క్రైస్తవులు పాత నిబంధన ధర్మశాస్త్రమును పాటించాలా?


ప్రశ్న: క్రైస్తవులు పాత నిబంధన ధర్మశాస్త్రమును పాటించాలా?

జవాబు:
పాత నిబంధన ధర్మశాస్త్రము ఇశ్రాయేలు దేశమునకు ఇవ్వబడెనని, క్రైస్తవులకు కాదని తెలుసుకొనుట ఈ సమస్యను అర్థం చేసుకొనుటకు తాళపు చెవి వలె ఉంది. ఇశ్రాయేలీయులు దేవునికి ఎలా లోబడి ఉండాలి మరియు ఆయనను ఎలా మెప్పించాలి అనుటను బయలుపరచుటకు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి (ఉదాహరణకు, పది ఆజ్ఞలు). మరికొన్ని ఆజ్ఞలు దేవుని ఎలా ఆరాధించాలి మరియు పాప పరిహారం ఎలా పొందాలి అని ఇశ్రాయేలీయులకు చూపేవిగా ఉన్నాయి (బలుల వ్యవస్థ). కొన్ని ఆజ్ఞలు ఇశ్రాయేలీయులు ఇతర దేశములకు భిన్నంగా ఉన్నారని తెలుపనుద్దేశించినవి (ఆహారం మరియు వస్త్రధారణ నియమాలు). పాత నిబంధనలోని ఏ ఆజ్ఞా కూడ క్రైస్తవులకు కట్టుబడి లేదు. యేసు సిలువ మీద మృతి పొందినప్పుడు, ఆయన పాత నిబంధన ధర్మశాస్త్రమునకు ముగింపు పలికాడు (రోమా. 10:4; గలతీ. 3:23-25; ఎఫెసీ. 2:15).

పాత నిబంధన ధర్మశాస్త్రమునకు బదులుగా, మనం క్రీస్తు ఆజ్ఞ క్రింద ఉన్నాము (గలతీ. 6:2), మరియు అది “అందు కాయననీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలెననునదియే. ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే” (మత్తయి 22:37-39). ఆ రెండు ఆజ్ఞలను మనం నెరవేర్చిన యెడల, క్రీస్తు మన యొద్ద నుండి ఆశించునదంతా మనం నెరవేర్చినట్లే: “ఈ రెండు ఆజ్ఞలు ధర్మ శాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అత నితో చెప్పెను” (మత్తయి. 22:40). అంటే నేడు పాత నిబంధన ధర్మశాస్త్రము ఉపయోగపడదని కాదు. పాత నిబంధన ధర్మశాస్త్రములో ఉన్న చాలా ఆజ్ఞలు “దేవుని ప్రేమించుట” మరియు “పొరుగువాని ప్రేమించుట” అను రెండు విభాగాలకు చెందుతాయి. దేవుని ఎలా ప్రేమించాలి మరియు నీ పొరుగువారిని ప్రేమించుట అంటే ఏమిటి అని అర్థం చేసుకొనుటకు పాత నిబంధన ధర్మశాస్త్రము గొప్ప మార్గదర్శిగా ఉంది. అదే సమయంలో, పాత నిబంధన ధర్మశాస్త్రము నేటి క్రైస్తవులకు కూడ వర్తిస్తుంది అనుట సరికాదు. పాత నిబంధన ధర్మశాస్త్రము ఒక ఏక పరిమాణము (యాకోబు 2:10). అయితే మొత్తం వర్తిస్తుంది, లేక ఏది వర్తించదు. క్రీస్తు దానిలో కొంతను నెరవేరిస్తే, బలుల వ్యవస్థ వంటిది, ఆయన అంతా నేరవేర్చినట్లే.

“మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే. దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” (1 యోహాను 5:3). పది ఆజ్ఞలు పాత నిబంధన ధర్మశాస్త్రమంతటికీ ముఖ్యంగా సారాంశం వలె ఉన్నాయి. పది ఆజ్ఞలలో తొమ్మిది క్రొత్త నిబంధనలో స్పష్టముగా మరలా చెప్పబడ్డాయి (విశ్రాంతి దినమును పాటించుము అనునది మినహా). సామాన్యంగానే, మనం దేవుని ప్రేమించిన యెడల, మనం అబద్ధ దేవతలను ఆరాధించము లేక విగ్రహాల ముందు తలవంచము. మనం మన పొరుగువారిని ప్రేమించిన యెడల, వారిని హత్య చేయము, వారితో అబద్ధమాడము, వారికి విరోధంగా వ్యభిచారం చెయ్యము, లేక వారికి చెందిన దానిని ఆశించము. పాత నిబంధన ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశమేమనగా ధర్మశాస్త్రమును పాటించుటలో ప్రజల యొక్క అసమర్థతను చూపుట మరియు రక్షకునిగా యేసు క్రీస్తు యొక్క అవసరతను మనకు చూపుట (రోమా. 7:1-9; గలతీ. 3:24). పాత నిబంధన ధర్మశాస్త్రము అన్ని కాలములలో ప్రజలందరికీ సార్వత్రిక ధర్మశాస్త్రము కావాలని దేవుడు ఆశించలేదు. మనం దేవుని ప్రేమించాలి మరియు పొరుగువారిని ప్రేమించాలి. ఆ రెండు ఆజ్ఞలను మనం నమ్మకంగా పాటించినయెడల, దేవుడు మన యొద్ద నుండి ఆశించి ప్రతిది మనం పాటించుచున్నట్లే.

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
క్రైస్తవులు పాత నిబంధన ధర్మశాస్త్రమును పాటించాలా?

ఎలా దొరుకుతుందో తెలుసుకోండి ...

దేవునితో శాశ్వతత్వం ఖర్చుదేవుని నుండి క్షమాపణ పొందండి