settings icon
share icon
ప్రశ్న

పాత నిబంధనలో ఉన్న దేవుడు క్రొత్త నిబంధనలో ఉన్న దేవుని కంటే ఎందుకు వేరుగా ఉన్నాడు?

జవాబు


దేవుని స్వభావమును గూర్చి పాత మరియు క్రొత్త నిబంధనలు ఏమి బయలుపరచుచున్నవి అనుదానిని గూర్చిన అపార్థము ఈ ప్రశ్న యొక్క మూలముగా ఉంది. ఈ ఆలోచనను వ్యక్తపరచు మరొక విధానం ప్రజలు ఈ విధంగా చెప్పుటలో చూడవచ్చు, “పాత నిబంధన దేవుడు కోపముగలవాడు మరియు క్రొత్త నిబంధన దేవుడు ప్రేమగలవాడు.” బైబిల్ అనునది చారిత్రక సంఘటనల ద్వారా మరియు చరిత్రలో ప్రజలతో తన అనుబంధాల ద్వారా తన్ను గూర్చి తాను బయలుపరచుకున్న దేవుని వరుస ప్రత్యక్షత అను విషయం క్రొత్త నిబంధనతో పోలిస్తే పాత నిబంధన దేవుడు ఎలా ఉన్నాడు అను విషయమును గూర్చిన ఆపార్థపు ఆలోచనలకు దారితీస్తుంది. అయితే, ఒకరి పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన రెండు చదివినప్పుడు, దేవుడు రెండు నిబంధనలలో వేరువేరుగా లేడని, మరియు దేవుని కోపం మరియు ప్రేమ రెంటిలో బయలుపరచబడ్డాయని రుజువవుతుంది.

ఉదాహరణకు, పాత నిబంధన అంతటిలో, దేవుడు “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు కలిగియున్నాడని” ప్రకటించబడెను (నిర్గమ. 34:6; సంఖ్యా. 14:18; ద్వితీ. 4:31; నెహేమ్యా 9:17; కీర్తనలు 86:5, 15; 108:4; 145:8; యోవేలు 2:13). అయితే క్రొత్త నిబంధనలో, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” (యోహాను 3:16) అను సత్యము ద్వారా దేవుని కనికరము మరియు కరుణ మరింత పరిపూర్ణంగా బయలుపరచబడెను. పాత నిబంధన అంతటిలో, ఒక ప్రేమించు తండ్రి తన బిడ్డతో ఏ విధంగా వ్యవహరిస్తాడో అదే విధంగా దేవుడు ఇశ్రాయేలుతో వ్యవహరించాడు. వారు కావాలని ఆయనకు విరోధంగా పాపము చేసి విగ్రహాలను ఆరాధన చేసినప్పుడు, దేవుడు వారిని శిక్షించాడు. అయినను, వారు తమ విగ్రహారాధన నుండి పశ్చాత్తాపపడిన ప్రతిసారి ఆయన వారిని విడిపించాడు. ఇదే విధంగా క్రొత్త నిబంధనలో కూడా దేవుడు క్రైస్తవులతో వ్యవహరించాడు. ఉదాహరణకు, “ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును” అని హెబ్రీ. 12:6 చెబుతుంది.

అదే విధంగా, పాపము మీద దేవుని యొక్క కోపము మరియు తీర్పు కుమ్మరించబడుట పాత నిబంధన అంతటిలో మనం చూస్తాము. అదే విధంగా, క్రొత్త నిబంధనలో “దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది” (రోమా. 1:18). కాబట్టి, స్పష్టముగా, పాత నిబంధనలో దేవుడు క్రొత్త నిబంధన కంటే వేరుగా లేడు. దేవుడు స్వాభావికంగా మారనివాడు. కొన్ని లేఖన భాగాలలో దేవుని యొక్క ఒక స్వభావం వేరొక స్వభావం కంటే ఎక్కువగా బయలుపరచబడుట మనం చూస్తాం గాని, దేవుడు స్వయంగా మారనివాడు.

మనం బైబిల్ ను చదివి అధ్యయనం చేయుచుండగా, దేవుడు పాత మరియు క్రొత్త నిబంధనలలో ఒకే విధంగా ఉన్నాడని మనకు స్పష్టమవుతుంది. బైబిల్ 66 పుస్తకాలు కలిగి, రెండు (లేక మూడు) ఖండములలో, మూడు వేర్వేరు భాషలలో, 40 రచయితల ద్వారా సుమారుగా 1500 సంవత్సరాల పాటు వ్రాయబడినప్పటికీ, అది ఎలాంటి వ్యతిరేకతలు లేకుండా ఆరంభము నుండి అంతము వరకు ఒకే ఐక్య పుస్తకం వలె ఉంటుంది. ప్రేమగల, కరుణ కలిగిన, మరియు న్యాయవంతుడైన దేవుడు అన్ని పరిస్థితులలో పాపపు మనుష్యులతో ఎలా వ్యవహరిస్తాడో దీనిలో మనం చూస్తాము. నిజముగా, బైబిల్ మానవజాతికి దేవుని యొక్క ప్రేమ లేఖ. ఆయన సృష్టి పట్ల ముఖ్యంగా మానవజాతి పట్ల దేవుని ప్రేమ లేఖనమంతటిలో వ్యక్తపరచబడింది. మనం యోగ్యులము కాబట్టి గాక, దేవుడు కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు కలిగియున్నాడని కాబట్టి దేవుడు ప్రేమ మరియు కరుణతో తన ప్రజలను తనతో అనుబంధములోనికి పిలుచుట మనం బైబిల్ అంతటిలో చూస్తాము. అయినను ఆయన మాటకు అవిధేయులై ఆయనను ఆరాధించుటకు నిరాకరించి, వారి సొంత సృష్టి అయిన దేవతలను ఆరాధించుటకు తిరుగువారికి తీర్పు తీర్చు పరిశుద్ధ మరియు నీతిగల దేవుని కూడా మనం చూస్తాము (రోమా. 1వ అధ్యాయము).

దేవుని యొక్క నీతి మరియు పరిశుద్ధ స్వభావం వలన, పాపమంతా-భూత, వర్తమాన, భవిష్యత్-తీర్పుతీర్చబడాలి. అయినను దేవుడు తన అపారమైన ప్రేమలో పాపమునకు వెల చెల్లించి సమాధాన మార్గము చూపాడు తద్వారా పాపపు మనుష్యుడు ఉగ్రతను తప్పించుకోవచ్చు. ఈ గొప్ప సత్యమును 1 యోహాను 4:10 వంటి వచనాలలో చూస్తాము: “మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.” పాత నిబంధనలో, పాప ప్రాయశ్చిత్తం కొరకు దేవుడు బలుల వ్యవస్థను ఇచ్చాడు. అయితే, ఈ బలుల వ్యవస్థ తాత్కాలికమైనదై పాప ప్రాయశ్చిత్తం కొరకు పరిపూర్ణ పరిహారార్థ బలిగా యేసు క్రీస్తు సిలువపై మరణించుట వైపు ఎదురుచూసెను. పాత నిబంధనలో వాగ్దానం చేయబడిన రక్షకుడు క్రొత్త నిబంధనలో పూర్తిగా బయలుపరచబడ్డాడు. పాత నిబంధనలో ప్రణాళిక చేయబడి, దేవుని ప్రేమ యొక్క ఉన్నత భావన, తన కుమారుడైన యేసు క్రీస్తును పంపుట, క్రొత్త నిబంధనలో మహిమతో బయలుపరచబడెను. మనకు “రక్షణార్థమైన జ్ఞానమును” (2 తిమోతి 3:15) ఇచ్చుటకు పాత మరియు క్రొత్త నిబంధనలు ఇవ్వబడెను. నిబంధనలను దగ్గరగా అధ్యయనం చేసినప్పుడు, దేవుడు “చంచలత్వము వలన కదులు ఛాయ వలె మార్పు చెందడని” రుజువవుతుంది (యాకోబు 1:17).

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

పాత నిబంధనలో ఉన్న దేవుడు క్రొత్త నిబంధనలో ఉన్న దేవుని కంటే ఎందుకు వేరుగా ఉన్నాడు?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries