క్రైస్తవ తల్లిగా ఉండుట గూర్చి బైబిలు ఏమి చెప్తుంది?


ప్రశ్న: క్రైస్తవ తల్లిగా ఉండుట గూర్చి బైబిలు ఏమి చెప్తుంది?

జవాబు:
చాలామంది స్త్రీలకు తల్లిగా ఉండు చాలా ప్రాముఖ్య పాత్రను దేవుడు ఇచ్చుటకు ఎంపిక చేసికొనెను. ఒక క్రైస్తవ తల్లి ఆమె పిల్లలను ప్రేమించవలెనని చెప్పబడెను (తీతు 2:4-5). ఎందుకనగా ఆమె కలిగియున్న ప్రభువును మరియు రక్షకుని నామమునకు నింద కలుగనీయదు.

గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే (కీర్తనలు 127:3-5). తీతు 2:4 లో, గ్రీకు పదమైన philoteknos తల్లులు వారి పిల్లలను ప్రేమించుతాను సూచించుటలో కనబడును. ఈ పదము ప్రత్యేకమైన “తల్లి ప్రేమ”ను ప్రదర్శించును. ఈ పదములో నుండి వచ్చే ఆలోచన ఏమనగా మన పిల్లల కొరకు జాగ్రత్త వహించుట, వారిని పోషించుట, ఆప్యాయంగా హత్తుకొనుట, వారి అవసరాలను తీర్చుట, మరియు ప్రతి ఒక్కరిని సున్నితముగా స్నేహముగా దేవుని చేతినుండి వచ్చిన అపూర్వ బహుమానముగా చూచుట.

దేవుని వాక్యములో క్రైస్తవ తల్లులకు చాలా విషయాలు ఆజ్ఞాపింపబడినవి:

అందుబాటు - ఉదయము, మధ్యాహ్నం, మరియు రాత్రి (ద్వితీ 6:6-7)

ప్రమేయం – పరస్పర అభిప్రాయాలు, చర్చించుట, ఆలోచించుట, మరియు జీవితమును కలిసి ఒక విధానములో ఉంచుట (ఎఫెసీ 6:4)

బోధించుట – లేఖనములు మరియు బైబిలు సంబంధమైన ప్రపంచ చిత్రము (కీర్తనలు 78:5-6; ద్వితీ. 4:10; ఎఫెసీ. 6:4)

శిక్షణ – ఒక పిల్లవానికి తన నిపుణతలను అభివృద్ధి చేయుటకు సహాయపడి మరియు అతని/ఆమె బలములను కనుగొనుట (సామెతలు 22:6) మరియు ఆత్మీయ ఫలములు (రోమా. 12:3-8 మరియు 1 కొరింథీ. 12)

క్రమశిక్షణ – దేవుని భయమును బోధించుట, నిలకడగా నియంత్రణలో ఉంచుట, ప్రేమగా, స్థిరముగా (ఎఫెసీ. 6:4; హెబ్రీ. 12:5-11; సామెతలు 13:24; 19:18; 22:15; 23:13-14; 29:15-17)

పోషణ – స్థిరమైన మాట సహాయ వాతావరణమును అందించుట, ఓడిపోవుటకు స్వేచ్చ, అంగీకారము, ఆప్యాయత, షరతులులేని ప్రేమ (తీతు 2:4; 2 తిమోతి 1:7; ఎఫెసీ. 4:29-32; 5:1-2; గలతీ. 5:22; 1 పేతురు 3:8-9)

సమగ్రతకు ప్రతిరూపము – నీవు చెప్పేది జీవించడం, ఒక ప్రతిరూపముగా వుంటూ దేనినుoడైతే ఒక పిల్లవాడు “పట్టుకొని” నేర్చుకొంటాడో అలాంటి దైవభక్తిగల జీవితమును జీవించడం ద్వారా (ద్వితీ. 4:9, 15, 23; సామెతలు 10:9; 11:3; కీర్తనలు 37:18, 37).

పరిశుద్ధ గ్రంథము ప్రతి స్త్రీ ఒక తల్లి అయివుండాలని ఎన్నడూ ప్రకటించలేదు. అయితే, ప్రభువు ఎవరినైతే తల్లులుగా ఆశీర్వదించాడో వారు ఆ బాధ్యతను తీవ్రముగా పరిగణించాలి అని చెప్పెను. తల్లులకు వారి పిల్లల జీవితములో ఏకైక మరియు కీలకమైన పాత్ర ఉండును. మాతృత్వము అనేది తప్పక చేయాల్సిన లేక అసహ్యకరమైన విధి కాదు. ఎలాగైతే ఒక తల్లి ఒక పిల్లవానిని గర్భములో భరించునో, మరియు ఎలాగైతే ఒక తల్లి ఒక పిల్లవానిని అతని బాల్యములో పోషించి మరియు జాగ్రత్త తీసుకొనునో, అలాగే తల్లులు వారి పిల్లల జీవితాలలో కొనసాగుతూ ఉండే పాత్రను, వారు కౌమారదశ లోనైనా, యువకులైనా, యవ్వనంలోనైనా, లేక వారికి స్వంతముగా పిల్లలున్న పెద్దవారైనా పోషించును. మాతృత్వము యొక్క పాత్ర మారి మరియు అభివృద్ధి చెందుచుండగా, ఒక తల్లి ఇచ్చే ప్రేమ, ఆదరణ, పోషణ, మరియు ప్రోత్సాహం ఎన్నడూ ఆపుచేయకూడదు.

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
క్రైస్తవ తల్లిగా ఉండుట గూర్చి బైబిలు ఏమి చెప్తుంది?