settings icon
share icon
ప్రశ్న

ప్రభు ప్రార్థన అనగా ఏమిటి మరియు దానిని మనము ప్రార్థించాలా?

జవాబు


మత్తయి 6:9-13 మరియు లూకా 11:2-4లో ప్రభువైన యేసు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనే ప్రభు ప్రార్థన. మత్తయి 6:9-13 చెప్తూ, “కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, - పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచ బడు గాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.” చాలామంది ప్రజలు ప్రభు ప్రార్థ న మనము ప్రతి పదము ఉచ్చరించాలనుకొని అపార్థము చేసికొనును. కొంతమంది ప్రజలు ప్రభు ప్రార్థనను ఒక మాయా సూత్రముగా, ఒకవేళ ఆ పదములు వాటికవే ఏదో నిర్దిష్ట శక్తి కలిగి లేక దేవునితో ప్రభావితం చేయబడునని భావించును.

బైబిలు దానికి వ్యతిరేకంగా బోధించును. దేవుడు మన మాటలకంటే మన హృదయాలలో ఎక్కువ ఆసక్తి చూపును. “నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు,అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచిoపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు.” (మత్తయి 6:6-7). ప్రార్థనలో, గుర్తున్న వాక్యాలను ఏదో అలా ఉచ్చరించడం కాదుకాని, మన హృదయాలను దేవునికి కుమ్మరించాలి (ఫిలిప్పీ 4:6-7).

ప్రభు ప్రార్థన ఎలా ప్రార్థించాలి అనుటకు ఒక ఉదాహరణగా, ఒక మాదిరిగా అర్థము చేసుకొనవలెను. అది ప్రార్థనకు కావలసిన “పదార్థాలను” మనకు ఇచ్చును. ఇక్కడ అది వివరముగా విభాగించబడెను. “పరలోకమందున్న మా తండ్రీ” అనేది మనకు మన ప్రార్థనలను-తండ్రికి చేయాలని చెప్పుచున్నది. “నీ నామము పరిశుద్ధపరచబడు గాక” అనేది మనము దేవునిని ఆరాధించి, మరియు ఆయన ఏమైయున్నాడో దానినిబట్టి స్తుతించాలని చెప్పుచున్నది. “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అనే వాక్యము మనము మన జీవితములో మరియు భూమిపై మన ప్రణాళికను కాకుండా దేవుని ప్రణాళికను ప్రార్థించాలని గుర్తుచేయును. మన కోరికల కొరకు కాదుకాని, దేవుని చిత్తము జరగాలని మనము ప్రార్థించాలి. “మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము” అనేది మనకు అవసరమైనవి దేవునిని అడగాలని ప్రోత్సహించును. “మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములను క్షమించుము” అనేది మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకొని మరియు వాటినుండి మళ్లి, మరియు అలాగే దేవుడు మనలను క్షమించియున్నలాగునే మనము ఇతరులను క్షమించాలని గుర్తుచేయును. ప్రభు ప్రార్థన ముగింపు, “మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము” అనేది పాపముపై విజయo సాధించుటకు మరియు అపవాది దాడుల నుండి భద్రపరచుటకు సహాయపడుట కొరకు ఒక వేడుకోలు.

అందువలన, మరలా, ప్రభు ప్రార్థన మనము గుర్తుంచుకొని మరియు దేవునికి తిరిగి ఉచ్చరించవలసినది కాదు. అది కేవలం మనము ఎలా ప్రార్థించాలి అనుటకు ఒక ఉదాహరణ. ప్రభు ప్రార్థనను మన్నన చేసికొనుటలో ఏదైనా తప్పు ఉందా? ఖచ్చితముగా లేదు! ప్రభు ప్రార్థనను దేవునికి తిరిగి ప్రార్థించుటలో ఏదైనా తప్పువుందా? ఒకవేళ నీ హృదయము దానిలో వుండి మరియు నీవు చెప్పే మాటలు నిజముగా అర్థవంతమైతే, లేదు. ప్రార్థనలో, దేవుడు మనము ప్రత్యేకంగా వాడే పదాల కంటే మన హృదయాలనుండి ఆయనతో మాటలాడు మాటలకు ఆయన మరింత ఆసక్తి చూపును. ఫిలిప్పీ. 4:6-7 ప్రకటించును, “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలoపులకును కావలియుండును.”

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

ప్రభు ప్రార్థన అనగా ఏమిటి మరియు దానిని మనము ప్రార్థించాలా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries