్తిత్వాలకు ఉదాహరణగా ఉంది.

3) త్రిత్వములోని సభ్యులు అనేక లేఖన భాగాలలో ఒకరితో మరొకరు భిన్నంగా చూపబడ్డారు. పాత నిబంధనలో “LORD” (యెహోవా) అను పదం “Lord” (ప్రభువు) అనే పదమునకు భిన్నంగా చూపబడినది (ఆది. 19:24; హోషేయ 1:4). యెహోవాకు కుమారుడున్నాడు (కీర్తనలు 2:7, 12; సామెతలు 30:2-4). “యెహోవా” (సంఖ్యా. 27:18) మరియు “దేవుని” (కీర్తనలు 51:10-12) నుండి ఆత్మ భిన్నంగా చూపించబడెను. కుమారుడైన దేవుడు తండ్రియైన దేవుని నుండి భిన్నంగా చూపించబడెను (కీర్తనలు 45:6-7; హెబ్రీ. 1:8-9). క్రొత్త నిబంధనలో, సహాయకుడైన పరిశుద్ధాత్మను పంపించుట కొరకు యేసు తండ్రితో మాట్లాడుచున్నాడు (యోహాను 14:16-17). యేసు తన్ను తాను తండ్రిగా లేక పరిశుద్ధాత్మగా పరిగణించుకొనలేదని ఇది చూపిస్తుంది. క్రొత్త నిబంధనలో యేసు తండ్రితో మాట్లాడుతున్న ఇతర సందర్భాలను పరిగణించండి. అయన తనలో తాను మాట్లాడుకొనుచున్నాడా? లేదు. ఆయన త్రిత్వములో మరొక వ్యక్తియైన తండ్రితో మాట్లాడుతున్నాడు.

4) త్రిత్వంలో పర్తి సభ్యుడు దేవుడే. తండ్రి దేవుడు (యోహాను 6:27; రోమా. 1:7; 1 పేతురు 1:2). కుమారుడు దేవుడు (యోహాను 1:1, 14; రోమా. 9:5; కొలొస్సి. 2:9; హెబ్రీ. 1:8; 1 యోహాను 5:20). పరిశుద్ధాత్ముడు దేవుడు (అపొ. 5:3-4; 1 కొరింథీ. 3:16).

5) త్రిత్వములో ఆధీనత్వము ఉంది. పరిశుద్ధాత్ముడు తండ్రి మరియు కుమారుని ఆధీనంలో ఉన్నట్లు లేఖనం చూపిస్తుంది. ఇది అంతరంగ అనుబంధం మరియు త్రిత్వంలో ఏ వ్యక్తి యొక్క దైవత్వమును కూడా ఇది నిరాకరించదు. అవధులులేని దేవుని మన మితమైన ఆలోచన అర్థం చేసుకోలేని భాగమిది. కుమారుని గూర్చి లూకా 22:42, యోహాను 5:36, యోహాను 20:21, మరియు 1 యోహాను 4:14 చూడండి. పరిశుద్ధాత్మను గూర్చి యోహాను 14:16, 14:26, 15:26, 16:7, మరియు ముఖ్యంగా యోహాను 16:13-14 చూడండి.

6) త్రిత్వంలో సభ్యులకు వేర్వేరు వ్యక్తిగత పనులు ఉన్నాయి. తండ్రి సర్వలోకమునకు నిధి మరియు కారకుడుగా ఉన్నాడు (1 కొరింథీ. 8:6; ప్రకటన 4:11); దైవిక ప్రత్యక్షత (ప్రకటన 1:1); రక్షణ (యోహాను 3:16-17); మరియు యేసు యొక్క మానవ క్రియలు (యోహాను 5:17, 14:10). తండ్రి ఈ విషయములన్ని ఆరంభించువాడు.

తండ్రి ఈ క్రింద కార్యములు కుమారుని ద్వారా చేస్తాడు: లోకము యొక్క సృష్టి మరియు కొనసాగింపు (1 కొరింథీ. 8:6; యోహాను 1:3; కొలొస్సీ. 1:16-17); దైవిక ప్రత్యక్షత (యోహాను 1:1, 16:12-15; మత్తయి 11:27; ప్రకటన 1:1); మరియు రక్షణ (2 కొరింథీ. 5:19; మత్తయి 1:21; యోహాను 4:42). తండ్రి ఈ కార్యములన్ని రాయబారిగా వ్యవహరించు తండ్రి ద్వారా చేస్తాడు.

తండ్రి ఈ క్రింద కార్యములు పరిశుద్ధాత్ముని ద్వారా చేస్తాడు: లోకము యొక్క సృష్టి మరియు కొనసాగింపు (ఆది. 1:2; యోబు 26:13; కీర్తనలు 104:30); దైవిక ప్రత్యక్షత (యోహాను 16:12-15; ఎఫెసీ. 3:5; 2 పేతురు 1:21); రక్షణ (యోహాను 3:6; తీతు. 3:5; 1 పేతురు 1:2); మరియు యేసు కార్యములు (యెషయా 61:1; అపొ. 10:38). ఈ విధంగా తండ్రి అన్ని పనులు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చేస్తాడు.

త్రిత్వము కొరకు ఉదాహరణలు రూపించుటకు అనేక ప్రయత్నాలు చేయబడ్డాయి. అయితే, ప్రఖ్యాతిగాంచిన ఏ ఉదాహరణ కూడా పరిపూర్ణంగా ఖచ్చితమైనది కాదు. గుడ్డు (లేక ఆపిల్) దానిలో విఫలమవుతాయి, టెంకు, తెలుపు, మరియు పసుపు సొన గుడ్డులో భాగములేగాని గుడ్డు కాదు, అలాగే తోలు, పండు, మరియు గింజలు ఆపిల్ లో భాగములే గాని ఆపిల్ కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు దేవునిలో భాగములు కాదు; వారిలో ప్రతి ఒక్కరు దేవుడైయున్నారు. నీటి ఉదాహరణ కొంత వరకు మేలైనది, కాని అది కూడా త్రిత్వమును సంపూర్ణంగా వర్ణించదు. ద్రవ్యం, ఆవిరి, మరియు మంచు గడ్డ నీరు యొక్క మూడు రూపములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు దేవుని యొక్క రూపములు కారు, వారిలో పర్తి వారు దేవుడు. కాబట్టి, ఈ ఉదాహరణలు మనకు త్రిత్వమును గూర్చి కొంత అవగాహన ఇచ్చుచున్నప్పటికీ, ఆ అవగాహన స్పష్టమైనది కాదు. అవధులు లేని దేవుడు మితమైన ఉదాహరణలతో వర్ణించబడలేడు.

త్రిత్వ సిద్ధాంతము క్రైస్తవ సంఘ చరిత్ర అంతటిలో ఒక వేర్పాటువాద సమస్యగా ఉంది. త్రిత్వము యొక్క ప్రాముఖ్యమైన అంశాలు దేవుని వాక్యంలో స్పష్టముగా ఇవ్వబడినప్పటికీ, కొన్ని ప్రక్క సామాన్య స్పష్టముగా ఇవ్వబడలేదు. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, మరియు పరిశుద్ధాత్ముడు దేవుడు-కాని ఒకే దేవుడు ఉన్నాడు. ఇది బైబిల్ సిద్ధాంతమైన త్రిత్వము. దానిని మించి, సమస్యలన్ని, కొంత వరకు వాదించదగినవి మరియు ప్రాముఖ్యమైనవి కావు. మన మితమైన మానవ మనస్సులతో త్రిత్వమును సంపూర్ణంగా నిర్వచించుటకు ప్రయత్నించుట కంటే, దేవుని గొప్పతనం మరియు ఆయన యొక్క మితములేని గొప్ప స్వభావముపై దృష్టిపెట్టుట మనకు మేలు కలిగిస్తుంది. “కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లన రాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణకలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!” (రోమా. 11:33-34).

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

త్రిత్వమును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries