settings icon
share icon
ప్రశ్న

తన మరణం మరియు పునరుత్థానమునకు మధ్య మూడు రోజులు యేసు ఎక్కడ ఉన్నాడు?

జవాబు


ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతు డైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను” అని 1 పేతురు 3:18–19 చెబుతుంది. ఇక్కడ ఆత్మ అను పదము క్రీస్తు ఆత్మను సూచిస్తుంది. ఇక్కడ బేధం ఆయన శరీరం మరియు ఆత్మ మధ్యగాని, క్రీస్తు శరీరం మరియు పరిశుద్ధాత్మ మధ్య కాదు. క్రీస్తు శరీరం మరణించింది, కాని ఆయన ఆత్మ జీవించియుంది.

1 పేతురు 3:18–22 క్రీస్తు శ్రమ (వ. 18) మరియు అయన మహిమపరచబడుట (వ. 22) మధ్య ఉన్న సంబంధమును వివరిస్తుంది. ఈ రెండు సంఘటనల మధ్య జరిగినదానిని గూర్చి కేవలం పేతురు మాత్రమే కొంత సమాచారమును ఇచ్చుచున్నాడు. చెరలో ఉన్న ఆత్మలకు యేసు “ప్రకటించెను” అని KJV చెబుతుంది (వ. 19). అయితే, ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదము సువార్త కొరకు క్రొత్త నిబంధనలో ఉపయోగించిన సాధారణ పదం కాదు. “సందేశం ప్రకటించుట” అని మాత్రమే దీని అర్థం; “ప్రకటన చేసెను” అని NIV దీనిని అనువదిస్తుంది. యేసు శ్రమపొంది సిలువపై మరణించెను, మరియు ఆయన శరీరం మరణమునొందెను. కాని ఆయన ఆత్మ జీవించియుంది, మరియు ఆయన దానిని తండ్రి చేతికి అప్పగించెను (లూకా 23:46). పేతురు ప్రకారం, యేసు మరణం మరియు పునరుత్థానము మధ్య “చెరలో ఉన్న ఆత్మలకు” విశేషమైన ప్రకటన చేసెను.

క్రొత్త నిబంధనలో, ఆత్మలు అనే పదము దేవదూతలను లేక దయ్యములను వర్ణించుటకు ఉపయోగించబడెనుగాని, మానవుల కొరకు కాదు. 1 పేతురు 3:20లో, పేతురు ప్రజలను “ఆత్మలు (souls)” (KJV) అని సంబోధిస్తున్నాడు. ఆయన పాతాళమునకు వెళ్ళెనని అపొ. 2:31 చెబుతుంది, కాని పాతాళం నరకం కాదు. పాతాళం మరణించినవారు ఉండే స్థలమును సంబోధిస్తుంది, మరియు అది మరణించినవారు పునరుత్థానం కొరకు వేచియుండు తాత్కాలిక స్థలము. ప్రకటన 20:11–15లో NASB మరియు NIV పాతాళము మరియు అగ్నిగుండము మధ్య స్పష్టమైన బేధమును చూపిస్తుంది. అగ్నిగుండము అనేది నశించినవారు నిరంతరము ఉండే అంత్య తీర్పు స్థలము. పాతాళం అనేది పాత నిబంధన పరిశుద్ధులకు మరియు నశించినవారికి వేచియుండు తాత్కాలిక స్థలము.

మన ప్రభువు తన ఆత్మను తండ్రికి అప్పగించి, శారీరకంగా మరణించి, పరదైశుకు వెళ్లాడు (లూకా 23:43). ఆయన మరణం మరియు పునరుత్థానమునకు మధ్య, ఆత్మలకు సందేశం అందించు ప్రాంతమును కూడా యేసు దర్శించాడు (పడిపోయిన దూతలు కావచ్చు; చూడండి యూదా 1:6); ఈ ఆత్మలు నోవహు కాలంలో వచ్చిన జలప్రళయం ముందు ఉన్న కాలంతో అనుబంధం కలిగియున్నవారు (1 పేతురు 3:20). చెరలో ఉన్న ఆత్మలకు యేసు ఏమి బోధించాడో పేతురు చెప్పలేదు, కాని ఆత్మలు రక్షింపబడలేవు కాబట్టి అది నిశ్చయంగా విమోచన సందేశం కాదు (హెబ్రీ. 2:16). సాతాను మరియు వాని సైన్యముపై అది ఒక విజయ ఘోషణ కావచ్చు (1 పేతురు 3:22; కొలొస్సీ. 2:15). ఎఫెసీ. 4:8–10 కూడా మరణం మరియు పునరుత్థానమునకు మధ్య యేసు చేసిన క్రియలను గూర్చి కొంత అవగాహన ఇస్తున్నట్లు ఉంది. కీర్తనలు 68:18 ఉద్ధారముగా చెబుతూ, పౌలు క్రీస్తును గూర్చి ఇలా చెబుతున్నాడు, “ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనుష్యులకు ఈవులను ఇచ్చెను” (ఎఫెసీ. 4:8). క్రీస్తు “చెరపట్టబడిన సమూహమును నడిపించెను” అని ESV చెబుతుంది. పరదైశులో యేసు అక్కడ ఉన్న విమోచించబడినవారిని సమకూర్చి వారి స్థిర నివాసమైన పరలోకమునకు తీసుకొని వెళ్ళెనని ఇక్కడ వాక్య భాగము చెబుతున్నట్లు ఉంది.

ఇవన్ని ప్రక్కనబెడితే, ఆయన మరణం మరియు పునరుత్థానం మధ్య ఉన్న మూడు రోజులలో క్రీస్తు ఏమి చేశాడు అని బైబిల్ స్పష్టముగా చెప్పుటలేదు. మనకు తెలిసినంత వరకు, మరణించిన పరిశుద్ధులను ఆయన ఓదార్చి వారిని తమ నిత్య నివాసమునకు చేర్చి, చెరలో ఉన్న పడిపోయిన ఆత్మలపై విజయమును ఘోషించాడు. యేసు ఖచ్చితంగా ఎవరికీ రక్షణ పొందుటకు రెండవ అవకాశం ఇవ్వలేదని మాత్రం మనకు స్పష్టంగా తెలుసు; మరణం తరువాత మనం తీర్పు పొందుతాము (హెబ్రీ. 9:27), రెండవ అవకాశం కాదు. మరియు, ఆయన నరకంలో శ్రమపొందుట లేదు; ఆయన విమోచన కార్యం సిలువలో ముగించబడింది (యోహాను 19:30).

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

తన మరణం మరియు పునరుత్థానమునకు మధ్య మూడు రోజులు యేసు ఎక్కడ ఉన్నాడు?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries