పది ఆఙ్ఞలు ఏవి?ప్రశ్న: పది ఆఙ్ఞలు ఏవి?

జవాబు:
పది ఆఙ్ఞలు అనేవి బైబిలులోని పది న్యాయసూత్రాలను దేవుడు ఇశ్రాయేలీయుల దేశపు ప్రజలకు వారు ఈజిప్టునుండి నిర్గమము చెందినపుడు త్వరితముగానే ఇచ్చినవి. ఈ పది ఆఙ్ఞలు పాతనిబంధనలోని న్యాయసూత్రములలో వున్న 613 ఆఙ్ఞల సారాంశమును సమకూర్చి ప్రాముఖ్యముగా విశ్లేషించినవి. మొదటి ఆఙ్ఞలు దేవునితో మనకున్న సంభంధ వ్యవహారాన్ని వివరిస్తున్నాయి. చివరి ఆరు ఆఙ్ఞలు ఒకరితో ఒకరికి ఉండవల్సిన సంభంధాన్ని వివరిస్తున్నాయి. పది ఆఙ్ఞలు నిర్గమకాండము 20:1-17 మరియు ద్వితియోపదేశకాండము 5:6-21 మరియు ఈ క్రిందనివ్వబడినవి:

1) “నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు.” ఈ ఆఙ్ఞ ఈ సత్యమైన దేవునికి వ్యతిరేకముగా ఏ దేవుడిని ఆరాధించకూడదు, ఇతర దేవుళ్ళన్ని తప్పుడు దేవుళ్ళే.

2) “పైనున్న ఆకాశమందేగాని, క్రిందనున్న భూమియందే గాని భూమి క్రిందనున్న నీళ్ళయందేగాని, యుండు దేని పోలికైనైన విగ్రహమును చేసికొనకూడదు. వాటికి నమస్కరింపకూడదు: వాటిని పూజింపకూడదు. నీదేవుడైన యెహోవాయగు నేను రోషముగల దేవుడను: నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆఙ్ఞలను గైకొనువారి విషయములో వేయితరముల వరకు కరుణించువాడనై యున్నాను.” ఈ ఆఙ్ఞ ఒక విగ్రహమును చేయుట మరియు ఒక దృశ్యమైన దానిని దేవునికి ప్రత్యామ్నాయముగా కలిగియుండుటకు వ్యతిరేకమైనది. దేవునిని వర్ణించుటకు సరియైనది ఎటువంటిది ఖచ్చితమైన దానితో పోల్చలేము. దేవునికి బదులు ఒక విగ్రహాన్ని ఆరాధించుటకు పోల్చినట్లయితే అది తప్పుడు విగ్రహారధన అవుతుంది.

3) “నీదేవుడైన యెహోవా నామమును వ్యర్ధముగా ఉచ్చరించకూడదు: యెహోవా తన నామమును వ్యర్ధముగా ఉచ్చరించు వానిని నిర్ధోషిగా ఎంచడు.” ఈ ఆఙ్ఞ ప్రభువు నామమును వ్యర్ధముగా ఉచ్చరించుటకు వ్యతిరేకముగా చెప్పుతున్నది. మనము దేవుని నామమును చాల చులకనగా చూడకూడదు. దేవుని నామాన్ని కేవలము మర్యాదగాను మరియు గౌరవప్రదముగాను నుచ్చరించినట్లయితే మనము దేవునికి పూజ్యభావం చూపించినట్లవుతుంది.

4) “నీదేవుడైన యెహోవా నీ కాఙ్ఞాపించినట్లు విశ్రాంతిదినమును పరిశుద్దముగా ఆచరించుము. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీకుమార్తెయైనను నీదాసుడైనను నీదాసినైనను నీ యెద్దయైనను నీ గాడీదయైనను నీ పశువులలో ఏదైనను నీఇండ్లలోనున్న పరదేశీయైనను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీవలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను. ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవదినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్దపరచెను.” ఈ ఆఙ్ఞ సబ్బాతు దినమును ప్రత్యేకముగా ప్రక్కకు పెట్టి (శనివారము, వారము చివరి దినము) ప్రభువుకు ప్రతిష్టించవలెను.

5) “నీదేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీతల్లిని సన్మానించుము.” ఈ ఆఙ్ఞ ఎల్లప్పుడు ఒకరి తల్లిదండ్రులను ఘనతతోను మరియు గౌరవముతోను వ్యవహరించవలెనని చెప్పుతుంది.

6) “నీవు నరహత్య చేయకూడదు.” ఈ ఆఙ్ఞ మరొక తోటి మానవునిపై ముందుగా నిశ్చయించిన హత్యకు వ్యతిరేకముగా నున్నది.

7) “నీవు వ్యభిచరింపకూడదు.” ఈ ఆఙ్ఞ నీ సహచరిణితో తప్ప వేరొక వ్యక్తితో లైంగిక సంభంధముండకూడదు.

8) “నీవు దొంగిలించకూడదు.” ఒకని స్వంతముకానిదేదైన అదిఎవరికైతే చెందినదో ఆ వ్యక్తి అనుమతిలేకుండా తీసికొనుట ఈ ఆఙ్ఞకు వ్యతిరేకమైనది.

9) “నీ పొరుగువానిమీద అబద్ద సాక్ష్యము పలుకకూడదు.” మరొక వ్యక్తిపై తప్పుడు సాక్ష్యము నివ్వడం నిషేధించుట ఈ ఆఙ్ఞకు విరుద్దమైనది. ఈ ఆఙ్ఞ కేవలము అబద్ద మాడుటకు వ్యతిరేకము.

10) “నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అత్ని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను.” ఒకని స్వంతముకానిదేదైన ఆశించుటకు వ్యతిరేకమైనది. అపేక్షించడం అనేది పైనున్న ఆఙ్ఞలలో ఒకదానిని అతిక్రమించినట్లే: హత్య, జారత్వము మరియు దొంగిలించడం. వాటిలో ఒకదానిని చేయుట ఎంత తప్పో, వాటిని ఆశించుట కూడా అంతే తప్పు.

చాలమంది ఈ పది ఆఙ్ఞలు అవి ఒక కట్టుబడితో కూడిన నిబంధనలు, వాటిని తప్పకుండ వెంబడించవలసిందే, మరణము తర్వాత పరొలోకములో ప్రవేశించుటకు తప్పనిసరి అని అభయమిస్తాయి. దానికి విరుద్దముగా, ఈ పది ఆఙ్ఞల ఉద్దేశ్యము ప్రజలను వారు ఖచ్చితముగా ఈ న్యాయనికి పూర్తిమత్వముతో విధేయత చూపించలేరని గ్రహించుటకు వారిని బలవంతపరుస్తుంది(రోమా 7:7-11), మరియు అందుచేత వారికి దేవుని యొక్క కృప మరియు దయ అవసరత చాలా ఉన్నది. మత్తయి 19:16 లోనున్న ధనికుడు యౌవనుడైన పరిపాలకుడు ఆరోపించినవాటికి విరుద్దముగా, ఏఒక్కరూ కూడా పూర్తిమత్వముతో ఈ పది ఆఙ్ఞలను విధేయత చూపించలేరు(ప్రసంగి 7:20). ఈ పది ఆఙ్ఞలను మనందరము పాపముచేసినవారమని తెలియపరుస్తున్నాయి(రోమా 3:23)మరియు అందుచేత వారికి దేవుని యొక్క కృప మరియు దయ అవసరత చాలా ఉన్నది, అది కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసముంచడము వలన దొరుకుతుంది.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


పది ఆఙ్ఞలు ఏవి?