settings icon
share icon
ప్రశ్న

హెబ్రీయులు 10:26 ప్రకారం, ఒక విశ్వాసి రక్షణను కోల్పోగలడా?

జవాబు


ఎందుకనగా మనము సత్యమునుగూర్చిన సంపూర్ణమైన జ్ఞానము పొందిన తరువాత ఉద్దేశపూర్వకముగా పాపము చేయుచున్నయెడల, పాపములనుగూర్చి ఇకపై బలి అస్సలు లేదు. హెబ్రీయులకు 10:26-29 అపోస్టేసీ (మతవిశ్వాసమును విడిచిపెట్టడం) పాపమునకు వ్యతిరేకంగా హెచ్చరిస్తుంది. అపోస్టేసీ అనగా ఉద్దేశపూర్వకముగా దారితప్పడం లేదా విడిచిపెట్టడం. మతభ్రష్టులు అంటే క్రీస్తు వైపుకు, రక్షణ కలిగించే విశ్వాసానికి అంచు వరకు వెళ్ళి, సువార్తను విని, అర్థం చేసుకుని, రక్షణ కలిగించే విశ్వాసానికి అంచున ఉన్నప్పటికీ, తాము నేర్చుకున్న వాటిని తిరస్కరించి, వెనుదిరిగే వారు. వీరు బహుశా తమ పాపాన్ని గురించి తెలిసిన వారు మరియు విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించే వారు కూడా కావచ్చు. కానీ ఆత్మీయ పరిపక్వత వైపు వెళ్ళడానికి బదులుగా, క్రీస్తు పట్ల వారి ఆసక్తి తగ్గడం ప్రారంభమవుతుంది, లోక విషయాలకు వారిపై ఆకర్షణ పెరుగుతుంది, మరియు చివరికి వారు దేవుని విషయాల పట్ల అన్ని కోరికలను కోల్పోయి, తిరిగి వెనుదిరుగుతారు. మత్తయి 13:1-9, 18-23లోని రెండవ మరియు మూడవ నేలలలో ప్రభువు ఈ రకమైన వ్యక్తులను ఉదాహరించాడు. వీరు ప్రభువు వాక్యమును "ఆనందముతో స్వీకరిస్తారు", కానీ లోకపు చింతలచే లేదా క్రీస్తు నిమిత్తము ఎదుర్కొనే కష్టాలచే దారి తప్పిపోతారు.

ఈ వాక్యంలో "తెలిసి తెలిసి పాపము చేయడం" అనేది క్రీస్తును స్పృహతో, ఉద్దేశపూర్వకంగా తిరస్కరించడం అనే భావనను కలిగి ఉంది. దేవుని మార్గమును తెలిసికొని, అది ప్రసంగించబడగా విని, దానిని అధ్యయనం చేసి, తమను తాము విశ్వాసులలో ఒకరిగా పరిగణించుకుని, ఆపై మార్గము నుండి తప్పిపోవడమే విశ్వాసమునుండి తిరిగిపోవడం. తెలిసి తెలిసి పాపము చేయడమంటే నిరంతరంగా మరియు ఉద్దేశపూర్వకంగా పాపము చేయడం అనే భావనను అది కలిగి ఉంటుంది. అటువంటి వ్యక్తి అజ్ఞానము వలన పాపము చేయడు, మరియు అతడు ఎదిరించలేనంత బలహీనుడై, క్షణిక ప్రలోభాలచేత మోసపోడు. తన ఇష్టానుసారంగా పాపం చేసేవాడు, తాను వదులుకోవాలనే కోరిక లేని ఒక స్థిరపడిన ఆలోచనా విధానం మరియు ప్రవర్తన కారణంగా పాపం చేస్తాడు. మరోవైపు, నిజమైన విశ్వాసి అంటే పాపంలోకి జారిపోయి, దేవునితో తాత్కాలిక సహవాసాన్ని కోల్పోయేవాడు. కానీ అతను చివరికి పశ్చాత్తాపంతో దేవుని వద్దకు తిరిగి వస్తాడు, ఎందుకంటే అతను ఇకపై దూరంగా ఉండలేనంత వరకు అతని పరలోకపు తండ్రి నిరంతరం అతన్ని ఆకర్షిస్తూ, అతని మనస్సాక్షిని కుదిలిస్తాడు. నిజమైన తిరుగుబాటుదారుడు ఉద్దేశపూర్వకంగా, ఇష్టపూర్వకంగా మరియు విచ్చలవిడిగా పాపం చేస్తూనే ఉంటాడు. యోహాను మనకు ఇలా చెబుతున్నాడు, "దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపముచేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు" (1 యోహాను 3:9).

మతభ్రష్టులకు జ్ఞానం ఉంటుంది, కానీ ఆ జ్ఞానాన్ని వారు ఆచరణలో పెట్టరు. వారు క్రీస్తు వెలుగు సన్నిధిలో, ముఖ్యంగా సంఘంలో, దేవుని ప్రజల మధ్య కనిపిస్తారు. యూదా ఇస్కరియోతు దీనికి ఒక సరైన ఉదాహరణ—అతనికి జ్ఞానం ఉంది కానీ నిజమైన విశ్వాసం లేదు. సత్యంను తిరస్కరించిన మరెవరికీ యూదా కంటే ఎక్కువ లేదా ఉత్తమమైన రీతిలో దేవుని ప్రేమ మరియు కృపకు పరిచయం కలగలేదు. అతను యేసు యొక్క అంతరంగ శిష్యులలో ఒకడు, సంవత్సరాల తరబడి ఆయనతో కలిసి తింటూ, నిద్రపోతూ మరియు ప్రయాణిస్తూ ఉన్నాడు. అతను అద్భుతాలను చూశాడు మరియు ప్రపంచం ఎన్నడూ చూడని అత్యుత్తమ ప్రబోధకుడైన యేసు నోటి నుండి నేరుగా దేవుని మాటలను విన్నాడు, అయినప్పటికీ అతను కేవలం దారి తప్పడమే కాకుండా, యేసును చంపే కుట్రలో కీలక పాత్ర పోషించాడు.

సత్యం నుండి వెనుదిరిగి, పూర్తి అవగాహనతో ఉద్దేశపూర్వకంగా మరియు నిరంతరం పాపం చేయడానికి ఎంచుకున్నప్పుడు, ఆ విశ్వాసభ్రష్టుడు రక్షణకు అతీతమైనవాడవుతాడు, ఎందుకంటే అతను పాపాల కోసం ఉన్న ఏకైక నిజమైన బలి అయిన ప్రభువైన యేసుక్రీస్తును తిరస్కరించాడు. క్రీస్తు బలిని తిరస్కరిస్తే, రక్షణ యొక్క ఆశ అంతా నశించిపోతుంది. ఈ బలి నుండి ఉద్దేశపూర్వకంగా వైదొలగడం వలన మరొక బలి ఉండదు; అది పాపాన్ని మాత్రమే మిగిల్చుతుంది, దాని శిక్ష శాశ్వత మరణం. ఈ వాక్యభాగం విశ్వాసుల నుండి పడిపోయిన వారి గురించి చెప్పడం లేదు, కానీ విశ్వాసిగా చెప్పుకుంటూ, నిజానికి విశ్వాసి కాని వారి గురించి చెబుతోంది. మతభ్రష్టుడైన ప్రతి ఒక్కరూ, మొదటి నుండి తనకు నిజమైన విశ్వాసం ఎప్పుడూ లేదని నిరూపించుకుంటున్నాడు (1 యోహాను 2:19).

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

హెబ్రీయులు 10:26 ప్రకారం, ఒక విశ్వాసి రక్షణను కోల్పోగలడా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries