settings icon
share icon
ప్రశ్న

ఆయన మరణం మరియు పునరుత్థానమునకు మధ్యలో యేసు నరకమునకు వెళ్లాడా?

జవాబు


ఈ ప్రశ్నకు సంబంధించి గొప్ప సందిగ్ధత ఉంది. సిలువపై మరణము తరువాత యేసు నరకమునకు వెళ్లెను అను ఆలోచన అపొస్తలుల విశ్వాస సంగ్రహము నుండి వెలువడెను, “ఆయన నరకములోనికి దిగిపోయెను” అని అది చెబుతుంది. వాటి వాటి అనువాదాల ఆధారంగా యేసు “నరకమునకు” వెళ్లెనని కొన్ని లేఖనములు కూడా చెబుతాయి. ఈ విషయమును గూర్చి చదివేటప్పుడు, మృతుల స్థానమును గూర్చి బైబిల్ ఏమి బోధిస్తుందో గ్రహించుట చాలా ముఖ్యం.

హెబ్రీ లేఖనములలో, మృతుల స్థలమును వివరించుటకు ఉపయోగించబడిన పదము sheol (పాతాళము). “మృతుల స్థలము” లేక “వెళ్లిపోయిన ప్రాణములు/ఆత్మల స్థలము” అని దీని అర్థము. sheolకు క్రొత్త నిబంధన గ్రీకు పదము hades (పాతాళము), మరియు ఇది “మృతుల స్థలమును” సంబోధిస్తుంది. పాతాళము అనేది ఆత్మలు అంతిమ పునరుత్థానము మరియు తీర్పు కొరకు ఎదురుచూచు తాత్కాలిక స్థలమని ఇతర క్రొత్త నిబంధన లేఖనములు చెబుతున్నాయి. పాతాళము మరియు అగ్నిగుండము మధ్య ప్రకటన 20:11–15 స్పష్టమైన బేధమును చూపుతుంది. అగ్నిగుండము నశించిన వారికి శాశ్వతమైన చివరి తీర్పు స్థలము. కాబట్టి, పాతాళము తాత్కాలిక స్థలము. చాలామంది అగ్నిగుండమును మరియు పాతాళమును “నరకం” అని సంబోధిస్తారు, మరియు ఇది సందేహమును కలిగిస్తుంది. యేసు తన మరణం తరువాత శ్రమల స్థలములోనికి వెళ్లలేదుగాని పాతాళమునకు వెళ్లాడు.

పాతాళములో రెండు భాగములు ఉంటాయి-ఆశీర్వాద స్థలము మరియు తీర్పు స్థలము (మత్తయి 11:23; 16:18; లూకా 10:15; 16:23; అపొ. 2:27–31). రక్షణ పొందినవారు మరియు నశించినవారి యొక్క రెండు స్థానములను బైబిల్ లో “పాతాళము” అని అన్నారు. రక్షించబడినవారి స్థలమును “అబ్రాహాము ఒడి” లేక “అబ్రాహాము ప్రక్క” అని లూకా 16:22 మరియు “పరదైశు” అని లూకా 23:43లో సంబోధించారు. రక్షణపొందనివారి స్థలమును “నరకం” లేక “పాతాళం” అని లూకా 16:23లో అన్నారు. రక్షణ పొందినవారు మరియు నశించినవారు నివసించు స్థలమునకు మధ్య ఒక “గొప్ప అగాధము” ఉంది (లూకా 16:26). యేసు మరణించినప్పుడు, ఆయన పాతాళంలోని ఆశీర్వాద స్థలమునకు వెళ్లి వారిలో కొందరు విశ్వాసులను పరలోకమునకు తీసుకొనివెళ్లాడు (ఎఫెసీ. 4:8–10). పాతాళంలో తీర్పు స్థలము ఎలాంటి మార్పు లేకుండా ఉంది. విశ్వసించని మృతులు అంతిమ తీర్పు కొరకు అక్కడ ఎదురుచూస్తున్నారు. యేసు పాతాళమునకు వెళ్లాడా? అవును వెళ్లాడు, ఎఫెసీ. 4:8–10 మరియు 1 పేతురు 3:18–20 ప్రకారం.

కీర్తనలు 16:10–11 వంటి వచనాలు కింగ్ జేమ్స్ వెర్షన్ లో అనువదించబడిన విధానం కొంత సందిగ్ధతను కలిగించింది: “ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవునీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదునీ కుడిచేతిలో నిత్యము సుఖములు కలవు.” ఈ వచనంలో “నరకం” సరైన అనువాదం కాదు. “సమాధి” లేక “పాతాళం” అనేది సరైన అనువాదం. తన ప్రక్కన ఉన్న దొంగతో యేసు ఇలా అన్నాడు, “నేడు నీవు నాతో కూడా పరదైశులో ఉందువు” (లూకా 23:43); “మనం నరకంలో కలుద్దాం” అని యేసు వానితో చెప్పలేదు. యేసు శరీరం సమాధిలో ఉండెను; ఆయన ఆత్మ/ప్రాణం పాతాళంలో ఉన్న పరిశుద్ధులతో కలవడానికి వెళ్లింది. దురదృష్టవశాత్తు, అనేక బైబిల్ అనువాదాలలో, “పాతాళము” మరియు “నరకమునకు” హెబ్రీ మరియు గ్రీకు పదములను అనువదించుటలో అనువాదకులు స్థిరత్వమును మరియు ఖచ్చితత్వమును చూపలేదు.

మన పాపముల నిమిత్తం మరింత శ్రమను అనుభవించుటకు యేసు పాతాళములోని శ్రమపొందు భాగాముకు లేక “నరకమునకు” వెళ్లాడని కొందరి ఆలోచన. ఇది బైబిల్ కు అనుసంధానమైన ఆలోచన కాదు. సిలువపై యేసు మరణం మన విమోచన కొరకు సంపూర్ణంగా సరిపోయెను. ఆయన చిందిన రక్తం మన పాపములను కడిగెను (1 యోహాను 1:7–9). ఆయన సిలువపై వ్రేలాడుచుండగా, సమస్త మానవాళి యొక్క పాపభారమును ఆయన తన మీద మోసెను. ఆయన మన కొరకు పాపియాయెను: “ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను” (2 కొరింథీ. 5:21). ఇట్టి పాప ఆరోపణ సిలువలో తనపై కుమ్మరించబడు పాపపు గిన్నెతో గెత్సమనె తోటలో క్రీస్తు యొక్క సంఘర్షణను అర్థం చేసుకొనుటలో మనకు సహాయం చేస్తుంది.

యేసు మరణమునకు చేరువవుతు, “సమప్తమాయెను” అని చెప్పెను (యోహాను 19:30). మన స్థానంలో ఆయన శ్రమపడుట సమప్తమాయెను. ఆయన ఆత్మ/ప్రాణము పాతాళమునకు వెళ్లెను (మృతుల స్థలము) యేసు “నరకమునకు” లేక పాతాళములో శ్రమపొందు వైపునకు వెళ్లలేదు; ఆయన “అబ్రాహాము వైపునకు” లేక పాతాళంలో ఆశీర్వదించబడిన వైపునకు వెళ్లెను. ఆయన మరణించిన మరుక్షణం యేసు యొక్క శ్రమలు ముగించబడెను. పాపమునకు వెల చెల్లించబడెను. తరువాత ఆయన తన పునరుత్థానం కొరకు మరియు తన మహిమగల ఆరోహణ కొరకు ఎదురుచూసెను. యేసు నరకమునకు వెళ్లాడా? లేదు. యేసు పాతాళమునకు వెళ్లాడా? అవును వెళ్లాడు.

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

ఆయన మరణం మరియు పునరుత్థానమునకు మధ్యలో యేసు నరకమునకు వెళ్లాడా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries