settings icon
share icon
ప్రశ్న

నేనొక హిందువును, ఒక క్రైస్తవునిగా మారుటను నేను ఎందుకు పరిగణించాలి?

జవాబు


ఒక భాగములో, హిందూమతమును మరియు క్రైస్తవ మతమును పోల్చుట కష్టము, ఎందుకనగా హిందూమతము పాశ్చాత్యులు గ్రహించుటకు ఒక కష్టమైన మతము. అది అపరిమితమైన లోతైన అంతరదృష్టిని, ఒక గొప్ప చరిత్రను, మరియు ఒక విశదీకరించబడిన వేదాంతమును సూచించును. బహుశా ప్రపంచములో ఇoత ఎక్కువ రంగురంగుల లేక అలంకరించ బడిన మతము ఉండివుండదు. హిందూమతమును మరియు క్రైస్తవమతమును పోల్చుట సులువుగా అనుభవంలేని తులనాత్మక మతములను ముంచెత్తుటే. అందువలన, ప్రతిపాదించబడిన ప్రశ్నను జాగ్రత్తగా మరియు వినయపూర్వకముగా పరిగణించాలి. ఇక్కడ ఇవ్వబడిన సమాధానము హిందుమతమునకు యే ఖచ్చితమైన విషయములోనైనా సమగ్రముగా లేక “లోతైన” భావముగా భావించలేము. ఈ జవాబు రెండు మతముల మధ్య ఉన్న కేవలo కొన్ని విషయాలను పోల్చి క్రైస్తవమతము ఎలా ప్రత్యేకముగా పరిగణింపబడుటకు అర్హమైనదో చూపుటకు ఒక ప్రయత్నం.

మొదటిగా, క్రైస్తవమతము దాని చారిత్రాత్మక సాధ్యతను బట్టి పరిగణింపబడాలి. క్రైస్తవమతము చారిత్రాత్మక పాతుకుపోయిన పాత్రలు కలిగి మరియు దాని లోపల నమూనా సంఘటనలు ఏవైతే పురాతత్వ శాస్త్రము మరియు పాఠ్య విమర్శలాంటి చట్టబద్ధ న్యాయ-వైద్య శాస్త్రము ద్వారా గుర్తించగలిగేవి. హిందూమతము ఖచ్చితముగా ఒక చరిత్ర కలిగివుంది, కాని దాని వేదాంతము, పురాణగాధలు, మరియు చరిత్ర ఏకముగా అస్పష్టముగా వుండి చాలా తరచుగా ఒకరు ఎక్కడ ముగించునో మరియు మరియొకడు ఎక్కడ ప్రారంభించునో గుర్తించుట కష్టముగా మారును. పురాణగాధలు బాహాటముగా హిందూమతము లోపలే ఆమోదము, అది దేవుళ్ళ వ్యక్తిత్వాలు మరియు గుణాలను వివరించుటకు ఉపయోగించే విశదీకరించబడిన పురాణాలను కలిగి యుండును. హిందూమతము దాని చారిత్రాత్మక సంగ్దిదత ద్వారా ఖచ్చితమైన వశ్యత మరియు స్వీకృతి కలిగియుండును. కాని, ఎక్కడైతే ఒక మతము చారిత్రాత్మకము కాదో, అది అంత తక్కువగా పరిశోధించబడును. అది ఆ సమయములో దోషరహితమైనది కాకపోవచ్చు, కాని అది పరిశీలించవలసినది కాదు. అది యూదుల సాహిత్య చరిత్ర మరియు క్రమముగా క్రైస్తవమతము యొక్క వేదాంతమును సమర్ధించే క్రైస్తవ సంప్రదాయము. ఒకవేళ ఆదాము మరియు అవ్వ లేకపోతే, ఒకవేళ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడిచిపెట్టకపోతే, ఒకవేళ యోనా కేవలం ఒక రూపకమైతే, లేక ఒకవేళ యేసు భూమిపై నడవకపోతే అప్పుడు మొత్తము క్రైస్తవమతము ఆ విషయముల వద్ద సమర్దవంతముగా కృoగిపోవును. క్రైస్తవమతమునకు, మోసంచేసే చరిత్ర ఒక రంధ్రములుగల వేదాంతమునకు అర్ధము. అలాంటి పాతుకుపోయిన చారిత్రాత్మకత క్రైస్తవమతమునకు ఒక బలహీనతగా ఉండవచ్చు క్రైస్తవ సంప్రదాయము యొక్క చారిత్రాత్మక పరిశోధన భాగాలు మినహాయించి అవి తరచుగా ఆ బలహీనతను ఒక బలముగా మారుటను లెక్కించును.

రెండవది, క్రైస్తవమతము మరియు హిందూమతము రెండూ మూల చారిత్రాత్మక నమూనాలు కలిగియుండగా, కేవలం యేసు మాత్రమే మరణము నుండి శరీరధారిగా పునరుత్థానుడాయెను. చరిత్రలో చాలామంది వ్యక్తులు తెలివైన బోధకులుగా వుండి లేక మతపరమైన ఉద్యమాలు ప్రారంభించెను. హిందూమతము తెలివైన బోధకులు మరియు భూసంబంధమైన నాయకుల పాలు కలిగియుండెను. కాని యేసు బహిరంగముగా నిలబడెను. ఆయన ఆత్మీయ బోధలు కేవలం దైవిక శక్తితోనే ఒక పరీక్షతో సఫలముగా నిర్దారించబడెను; మరణము మరియు పునరుత్థానము, ఏదైతే అయన తనకుతానే ప్రవచించి మరియు పరిపూర్ణము చేసెను (మత్తయి 16:21; 20:18-19; మార్కు 8:31, లూకా 9:22; యోహాను 20-21; 1 కొరింథీ 15).

అంతేకాకుండా, క్రైస్తవ సిద్ధాంతము యొక్క పునరుత్థానము హిందూ సిద్ధాంతమైన పునర్జన్మ నుండి వేరుగా నిలబడును. ఈ రెండు ఆలోచనలు ఒకటి కాదు. మరియు ఈ పునరుత్థానమొక్కటే ఏదైతే చారిత్రాత్మక మరియు ప్రామాణిక అధ్యయనం నుండి ఆమోదయోగ్యముగా ఊహించబడినది. యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము ముఖ్యముగా లౌకిక మరియు మత పండితులచే ఒకే విధముగా గణనీయముగా సమర్ధించబడినది. దాని ధృవీకరణ హిందూ సిద్ధాంతమైన పునర్జన్మతో ధ్రువీకరించుటకు ఏమి చేయలేదు. క్రింది వ్యత్యాసాలను పరిగణించండి.

పునరుత్థానము ఓకే మరణము, ఒకే జీవము, ఒకే నైతిక శరీరము, మరియు ఒక క్రొత్త మరియు అనైతిక మహిమ శరీరము కలిగియుండును. పునరుత్థానము దైవిక జోక్యము వలన జరుగును, అది ఏకేశ్వరవాదము, అది పాపము నుండి విడుదల, మరియు చివరికి కేవలం అoత్యదినములలో జరుగును. పునర్జన్మ, దానికి విరుద్ధముగా, అనేక మరణములను, అనేక జీవములను, అనేక నైతిక శరీరములను కలిగియుండును మరియు అనైతిక శరీరము ఉండదు. ఇంకా, పునర్జన్మ సహజ నియమము ద్వారా జరుగును, అది సాధారణముగా Panthiestic (సర్వము దేవుడే), కర్మపై పనిచేయును, మరియు ఎల్లప్పుడు కార్యరూపమైనది. అయినప్పటికీ, వ్యత్యాసాల జాబితా చేయుట మరియొక పరిగణనను నిరూపించదు. అయితే, పునరుత్థానము చారిత్రాత్మకముగా వివరణాత్మకమైతే, అప్పుడు e రెండు మరణానంతర ఎంపికల ప్రత్యేకత న్యాయమైన పరిగణన నుండి అన్యాయమైన పరిగణనను వేరుచేయును. క్రీస్తు యొక్క పునరుత్థానము మరియు పునరుత్థానము యొక్క పెద్ద క్రైస్తవ సిద్ధాంతము రెండు పరిశీలనకు అర్హమైనవి.

మూడవది, క్రైస్తవ లేఖనములు తీవ్ర పరిశీలనకు అర్హమైన చారిత్రాత్మకముగా అసాధారణమైనవి. చాలా పరీక్షలలో బైబిలు హిందూ వేదాలను, మరియు ఇతర పురాతనత్వ పుస్తకాలను, ఆ విషయంలో అధిగమించినది. బైబిలు యొక్క చరిత్ర చాలా బలవంతముగా బైబిలును అనుమానిస్తే చరిత్రను అనుమానించినట్లే అని కూడా ఎవరైనా చెప్పగలరు, ఎందుకంటే పురాతన పుస్తకాలన్నిట్లో ఇది చాలా చారిత్రాత్మకముగా ధ్రువీకరించబడినది. చారిత్రాత్మకముగా పాత నిబంధన (హెబ్రీ బైబిలు) కంటే ఎక్కువగా ధృవీకరించబడినది క్రొత్త నిబంధన. క్రిందివాటిని పరిగణించుము:

1) యే ఇతర పురాతన గ్రంధము కంటే క్రొత్త నిబంధన రాత ప్రతులు ఎక్కువగా ఉండెను- 5,000 పురాతన గ్రీకు రాతప్రతులు, 24,000 అన్ని ఇతర భాషలతో కలిపి. ఈ బహుళ రాతప్రతులు విపరీతమైన పరిశోధనకు ఆధారముగా అనుమతించి తద్వారా మనము అసలు ఏమిచెప్పబదినదో ఈ వాక్యములను ఒకదానితోనొకటి పరీక్షించవచ్చు.

2) క్రొత్త నిబంధన రాతప్రతు వయస్సు యే ఇతర పూర్వకాల పత్రాలకoటే అసలు వాటికే దగ్గరగా ఉండెను. అసలువన్ని సమకాలీనుల(ప్రత్యక్ష సాక్షులు) సమయం లోపలే, మొదటి శతాబ్దం A.D లో వ్రాయబడెను, మరియు మనము ప్రస్తుతము A.D 125 అంత పాత రాతప్రతుల భాగములు కలిగియున్నాము. మొత్తము పుస్తక కాపీలు A.D. 200 నాటికి ఉపరితలము పైకి వచ్చి, మరియు సంపూర్ణ క్రొత్త నిబంధన మరల తిరిగి వెనుక A.D. 250 కనుగొనబడెను. క్రొత్త నిబంధన పుస్తకాలన్నీ మొదటిగా ప్రత్యక్ష సాక్షుల కాలము లోపలే వ్రాయబడెను అనగా వారికి పురాణాలుగా మరియు జానపదాలుగా అభివృద్ధి చేసే సమయం లేదు. దానికితోడు, వారు పేర్కొన్న సత్యము సంఘ సభ్యులచే బాధ్యతకు కట్టుబడియుండెను, ఎవరైతే ఆ సంఘటనలకు వ్యక్తిగత సాక్షులో, ఆ వాస్తవాలను పరీక్షించవచ్చు.

3) పూర్వకాల యే ఇతర వాటికంటే క్రొత్త నిబంధన పత్రాలు చాలా ఖచ్చితముగా ఉండెను. John R. Robinson Honest to God’s లో క్రొత్త నిబంధన పత్రాలు 99.9% ఖచ్చితమని నివేదించెను (యే ఇతర సంపూర్ణ పూర్వకాల పుస్తకము కంటే చాలా ఖచ్చితమైనది). Bruce Metzger, గ్రీకు క్రొత్త నిబంధనలో నిపుణుడు, మరింత దృఢముగా 99.5% సూచించెను.

నాలుగవది, క్రైస్తవ ఏకేశ్వరవాదము (దేవుడు ఒక్కడే) సిద్ధాంతము మరియు బహుదేవతారాధనపై ప్రయోజనాలు కలిగియుండెను. హిందూమతమును కేవలం సిద్ధాంతముగా (“సర్వము దేవుడే”) లేక బహుదేవతారాధన (బహు దేవతలను కలిగియుండుట) చిత్రీకరించడం మంచిది కాదు. ఒకరు ఆరోపించిన హిందూమత ప్రవాహముపై ఆధారపడి, ఒకరు సిద్ధాంతి, బహుదేవతారాధికులు, ఏకత్వo (“సర్వం ఒక్కటే”), ఏకత్వవాది, లేక అనేక ఇతర ఎంపికలు కావచ్చు. అయితే, హిందూమతము లోపల బహుదేవతారాధికులు మరియు సిద్ధాంతులు రెండు బలమైన ప్రవాహాలు. క్రైస్తవ ఏకేశ్వరవాదము ఈ రెండింటిపై గుర్తించదగిన ప్రయోజనము కలిగియుండెను. స్థలా భావము వలన, ఈ మూడు ప్రపంచ నివేదికలు కేవలం ఒకే ఒక్క విషయానికి, నీతి శాస్త్రమునకు పోల్చబడెను.

బహుదేవతారాధన మరియు సిద్ధాంతము రెండు కూడా వాటి నీతికి ప్రశ్నించదాగిన ఆధారం కలిగియుండెను. బహుదేవ తారా ధనతో, ఒకవేళ అనేక దేవతలు వుంటే, మానవులు యే దేవతకు అత్యంత నీతి ప్రామాణికతను ఉంచాలి? అనేక దేవతలు ఉన్నప్పుడు , అప్పుడు వారి నైతిక వ్యవస్థలు సంఘర్షణ లేకపోయినా, ఉన్నా, లేక ఉనికిలో ఉండవు. ఒకవేళ అవి ఉనికిలో లేకపోతే, అప్పుడు కనిపెట్టిన నీతులు మరియు ఆధారరహితము. ఆ స్థానము యొక్క బలహీనత స్వీయ స్పష్టము. ఒకవేళ నైతిక వ్యవస్థ సంఘర్షణ చేయకపోతే, అప్పుడు ఏ సూత్రముపై అవి అమరియుండును? ఆ అమరియుండు సూత్రము ఏదైనా అది చివరికి దేవతల కన్నా ఎక్కువే అయివుండవచ్చు. దేవతలు అత్యంతులు కాదు ఎందుకంటే వారి సమాధానము ఏదో మరియొక అధికారం. అందువలన, ఒకరి కట్టుబడి యుoడవలసిన అధికమైన వాస్తవము ఉన్నది. ఈ వాస్తవం సిద్ధాంతమును ఒకవేళ ఖాళీ కాకపోతే నిస్సారముగా చేయుటకు చూచును. మూడవ ఎంపికపై, ఒకవేళ దేవతలు తప్పు మరియు ఒప్పు అనే వారి ప్రామాణికతలపై సంఘర్షణ చేస్తే, ఒక దేవతకు విధేయత చూపడం మరియొకనికి అవిధేయత చూపే హాని, లాభము శిక్ష వుండవచ్చు. నీతి సూత్రాలు పరస్పర సంబంధం కలిగియుండవచ్చు. ఒక దేవతకు మంచిది ఖచ్చితంగా ఒక లక్ష్య మరియు సార్వత్రిక భావమునకు “మంచిది” అయిఉండనవసరం లేదు. ఉదాహరణకు, కాళికు ఒకని పిల్లవాణ్ణి అర్పించడం ఒక హిందూమత ప్రవాహమునకు మెప్పుగా వుండవచ్చు కాని అనేక ఇతరులకు గర్హనీయం. కాని ఖచ్చితంగా, శిశుబలి, అలాంటివి, ఏదేమైనా అభ్యంతరకరమైనవి. కొన్ని విషయాలు ఏదేమైనా అన్ని కారణాలు మరియు ప్రదర్శన వలన తప్పు లేక ఒప్పు.

సిద్ధాంతము బహుదేవతారాధన కంటే ఎక్కువ అభ్యంతరం కాదు ఎందుకంటే దాని స్పష్టత చివరికి ఒకే ఒక విషయం- ఒకే దైవిక వాస్తవం- అందువలన ఏ “మంచి” మరియు “చెడు”ల చివరి వ్యత్యాసాలను అనుమతించదు. ఒకవేళ “మంచి” మరియు “చెడు” నిజముగా విభిన్నమైతే, అప్పుడు ఒక ఏక, అవిభాజ్యమయిన సత్యము ఉండదు. సిద్దాంతము చివరికి “మంచి” మరియు “చెడు”ల నైతిక విభిన్నతలను అనుమతించదు. మరియు ఒకవేళ “మంచి” మరియు “చెడు” అలాంటివి విభిన్నతలు చేసినా, కర్మ యొక్క ప్రకరణ విభిన్నత యొక్క నైతిక ప్రకరణను శూన్యము చేయును. కర్మ అనేది వ్యక్తిగత సూత్రము గురుత్వాకర్షణ లేక జడత్వం వంటి సహజ సూత్రము. పాపముతో నిండిన ఆత్మను కర్మ పిలుస్తూ వస్తే, అది ఒక తీర్పును తెచ్చే దైవిక విధానం కాదు. అలా కాకుండా, అది గుణము యొక్క వ్యక్తిగత ప్రతిస్పందన. కాని నైతికతకు వ్యక్తిత్వం అవసరం, ఆ వ్యక్తిత్వాన్ని కర్మ అప్పివ్వలేదు. ఉదాహరణకు, ఒక కర్రను కొట్టడానికి ఉపయోగిస్తే మనము కర్రను నిందించలేము. కర్ర అనేది నైతిక సామర్ద్యం మరియు బాధ్యత లేని ఒక వస్తువు. అలాగే, కర్మ కేవలం వ్యక్తిగత గుణమైతే, అప్పుడు అది అనైతికం (“నైతికత లేనిది”) మరియు అది నీతికి తగిన ఆధారము కాదు.

క్రైస్తవ ఏకేశ్వరవాదం, ఏదేమైనప్పటికీ, దాని నీతిని దేవుడు అనే వ్యక్తిగా వేరు కలిగియున్నది. దేవుని యొక్క లక్షణము మంచిది, మరియు, అందువలన, ఏదైతే ఆయనకు మరియు ఆయన చిత్తమును నిర్దారించునో అది మంచిదే. ఏదైతే దేవుని నుండి మరియు ఆయన చిత్తము నుండి వేరుపరచునో అది కీడు. అందువలన, ఆ ఒక్క దేవుడు నీతికి ఖచ్చితమైన ఆధారముగా పనిచేయును, నైతికతకు ఒక వ్యక్తిగత ఆధారము మరియు మంచి మరియు చెడుల గూర్చిన లక్ష్య జ్ఞానమును అనుమతించును.

ఐదవది, “నీ పాపముతో నీవు ఏమి చేయుదువు?” అనే ప్రశ్న మిగిలిపోవును. క్రైస్తవమతము ఈ సమస్యకు బలమైన సమాధానము కలిగియున్నది. హిందూమతము, బౌద్ధ మతము వలే, పాపము గూర్చి కనీసం రెండు ఆలోచనలు కలిగి యున్నది. పాపము కొన్నిసార్లు అజ్ఞానముగా అర్ధముచేసికొనబడెను. హిందూమతము నిర్వచించినట్లు ఒకవేళ ఒకరు వాస్తవమును చూచి లేక అర్ధముచేసికొనకపోతే అది పాపము. కాని అక్కడ నైతిక తప్పు “పాపము” అనే ఆలోచన ఉండును. ఉద్దేశ్యపూర్వకముగా ఏదైనా చేస్తే అది చెడు, ఒక ఆత్మీయ లేక భూసంబంధమైన నియమమును ఉల్లంఘిoచుట, లేక తప్పుడు విషయాలను కోరుకొనుట, ఇవన్నియు పాపము కావచ్చు. కాని పాపమునకు ఆ నైతిక నిర్వచనం నిజమైన ప్రాయశ్చిత్తం అవసరమైన ఒక రకమైన నైతిక లోపం. ఎక్కడి నుండి ప్రాయశ్చిత్తం ఉదయించును? కర్మ సూత్రాలకు కట్టుబడి యుంటే ప్రాయశ్చిత్తo వచ్చునా? కర్మ వ్యక్తిగతం మరియు అనైతికం. ఒకరు “సరిగ్గా ఉండుటకు” కూడా మంచి పనులు చేయగలరు, కానీ ఎవరు పాపమును ఎన్నటికీ పారవేయలేరు. నైతిక లోపము కూడా నైతికమని కర్మ ఎక్కడా కూడా ఒక ప్రకరణను ఇవ్వలేదు. ఉదాహరణకు, ఏకాంతముగా మనము ఒకవేళ పాపము చేస్తే మనలను ఎవరు నిందించగలరు? కర్మ ఏవిధముగా ఏది పట్టించుకోదు ఎందుకంటే అది ఒక వ్యక్తి కాదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి మరియొక వ్యక్తి కుమారుని చంపాడు అనుకొందాం. బాధింపబడిన వారికి డబ్బు, ఆస్తి, లేక తన స్వంత కుమారుని ఇవ్వవచ్చు. కాని అతడు ఆ యవ్వనస్తుని తిరిగి ఇవ్వలేడు. ఆ పాపమును ఎంత పరిహార మొత్తమైనా కప్పిపుచ్చలేదు. శివునికి లేక విష్ణువుకు ప్రార్థించి లేక ధ్యానించడం వలన ప్రాయశ్చిత్తం వచ్చునా? ఒకవేళ ఆ వ్యక్తులు క్షమాపణ ఇచ్చినా, ఇంకా పాపము చెల్లించని అప్పులా కనబడును. వారు పాపమును ఏదో అవి మన్నిoచదగిన, పెద్ద విషయము కాదు, మరియు అప్పుడు ప్రజలకు ఆనంద ద్వారాల గుండా చేయు ఊపును.

క్రైస్తవమతము, అయినప్పటికీ, పాపమును ఒక ఏక, అత్యంత, మరియు దేవుని వ్యక్తిగత నైతిక లోపముగా భావించును. ఆదాము వద్ద నుoడి, మానవులు పాపముతో నిండిన జీవులు. పాపము నిజమైనది, మరియు అది మానవునికి మరియు ఆనందమునకు అపరిమితమైన దూరమును సృష్టించును, పాపము న్యాయమును కోరును. అయనా అది సమానమైన లేక గొప్ప మంచి క్రియలచే “సరితూగదు.” ఒకవేళ ఎవరైనా చెడు పనుల కంటే పది రెట్లు మంచి పనులు చేసినా, అప్పుడు ఆ వ్యక్తి అతని లేక ఆమె మనస్సాక్షిలో కీడు ఉండును. ఈ మిగిలిన చెడు పనులకు ఏమి జరుగును? మొదటి స్థానములో పెద్ద విషయము కానట్లు ఒకవేళ అవి కేవలం క్షమించబడునా? వారు ఆనందములోనికి అనుమతింపబడునా? ఏదేమైనా ఏమి పర్వాలేదు అని విడిచిపెట్టే, కేవలం భ్రమలా? ఈ ఎంపికలు ఏవి సరిపడవు. భ్రమలకు సంబంధించి, పాపము ఒక భ్రమగా వివరించి వదిలివేయుటకు అది పెద్ద వాస్తవము. పాపముకు సంబంధించి, మనము మనతో నిజాయితీగా ఉన్నప్పుడు మనము పాపము చేసినట్లు మనందరికీ తెలుసు. క్షమాపణకు సంబంధించి, యే ఖర్చు లేకుండా సులువుగా పాపమును క్షమిస్తే అది పాపమును దాని పరిమాణాలు ఎక్కువ కాకుండా చూచును.అది తప్పని మనకు తెలుసు. ఆనందమునకు సంబంధించి, ఒకవేళ పాపము లోపలికి అక్రమ రవాణా అవుతుంటే, ఆనందము అంత మంచిది కాదు. కర్మ యొక్క ప్రమాణాలు మన హృదయములలో పాపమును విడిచిపెట్టి మరియు మంచి మరియు చెడుల స్థాయిని మనము చివరికి కొద్దిగా ఉల్లంఘించామనే దొంగతనపు అనుమానము కనబడును. మరియు ఆనందము మనలను భరించలేక, లేక మనము లోపలి వచ్చేలా ఖచ్చితంగా ప్రాధేయపడాలి.

క్రైస్తవమతముతో, ఏదేమైనా, ఆ శిక్ష సిలువపై క్రీస్తు యొక్క వ్యక్తిగత త్యాగముచే ముందే తృప్తిపరచబడినా సమస్త పాపము శిక్షించబడాలి. దేవుడు మానవునిగా మారి, పరిపూర్ణ జీవితం జీవించి, మరియు మనము అనుభవించవలసిన మరణము ఆయన పొందెను. మనకు బదులుగా ఆయన, మన కొరకు ప్రత్నామ్యాయంగా, లేక ప్రాయశ్చిత్తముగా, మన పాపముల కొరకు సిలువ వేయబడెను. మరింతగా, ఆయన ఎవరైతే ఆయన యందు తమ ప్రభువుగా మరియు రక్షకునిగా విశ్వాస ముంచునో వారందరికీ అదే పునరుత్థానమును ఆ నిత్యజీవమునకు వాగ్ధానము చేసెను (రోమా 3:10, 23; 6:23; 8:12; 10:9-10; ఎఫెసీ 2:8-9; ఫిలిప్పీ 3:21).

చివరిగా, క్రైస్తవమతములో మనకు మనము రక్షించబడియున్నామని తెలియును. ఏదో నిలకడలేని అనుభవముపై ఆధారపడము, లేక మన మన స్వంత మంచి పనులు లేక తీక్షణమైన ధ్యానముపై ఆధారపడము, లేక ఎవరినైతే మనము ప్రయత్నించి “ఉనికిలో వున్నారని నమ్మే” అసత్య దేవతలో విశ్వాసముoచము. మనకు సజీవుడైన మరియు సత్య దేవుడు ఉండెను, ఒక చారిత్రాత్మకoగా లంగరు వేయబడిన విశ్వాసము, ఒక బద్ధత మరియు పరిశోధనగల దేవుని ప్రత్యక్షత (లేఖనము), నీతిగా జీవించుటకు వేదాంత పరముగా సంతృప్తిపరిచే ఆధారము, మరియు పరలోకములో దేవునితో హామీతో కూడిన ఒక గృహము.

అందువలన, మీకు ఇది యేమని అనిపిస్తుంది? యేసు అత్యంత వాస్తవము! యేసు మన పాపములకు పరిపూర్ణ త్యాగము. దేవుడు మనందరికీ ఒకవేళ మనము ఆయన మనకిచ్చే బహుమానము స్వీకరిస్తే మనకు క్షమాపణ దయచేయును (యోహాను 1:12), యేసు రక్షకునిగా నమ్ముచు ఆయన జీవితమును – ఆయన స్నేహితులమైన మనకొరకు అర్పించెను. ఒకవేళ నీవు నీ నమ్మికను యేసు ఒక్కడే రక్షకుడు అని ఉంచితే, నీకు పరలోకములో నిత్యానందము ఖచ్చితముగా నిర్దారించబడును. దేవుడు నీ పాపములను క్షమించును, నీ ఆత్మను శుద్దీకరించును, నీ మనస్సును నూతపరచి, మరియు ఈ లోకములో సమృద్ధి జీవమును మరియు తర్వాతి లోకములో నిత్యానందమును నీకు ఇచ్చును. అలాంటి ప్రశస్తమైన బహుమానమును ఎలా తిరస్కరింతుము? మనలను చాలినంతగా ప్రేమించి మనకొరకు తన్నుతానే అర్పించుకొనిన దేవుని నుండి తిరిగి వెన్ను చూపగలము?

ఒకవేళ నీవు ఏదైతే నమ్ముచున్నావో దానిని బట్టి అనిశ్చితి కలిగియుంటే, ఈ క్రింది ప్రార్థన దేవునికి చెప్పుటకు మేము మిమ్ములను ఆహ్వానిస్తున్నాము; “దేవా, ఏది సత్యమో తెలిసికొనుటకు నాకు సహాయము చేయుము. ఏది లోపముగా నున్నదో వివేచించుటకు నాకు సహాయము చేయుము. రక్షణకు సరియైన మార్గము తెలిసికొనుటకు నాకు సహాయము చేయుము.” అలాంటి ప్రార్థనను దేవుడు ఎల్లప్పుడు సన్మానించును.

ఒకవేళ నీవు యేసును నీ రక్షకునిగా స్వీకరించాలనుకుంటే, సులభముగా దేవునితో మాట్లాడుము, పదాలతో లేక మౌనముగా, మరియు యేసు ద్వారా రక్షణ అనే బహుమానమును పొందానని ఆయనకు చెప్పుము. ఒకవేళ నీవు చెప్పుటకు ప్రార్థన కావాలంటే, ఇక్కడ ఒక ఉదాహరణ: “దేవా, నా పట్ల నీ ప్రేమను బట్టి నీకు వందనములు. నా కొరకు నిన్ను నీవు అర్పించుకొనుటను బట్టి నీకు వందనములు. నాకు క్షమాపణ మరియు రక్షణ అనుగ్రహించినందుకు వందనములు. యేసు ద్వారా రక్షణ బహుమానమును నేను అంగీకరిస్తున్నాను, యేసును నా రక్షకునిగా పొందుకొనుచున్నాను. ఆమేన్!”

మీరు ఇక్కడ చదివిన వాటి ఆధారంగా క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకున్నారా? అయిన యెడల, “క్రీస్తును నేడు అంగీకరించితిని” అను ఈ క్రింది బటన్ ను నొక్కండి.

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

నేనొక హిందువును, ఒక క్రైస్తవునిగా మారుటను నేను ఎందుకు పరిగణించాలి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries