క్రైస్తవ తండ్రుల గూర్చి బైబిలు ఏమి చెప్తుంది?


ప్రశ్న: క్రైస్తవ తండ్రుల గూర్చి బైబిలు ఏమి చెప్తుంది?

జవాబు:
లేఖనములలో అత్యంత గొప్ప ఆజ్ఞ ఇది: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను” (ద్వితీ. 6:5). 2వ వచనమునకు వెళ్తే, మనము చదువుతాము, “నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలన్నియు ఆజ్ఞలన్నియు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు.” ద్వితీ 6:5 ను అనుసరించి, మనము చదివితే, “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యిoట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను” (వచనములు. 6-7).

ఇశ్రాయేలు చరిత్ర తండ్రి తన కుమారులను ప్రభువు యొక్క మార్గాలలో మరియు ఆయన మాటలలో వారి స్వంత ఆత్మీయ అభివృద్ధి కొరకు మరియు క్షేమాభివృద్ధి కొరకు సూచించడంలో శ్రద్ధ కలిగియుండునని బయలుపరచును. లేఖనము యొక్క ఆజ్ఞలకు ఏ తండ్రి అయితే విధేయత చూపి అలా చేసెను. ఇది సామెతలు 22:6 లో మనకు తేబడెను, “బాలుడు నడువ వలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.” “నేర్పుము” అనేది ఒక తండ్రి మరియు తల్లి ఒక కుమారునికిచ్చే మొదటి సూచన, అదే అతని ప్రారంభ విద్య. ఈ శిక్షణ పిల్లలు వారు ఏ విధమైన జీవితం జీవించాలో స్పష్టము చేయునట్లుగా రూపొందించబడినది. ఒక పిల్లవాని ఆరంభ విద్య ఇలాంటి గొప్ప ప్రాముఖ్య మార్గములో ప్రారంభమగును.

ఎఫెసీ. 6:4 తండ్రికి, అనుకూలమైన మరియు ప్రతికూలమైన మార్గములో, రెండు విధాలుగా, సూచనల సారాంశం. “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” ఈ వచనము యొక్క ప్రతికూల భాగము ఒక తండ్రి తీవ్రతతో, అన్యాయంగా, స్వార్ధంగా, లేక అకారణమైన అధికారాన్ని ప్రదర్శించి ప్రతికూలతను పెంచకూడదు. ఒక పిల్లవానిపట్ల కఠిన, అకారణమైన ధోరణి కేవలం హృదయములో కీడును పెంపొందించేలా సహాయపడును. “రేకెత్తు” అనే పదమునకు “విసిగించు, రెచ్చగొట్టు, తప్పుడు మార్గమును రుద్దుట, లేక ప్రేరేపించుట.” ఇది తప్పుడు ఆత్మతో మరియు తప్పుడు విధానాలలో చేయబడును- తీవ్రత, అకారణత్వము, దృఢత్వము, కఠినత్వము, క్రూరహక్కులు, అనవసర మైన పరిమితులు, మరియు నియంత ఆధిపత్యముపై స్వార్ధ పట్టు. అలాంటి రేకెత్తే విషయాలు ప్రతికూల స్పందనలు కలిగించి, పిల్లల ప్రేమను క్షీణింపజేసి, పరిశుద్ధత కొరకు వారి వాంఛను తగ్గించి, మరియు వారు వారి తల్లితండ్రులను సంతోషపరచుట సాధ్యపడదని భావించునట్లుగా చేయును. తెలివైన తల్లితండ్రులు ప్రేమ మరియు మ్రుదుత్వముతో విధేయతను కోరి మరియు పొందేలా చేయుటకు వెదకును.

ఎఫెసీ. 6:4 యొక్క అనుకూల భాగము ఒక సమగ్ర దిశగా వ్యక్తీకరించబడెను- వారిని అభ్యసింపజేసి, పెంపొందించి, ప్రభువు యొక్క బోధలో మరియు సూచనలో వారి జీవితమంతటిలో వారి ప్రవర్తనను అభివృద్ధి చేసికొనును. ఇది నేర్పించుటకు మరియు క్రమశిక్షణకు సంపూర్ణ క్రమము. “మందలింపు” అనే పదము పిల్లవాని యొక్క తప్పులను (నిర్మాణాత్మకంగా) మరియు విధులను (బాధ్యతలు) గుర్తుచేసే ఆలోచనను కలిగియుండును.

క్రైస్తవ తండ్రి నిజముగా దేవుని చేతిలో ఒక పరికరము. సూచన మరియు శిక్షణ యొక్క సంపూర్ణ పద్ధతి ఏదైతే దేవుడు ఆజ్ఞాపించి మరియు ఆయన ఏదైతే పరిపాలించి. పిల్లల మనస్సుకు, హృదయమునకు, మరియు ఆలోచనకు స్థిరమైన మరియు తక్షణ సంబంధమును తెచ్చునట్లు ఉండవలెను. మాన తండ్రి తననుతాను సత్యమును మరియు విధులను నిర్ధారించుటకు చివరి అధికారము గలవానిగా ప్రదర్శించుకొనకూడదు. అది కేవలం దేవునిని బోధకునిగా మరియు పాలకునిగా ఎవరి అధికారములోనైతే అన్నియు విద్య యొక్క గమ్యములను శ్రేష్ఠముగా పొందుట ద్వారా చేయబడును.

మార్టిన్ లూథర్ చెప్పెను, “ఒక పిల్లవాడు మంచి చేసినప్పుడు అతనికిచ్చుటకు ఆపిల్ ప్రక్కన కర్ర ఉంచుము.” క్రమశిక్షణ శ్రద్ధగల జాగ్రత్తతో మరియు అధిక ప్రార్ధన కలిగిన స్థిరమైన శిక్షణతో అభ్యసించవచ్చు. శిక్ష, క్రమశిక్షణ, మరియు దేవుని వాక్యము యొక్క బోధ, గద్దింపు మరియు ప్రోత్సాహం రెండు ఇచ్చుట, “హితబోధకు” ముఖ్యమైన కేంద్ర భాగముగా ఉండెను. సూచన దేవునియొద్ద నుండి వచ్చును, క్రైస్తవ అనుభవములో పాఠశాలలో నేర్చుకొని, మరియు తల్లితండ్రులచే పాలింపబడి-ప్రాధమికంగా తండ్రి, అంతేకాకుండా, ఆయన మార్గనిర్దేశములో, తల్లి క్రింద. క్రైస్తవ క్రమశిక్షణ పిల్లలను దేవుని కొరకు గౌరవం పెంపొందించేలా, తల్లితండ్రుల అధికారంపై గౌరవం, క్రైస్తవ మూలాలపై జ్ఞానము, మరియు స్వనియంత్రణ అలవాటు కలిగివుంచేలా చేసే అవసరం వుంది.

“దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది” (2 తిమోతి 3:16-17). ఒక తండ్రి యొక్క మొదటి బాధ్యత తన పిల్లలకు లేఖనములు పరిచయం చేయడం. తండ్రులు దేవుని సత్యమును బోధించుటకు తెలిపే అర్ధాలు మరియు పద్ధతులు మారచ్చు. ఒక తండ్రి నమ్మకమైన ఆదర్శంగా ఉన్నప్పుడు, పిల్లలు దేవుని గూర్చి నేర్చుకొనినది వారేమి చేసినను లేక ఎక్కడికి వెళ్ళినా వారి భూసంబంధమైన జీవితమంతటిలోను వారిని మంచి స్థానములో ఉంచును.

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
క్రైస్తవ తండ్రుల గూర్చి బైబిలు ఏమి చెప్తుంది?

ఎలా దొరుకుతుందో తెలుసుకోండి ...

దేవునితో శాశ్వతత్వం ఖర్చుదేవుని నుండి క్షమాపణ పొందండి