క్రైస్తవ ప్రపంచ ధృక్పధము అంటే ఏంటి?ప్రశ్న: క్రైస్తవ ప్రపంచ ధృక్పధము అంటే ఏంటి?

జవాబు:
"ప్రపంచ ధృక్పధము" అంటే విశాలమైన ప్రపంచమును ఒక ప్రత్యేకమైన ధృక్కోణంలోనుండి పరిశీలించుటను సూచిస్తుంది. "క్రైస్తవ ప్రపంచ ధృక్పధము," తర్వాత,విశాలమైన ప్రపంచమును ఒక ప్రత్యేకమైన క్రైస్తవ ధృక్కోణంలోనుండి పరిశీలించుటయే. ఒక వ్యక్తిగత ప్రపంచ ధృక్పధము, అది తన "పరిపూర్ణ చిత్రపఠము," ప్రపంచమునుగూర్చి తనకున్న అనేకమైన నమ్మకాలు యొక్క అనురూప్యమే. అతడు దాని వాస్తవాన్ని గ్రహించే మార్గము. ఒకని ప్రపంచ ధృక్పధము తను ప్రతీదినము తీసికొనే నిర్ణయాలపైన ఆధారపడివుంటుంది మరియు దానిని బట్టి అవి ఎంతో బహుగా ప్రాముఖ్యతకు చెందినవి.

ఒక ఏపిల్ పండు టేబుల్ మీద నుండటం అనేకమంది చూచారు. ఒక ఓషధ శాస్త్రవేత్త ఆ ఏపిల్ పండును చూసి దానిని వర్గీకరిస్తాడు. ఒక కళాకారుడు పండులో నున్న జీవాన్ని బొమ్మగా గీస్తాడు. ఒక వర్తకుడు దాని ద్వార ఎటువంటి లాభం వస్తుందో అని జాబితా రాసుకుంటాడు. ఒక బిడ్డ మధ్యాహ్నపు భోజనానికి మరియు తినడానికి చుస్తాడు. ఒక పరిస్థితిని ఏవిధంగా చూస్తామో అనేది ప్రపంచాన్ని ఎటువంటి ధృక్కోణంలో చూస్తున్నామో దానిబట్టి ప్రభావితం చేస్తుంది. ప్రతీ ప్రపంచ ధృక్పధం, క్రైస్తవ మరియు క్రైస్తవేతర, కనీసము మూడు ప్రశ్నలతో వ్యవహరిస్తుంది.

1). మనము ఎక్కడనుండి వచ్చాము? (మరియు మనమెందుకు ఇక్కడనున్నాము?)
2). ప్రపంచముతో వచ్చిన సమస్య ఏంటి?
3). ఏవిధంగా మనము దానిని సరిచేయవచ్చు?

ఈ దినాలలో ప్రబలమైన ప్రపంచధృక్పధము ఏంటంటే ప్రకృతివాదము, అంటే ఈ మూడు ప్రశ్నలకు జవాబులు ఈవిధంగా ఇస్తుంది: 1) మనము యధేచ్చగా ప్రకృతి క్రియలవలన ఖచ్చితమైన ఉధ్దేశ్యములేకుండా ఊడిపడిన ఉత్పత్తి. 2). మనము గౌరవించాల్సినవిధంగా ప్రకృతిని గౌరవించము. 3). మనము ప్రపంచాన్ని జీవావరణ శాస్త్రం మరియు అంతరించకుండా పరిరక్షించటం. ప్రకృతివాదులయొక్క ప్రపంచధృక్పధము వాటికి సంభంధించిన అనేక తత్వాలను ఉత్పాదిస్తుంది అవే నైతిక సాపేక్షతా సిధ్ధాంతం, అస్థిత్వవాదం, వ్యవహార ఙ్ఞానం మరియు కల్పనా జగత్తువాదం.

క్రైస్తవ ప్రపంచ ధృక్పధము, మరొకరీతిగా, బైబిలు పరంగా ఈ మూడు ప్రశ్నలకు జవాబిస్తుంది. 1) మనము, దేవుడు ఉధ్దేశ్యపూర్వకంగా చేసిన సృష్ఠి, ప్రపంచాన్ని పరిపాలించుటకు మరియు ఆయనతో సహవసించుటకు (ఆదికాండం 1:27; 2:15). 2). దేవునికి వ్యతిరేకంగా పాపముచేసి మరియు ప్రపంచాన్నంతటిని శాపానికి గురిచేసినాము ( ఆదికాండం 3). 3). దేవుడు తనకు తానే తన కుమరుడైన యేసుక్రీస్తుని బలి ఇచ్చుటవలన, మనలను విమోచించెను ( ఆదికాండం 3:15; లూకా 19:10), మరియు ఒకానొక దినాన్న దేవుడు దానిని పూర్వపు సంపూర్ణ స్థితికి పునరుజ్జీవింపచేస్తాడు ( యెషయా 65:17-25). క్రైస్తవ ప్రపంచ ధృక్పధము నైతిక నిరపేక్షతకు, అద్భుతాలకు, మానవ గౌరవము, మరియు విమోచనకు సంభావనీయతను దారితీసింది.

ఈ ప్రపంచ దృక్పధమును అనేది చాల విస్తారమైన అంశమని ప్రాముఖ్యంగా ఙ్ఞాపకముంచుకోవాలి. ఇది జీవితంలోని ప్రతీ కోణాన్ని ప్రభావితంచేస్తుంది, ధనమునుండి నైతికతకు, రాజకీయాలనుండి కళాకారితనానికి. నిజమైన క్రైస్తవత్వం సంఘంలో ఉపయోగించే అనేక భావాలు కంటే మించినది. క్రైస్తవత్వము భోధిస్తుంది బైబిలే ఒక ప్రాపంచిక ధృక్పధము. బైబిలు ఎన్నడూ "మతపరమైన" మరియు "లౌకిక" జీవితంను వేరుచేయలేదు; క్రైస్తవ జీవితం ఒక్కటే అక్కడున్న జీవితం. యేసు తనగురించి తానే ప్రభోధించాడు " నేనే మార్గము, నేనే సత్యము మరియు నేనే జీవమును" ( యోహాను 14:6) మరియు , ఆవిధంగా చేయుటవలన అదే మన ప్రపంచ ధృక్పధము అవుతుంది.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


క్రైస్తవ ప్రపంచ ధృక్పధము అంటే ఏంటి?