ఆర్థిక క్రైస్తవులు వైద్యుని చెంతకు వెళ్లవచ్చా?


ప్రశ్న: ఆర్థిక క్రైస్తవులు వైద్యుని చెంతకు వెళ్లవచ్చా?

జవాబు:
వైద్య సేవలు కోరడమనేది దేవునియందు అవిశ్వాసమును కనుపరచడం అని కొంతమంది క్రైస్తవుల నమ్మకం. వాక్య-విశ్వాస ఉద్యమంలో, వైద్యుని సంప్రదించడం దేవుడు మనల్ని స్వస్థపరచుటను తిరస్కరించుటకుగల అవిశ్వాసమని తరచు పరిగణింపబడేది. క్రైస్తవ విజ్ఞానశాస్త బృందాలలో, కొన్నిసార్లు వైద్యుని సంప్రదించడం దేవుడు మనలను మనం స్వస్థపరచుకొనుటకు మనకిచ్చిన ఆత్మీయ ఒక శక్తిని ఉపయోగించుటకు అడ్డంకిగా పరిగణింపబడింది. ఈ దృక్కోణాల తర్కం తీవ్రంగా లేకపోయింది. ఒకవేళ నీ కారు దెబ్బతింటే, నీవు దానిని పరికరకర్త (బాగుచేయువాడు) యొద్దకు తీసుకువెళ్తావా లేదా నీ కారు స్వస్థపడడానికి దేవుని అద్భుతము కొరకు ఎదురుచూస్తావా? ఒకవేళ మీ ఇంట్లో పైపులైను పేలిపోతే, ఆ కారిపోయే స్థలమును అతికించుటకొరకు దేవుని కోసం ఎదురుచేస్తావా, లేదా నీటిగొట్టములు బాగుచేసేవాడిని పిలుస్తావా? దేవునికి మన శరీరములను స్వస్థపరచే సామర్థ్యం ఉన్నవిధంగానే కారును లేదా నీరుగొట్టాలను బాగుచేసే సామర్థ్యుడు. దేవుడు స్వస్థత అద్భుతాలుచేయగల సమర్ధుడను సత్యం మనకు సహాయం చేయగల జ్ఞానం మరియు నైపుణ్యం కలిగిన వ్యక్తులను ఆశ్రయించక ఎల్లప్పుడు అద్భుతమును కోరుకోవడమని కాదు దీని యొక్క అర్థం.

బైబిల్ లో వైద్యులు ఇంచుమించు పండ్రెండుసార్లు (డజను) చెప్పబడ్డారు. ఒక వ్యక్తి వైద్యుని వద్దకు వెళ్లకూడదు అని బోధించడానికి సందర్భంలో నుండి బయటకు తీయగల ఒకేఒక వాక్యభాగం 2 దిన. 16:12 మాత్రమే. “ఆసా తన యేలుబడియందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బుపుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణచేయక వైద్యులను పట్టుకొనెను.” ఆ వైద్యుని సంప్రదించాడని కాదు ఇక్కడ సమస్య, కానీ “యెహోవా యొద్ద సహాయం కోరలేదు.” వైద్యుని సంప్రదిస్తున్నప్పుడు కూడా, మన విశ్వాసం దేవునియందు ఉండాలి, వైద్యుని యందు కాదు.

“వైద్యచికిత్సను” గూర్చి బైబిల్ లో అనేక వచనములు మాట్లాడుతున్నాయి అవేవనగా పట్టీలు కట్టబడుట (యెషయా 1:6), నూనె (యాకోబు 5:14), నూనెయు మరియు ద్రాక్షారసము (లూకా 10:34), ఆకులు (యెహేజ్కేలు 47:12), ద్రాక్షారసము (1 తిమోతి 5:23), మరియు లేపం, ప్రత్యేకంగా “గిలాదు గుగ్గిలము” (యిర్మీయా 8:22). అపొస్తలుల కార్యములు మరియు లూకా సువార్త యొక్క రచయతను గూర్చి పౌలు “ప్రియుడైన వైద్యుడు” అని చెప్పాడు (కొలస్సీ. 4:14).

రక్తస్రావం చేత తరచు బాధపడుచున్న స్త్రీ తన కలిగినదంతయు వ్యయము చేసికొని అనేక వైద్యులను సంప్రదించినను ఆమె సమస్యకు పరిష్కారం దొరకని ఆమెను గూర్చి మార్కు 5:25-30లో చెప్తున్నాడు. యేసువద్దకు వచ్చి ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టితే స్వస్థపడతానని ఆమె అనుకొని; ఆయన వస్త్రపూ చెంగును ముట్టెను మరియు ఆమె బాగుపడెను. యేసు, ఆయన పాపులతో సమయం సమయము గడుపుటను గూర్చి పరిసయ్యులతో స్పందించినప్పుడు, ఆయన వారితో ఈ విధంగా చెప్పెను, “రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు” (మత్తయి 9:12). ఈ వచనమును బట్టి ఒకడు క్రింది నియమాలను జల్లెడ పట్టవచ్చు:

1) వైద్యులు దేవుడు కాదు మరియు అలా పరిగణింపనూకూడదు. కొన్నిసార్లు వారు సహాయం చెయ్యొచ్చు, కానీ కొన్నిసార్లు వారు చేసే ప్రయత్నాలన్నీ డబ్బును వృధా చేసేవవుతాయి.

2) వైద్యులను సంప్రదించుట మరియు “భూలోక” నివారణలు ఉపయోగించుటను వాక్యము తిరస్కరించదు. వాస్తవంగా, వైద్య చికిత్సలను అనుకూలంగా చూచుకోవాలి.

3) ఏ విధమైన శరీర క్లిష్ట పరిస్థితిలోనైనా దేవుని కలుగజేసికొనుటకు చూడాలి (యాకోబు 4:2; 5:13). మనకు కావలసిన రీతిలో ఆయన స్పందిస్తానని ఆయన వాగ్దానం చేయలేదు (యెషయా 55:8-9), కానీ ఆయన చేసేవన్నీ ప్రేమతో చేస్తాడని మరియు మనకి ఉత్తమమైనది చేస్తాడని మనకు హామీ ఉంది (కీర్తనలు 145:8-9).

కాబట్టి, క్రైస్తవులు వైద్యులను సంప్రదించవచ్చా? దేవుడు మనల్ని తెలివైన మానవులనుగా చేసి మరియు మందులను చేసే సామర్థ్యంను ఇచ్చి మరియు మన శరీరాలను ఎలా బాగుచేసుకోవాలో నేర్పించాడు. ఈ జ్ఞానమును మరియు సామర్థ్యంను శరీర స్వస్థత కొరకు ఉపయోగించుటలో తెప్పేమీ లేదు. వైద్యులు దేవుడు మనకిచ్చిన బహుమానం, దేవుడు స్వస్థతను మరియు ఆరోగ్యమును మరల ప్రసాదించుటకు వీరు ప్రతినిధులు అని చెప్పవచ్చు. అదే సమయంలో, మన విశ్వాసం మరియు నమ్మకం దేవునియందు ఉండాలే గాని వైద్యుని యందు లేదా మందులయందు కాదు. మన క్లిష్ట నిర్ణయాలలో, మనం కోరుకున్నప్పుడు మనకు జ్ఞానమును ప్రసాదిస్తానని వాగ్దానం చేసిన దేవుని వైపు మనం చూడాలి (యాకోబు 1:5).

English
తెలుగు హోం పేజికు వెళ్ళండి
ఆర్థిక క్రైస్తవులు వైద్యుని చెంతకు వెళ్లవచ్చా?

ఎలా దొరుకుతుందో తెలుసుకోండి ...

దేవునితో శాశ్వతత్వం ఖర్చుదేవుని నుండి క్షమాపణ పొందండి