ప్రభువు భోజనం/క్రైస్తవ సంస్కారము యొక్క ప్రాముఖ్యత ఏమిటి?


ప్రశ్న: ప్రభువు భోజనం/క్రైస్తవ సంస్కారము యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

జవాబు:
ప్రభువు భోజనమును గూర్చిన అధ్యయనం దానిలోని అర్థము యొక్క లోతు వలన ఆత్మను శోధించునదిగా ఉంది. మనం నేడు ఆచరించు ఈ నూతన సహవాస భోజనమును ఆయన మరణమును పురస్కరించుకొని యేసు యుగముల నుండి జరుపుకొనుచున్న పస్కా పండుగ దినమున స్థాపించాడు. ఇది క్రైస్తవ ఆరాధనలో ఒక ముఖ్యమైన భాగము. ఇది ప్రభువు యొక్క మరణమును మరియు పునరుత్థానమును జ్ఞాపకం చేసుకొనుటకు మరియు భవిష్యత్తులో ఆయన మహిమ గల రాక కొరకు ఎదురుచూచుటలో మనకు సహాయం చేస్తుంది.

యూదా మత వత్సరములో పస్కా ఒక అతి పరిశుద్ధమైన పండుగ. అది ఐగుప్తీయుల ప్రథమ సంతానమును సంహరించుటకు వచ్చిన చివరి తెగులును మరియు గొర్రెపిల్ల యొక్క రక్తము గవిని కమ్మిలపై పూయుట ద్వారా ఇశ్రాయేలీయులకు కలిగిన రక్షణను పురస్కరించుకొని జరుపుతారు. ఆ తరువాత ఆ గొర్రె పిల్ల కాల్చబడి పులియని రొట్టెతో తినేవారు. రానున్న తరములన్నిటిలో పండుగ జరపబడాలనేది దేవుని ఆజ్ఞ. నిర్గమకాండము 12లో ఈ కథ వ్రాయబడినది.

చివరి భోజనములో-పస్కా వేడుక-యేసు ఒక రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన దానిని విరచి తన శిష్యులకు ఇస్తూ, ఇలా అన్నాడు, “పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చిఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాప కము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టు కొనిఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతోకూడ ఈ బల్లమీద ఉన్నది” (లూకా 22:19-21). ఒక కీర్తన పాడుట ద్వారా ఆయన ఆయన పర్వమును ముగించాడు (మత్తయి 26:30), మరియు వారు ఆ రాత్రి ఒలివల కొండకు వెళ్లారు. ముందుగా చెప్పబడినట్లు అక్కడ యేసు యూదా ద్వారా అప్పగించబడెను. ఆ మరుసటి రోజు ఆయన సిలువవేయబడెను.

ప్రభువు భోజనము యొక్క కథనములు సువార్తలలో మనం చూడగలము (మత్తయి 26:26-29; మార్కు 14:17-25; లూకా 22:7-22; మరియు యోహాను 13:21-30). 1 కొరింథీ. 11:23-29లో అపొస్తలుడైన పౌలు ప్రభువు భోజనమును గూర్చి వ్రాసాడు. సువార్తలలో లేని ఒక కథనమును పౌలు జోడిస్తున్నాడు: “కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.” (1 కొరింథీ. 11:27-29). రొట్టె మరియు పాత్రలో అయోగ్యముగా పాలుపంచుకొనుట అంటే అర్థం ఏమిటి అని మనం అడగవచ్చు. అంటే రొట్టె మరియు పాత్ర యొక్క నిజమైన అర్థమును గ్రహింపక మన రక్షణ కొరకు రక్షకుడు చెల్లించిన వెలను మరచిపోవుట కావచ్చు. లేక ఆ సంస్కారమును ఒక జీవములేని పరంపరగా మార్చుట లేక ప్రభువు బల్లలోనికి ఒప్పుకొని పాపముతో వచ్చుట కావచ్చు. పౌలు యొక్క హెచ్చరికను అనుసరిస్తూ, రొట్టెను తిని పాత్రలోనిది త్రాగుటకు ముందు మనం స్వపరీక్ష చేసుకోవాలి.

పౌలు చేసిన సువార్త కథనములలో లేని మరొక వ్యాఖ్య ఏమనగా, “మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు” (1 కొరింథీ. 11:26). యాది ఈ సంస్కారమునకు కాలవ్యవధిని ఇస్తుంది-మన ప్రభువు తిరిగివచ్చు వరకు. రెండు బలహీనమైన వస్తువులను తన శరీరము మరియు రక్తమునకు సూచనలు ఉపయోగించి అయన మరణమునకు అవి జ్ఞాపికలుగా మారునట్లు యేసు ఎలా చేశాడో ఈ క్లుప్త కథనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అది పాలరాతి లేక ఇత్తడి జ్ఞాపిక కాదుగాని, రొట్టె మరియు ద్రాక్షారసము.

రొట్టె విరవబడు తన శరీరమునకు సూచన అని ఆయన అన్నాడు. ఒక ఎముక కూడా విరగలేదు గాని, ఆయన శరీరం గుర్తించలేని విధముగా హింసించబడెను (కీర్తనలు 22:12-17; యెషయా 53:4-7). ద్రాక్ష రసము ఆయన రక్తమును గూర్చి మాట్లాడుతుంది, మరియు ఆయన అనుభవించబోవు ఘోర మరణమును సూచిస్తుంది. విమోచకుని గూర్చి పాత నిబంధనలో చేయబడిన లెక్కలేనన్ని ప్రవచనములకు పూర్ణ దైవ కుమారుడైన ఆయన నెరవేర్పు అయ్యాడు (ఆది. 3:15; కీర్తనలు 22; యెషయా 53). “నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి” అని ఆయన చెప్పినప్పుడు, ఇది భవిష్యత్తులో కొనసాగించవలసిన సంస్కారమని ఆయన సూచించాడు. గొర్రెపిల్ల యొక్క మరణము అవసరమై లోక పాపములను మోసుకొనిపోవుటకు రానున్న దేవుని గొర్రెపిల్ల కొరకు ఎదురుచూసి, ప్రభువు భోజనములో నెరవేర్చబడిన పస్కా పండుగను కూడా ఇది సూచిస్తుంది. పస్కా గొర్రెపిల్ల (1 కొరింథీ. 5:7) అయిన క్రీస్తు అర్పించబడినప్పుడు (హెబ్రీ. 8:8-13) క్రొత్త నిబంధన పాత నిబంధన స్థానమును తీసుకుంది బలుల వ్యవస్థ యొక్క అవసరం ఇక లేదు (హెబ్రీ. 9:25-28). ప్రభువు భోజనం/క్రైస్తవ సంస్కారము క్రీస్తు మన కొరకు చేసిన దాని యొక్క జ్ఞాపిక మరియు ఆయన బలికి పరిణామముగా మనం పొందిన వాటి యొక్క వేడుకగా ఉంది.

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
ప్రభువు భోజనం/క్రైస్తవ సంస్కారము యొక్క ప్రాముఖ్యత ఏమిటి?