settings icon
share icon
ప్రశ్న

క్రైస్తవులు ఇతర ప్రజల మత నమ్మికలపట్ల సహనముగా ఉండాలా?

జవాబు


మన “సహనము” కలిగిన యుగములో, నైతిక సాపేక్షవాదం ఉన్నత ధర్మముగా నియమింపబడెను. ప్రతి తత్వశాస్త్రం, ఆలోచన, మరియు విశ్వాస వ్యవస్థ సమానమైన విలువ కలిగి, సాపేక్షలు చెప్పినట్లు, సమానమైన గౌరవ విలువ కలిగియుండును. ఒక విశ్వాస వ్యవస్థ కంటే మరియొక దానిపై ఇష్టం కలిగిన వారికి లేక – ఇంకా చెత్తదైనా- ఖచ్చితమైన సత్య జ్ఞానమును పేర్కొని సంకుచిత స్వభావం కలిగి, జ్ఞానోదయంలేక, లేక మూఢవిశ్వాసిగా పరిగణింపబడును.

అయితే, వివిధ మతాలు పరస్పర ప్రత్యేక వాదనలు చేసి, మరియు సాపేక్షవాదులు తార్కికంగా వైరుధ్యాలను పూర్తిగా పునరిద్ధరించలేకపోయెను. ఉదాహరణకు, బైబిలు “మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును” (హెబ్రీ. 9:27) అని పేర్కొనగా, కొన్ని తూర్పు మతములు పునర్జన్మను బోధించును. అందువలన, మనము ఒకసారే మరణిస్తామా లేక చాలా సార్లా? రెండు బోధలు సత్యమవ్వవు. సాపేక్షవాదులు తప్పనిసరిగా ఒక విరుద్ధమైన ప్రపంచమును సృష్టించుటకు ఎక్కడైతే అనేక విరుద్ధమైన “సత్యాలు” కలిసివుండునో దానిని తిరిగి నిర్వచించును.

యేసు చెప్పెను, “నేను మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు” (యోహాను 14:6). ఒక క్రైస్తవుడు సత్యమును, కేవలము ఒక అంశంగా కాకుండా, ఒక వ్యక్తిగా అంగీకరించెను. ఈ సత్యమును తెలిసికొనుట క్రైస్తవుడిని ఆ రోజుకు “ఏదైనా అంగీకరించగల” వాటినుండి దూరపరచును. క్రైస్తవుడు యేసు మృతులలోనుండి లేపబడెనని బాహాటముగా తెలియజేసెను (రోమా 10:9-10). ఒకవేళ అతడు నిజముగా పునరుత్థానం నందు నమ్మిక యుంచితే, యేసు ఎన్నటికీ తిరిగి లేపబడలేదు అనే అవిశ్వాసుల ప్రకటనకు అతడు “ఏదైనా అంగీకరించి”నట్లు ఎలా ఉండగలడు? ఒక క్రైస్తవునికి దేవుని స్పష్టమైన వాక్యమును ఖండించుట నిజానికి దేవునికి ద్రోహము చేయడమే.

విశ్వాసమునకు మూలాలుగా మనము కొన్నిటిని ఇంతవరకు ఉదాహరణలుగా చెప్పడం గుర్తిoచుడి. కొన్ని విషయాలు (క్రీస్తు యొక్క శారీరక పునరుత్థానం లాంటివి) చర్చించుకోలేనవి. ఇతర విషయాలు, హెబ్రీ పత్రిక ఎవరు వ్రాసారు లేక “శరీరములో ముళ్ళు ఉండెను” అనే పౌలు స్వభావం వంటివి మాట్లాడుటకు ఆటంకము లేదు. ప్రతి ద్వితీయ విషయాల వివాదాలలో కూరుకుపోకుండా మనము ఉండాలి (2 తిమోతి 2:23; తీతు 3:9).

ఒక ప్రముఖ సిద్ధాంతముపై వివాదించునప్పుడు/సంభాషించునప్పుడు, ఒక క్రైస్తవుడు నియంత్రణ పాటించి మరియు గౌరవం చూపించాలి. ఒక స్థానముతో విభేదం కలిగియుండడం ఒక విషయం; ఒక వ్యక్తిని అప్రతిష్ట పాలుచేయడం పూర్తిగా మరియొకటి. మనము సత్యమును గట్ట్టిగా చేపట్టి దానిని ప్రశ్నించే వారిపై దయ చూపించాలి. యేసు వలే, మనము కృపతో మరియు సత్యముతో రెండింటితో నింపబడాలి (యోహాను 1:14). పేతురు సమాధానం మరియు దీనత్వము కలిగియుండుటకు ఒక మంచి సమతుల్యతను చెప్పెను: “నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండుడి” (1 పేతురు 3:15).

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

క్రైస్తవులు ఇతర ప్రజల మత నమ్మికలపట్ల సహనముగా ఉండాలా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries