కయీను భార్య ఎవరు? కయీను భార్య అతని సహోదరియా?ప్రశ్న: కయీను భార్య ఎవరు? కయీను భార్య అతని సహోదరియా?

జవాబు:
కయీను భార్య ఎవరో బైబిల్ ఖచ్చితంగా చెప్పుటలేదు. కయీను భార్య అతని సహోదరి, లేక మేనకోడలు, లేక ముది-మేనకోడలు అనేది మాత్రమే ఒక జవాబు కావచ్చు. హేబెలును చంపినప్పుడు కయీను యొక్క వయస్సు ఎంతో బైబిల్ చెప్పుటలేదు (అది. 4:8). వారు ఇరువురు రైతులు కాబట్టి, వారు పెద్దవారైయుండు, తమ తమ కుటుంబాలు కలిగియుండి ఉండవచ్చు. హేబెలు మరణించే సమయానికి ఆదాము హవ్వలు అనేక మంది పిల్లలకు జన్మనిచ్చియుండవచ్చు. వారికి ఖచ్చితంగా తరువాత అనేక మంది పిల్లలు పుట్టియుండవచ్చు (అది. 5:4). హేబెలును చంపిన తరువాత కయీను తన ప్రాణము కొరకు భయపడెను అంటే (ఆది. 4:14), అప్పటికే ఆదాము హవ్వలకు మరి చాలా మంది పిల్లలు, మనువాళ్ళు, మనవరాండ్రు ఉండియుండవచ్చు. కయీను భార్య (అది. 4:17) ఆదాము హవ్వల యొక్క కుమార్తె లేక మనవరాలు కావచ్చు.

ఆదాము హవ్వలు మొదట (మరియు ఏకైక) మానవులు కాబట్టి, వారు వారి మధ్యలో వివాహం చేసుకొనుట తప్ప వారికి వేరే వికల్పం లేదు. కుటుంబ-వివాహాల యొక్క అవసరత ముగియబడేవరకు అనగా చాలా కాలం తరువాత వరకు దేవుడు కుటుంబ-వివాహాలను ఖండించలేదు (లేవీ. 18:6-18). నేడు అగమ్యాగమన సంబంధాల వలన జన్యు అపాంగము కలిగిన పిల్లలు పుట్టుటకు గల కారణం అనగా ఒకే జన్యు గుణములు కలిగిన ఇద్దరు (అనగా, సహోదరి సహోదరులు) పిల్లలు కనుట, వారిలోని బలహీన గుణములు ఎక్కువగా వారిలోకి వస్తాయి. వేర్వేరు కుటుంబాలకు చెందిన ప్రజలు పిల్లలను కనినప్పుడు, తల్లిదండ్రులిద్దరు ఒకే విధమైన బలహీన జన్యు గుణములు కలిగియుండుట సాధ్యము కాదు. తరము నుండి తరము వరకు అందించుచుండగా శతాబ్దాలు తరబడి మానవుల జన్యు గుణములు బహుగా “కలుషితం” అయిపోయాయి. ఆదాము హవ్వలలో ఎలాంటి జన్యు బేదములు లేవు, కాబట్టి వారికి మరియు మొదటి కొన్ని తరముల వారికి మనకంటే ఎక్కువ మరియు గొప్ప ఆరోగ్య స్థాయి కలిగియుండేవారు. ఆదాము హవ్వల పిల్లలలో ఎలాంటి జన్యు బేదములు లేవు. అందువలన, వారు వారి మధ్యలో వివాహం చేసుకొనుట సురక్షితము.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


కయీను భార్య ఎవరు? కయీను భార్య అతని సహోదరియా?