యేసుక్రీస్తుయొక్క పండ్రెండు శిష్యులు (12)అపోస్తలులు ఎవరు?ప్రశ్న: యేసుక్రీస్తుయొక్క పండ్రెండు శిష్యులు (12)అపోస్తలులు ఎవరు?

జవాబు:
“శిష్యుడు” అనే పదము నేర్చుకొనేవ్యక్తి లేక వెంబడించే వ్యక్తిని సూచిస్తుంది. అపోస్తలుడు అనే పదము అంటే "పంపించబడినవాడు." యేసు ప్రభువు ఈ భూమిమీద నున్నటి సమయములో, అతని వెంబడించిన పండ్రెండుమందిని శిష్యులు అంటారు. పండ్రెండుమంది శిష్యులు యేసుక్రీస్తుని వెంబడించేవారు, ఆయననుండి నేర్చుకున్నారు మరియు ఆయనచే తర్ఫీదు పొందినవారు. అయన పునరుత్ధానము మరియు ఆరోహణము తరువాత, యేసు తన శిష్యులను ఆయన సాక్షులుగా నుండుటకు వారిని పంపించెను (మత్తయి 28:18-20; అపోస్తలుల కార్యములు 1:8). దాని తరువాత వారిని పండ్రెండుమంది అపోస్తలులుగా సూచించబడ్డారు. ఏదిఏమైనా, యేసు ఈ భూమిమీద నున్నంత కాలములో, ఈ పదములు "శిష్యులు మరియు అపోస్తలులు" అనే పదములను పర్యాయపదముగా వాడారు.

ప్రాధమికమైన పండ్రెండు శిష్యులు / అపోస్తలులు అవి మత్తయి 10:2-4, “ఆ పండ్రెండుమంది అపోస్తలుల పేళ్ళు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ; జెబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; ఫిలిప్పు, బర్తలోమయి; తోమా, సుంకరియైన మత్తయి; అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరుగల లెబ్బయి; కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.” ఇంకా బైబిలులో చెప్పబడిన పండ్రెండు శిష్యులు / అపోస్తలులు ఇతర జాబితాలు మార్కు 3:16-19 మరియు లూకా 6:13-16లో నున్నవి. ఈ మూడు పాఠ్యభాగాలలో నామములలో చిన్న చిన్నగా పరస్పరములతో వేర్వేరుగా ఇవ్వబడినవి. తద్దయిని “యాకోబు సహోదరుడైన యూదా” అని కూడ పిలిచినట్లు సూచిస్తుంది(లూకా 6:16) మరియు లెబ్బయిని (మత్తయి 10:3). జెలోతే కుమారుడైన సీమోనునే కనానీయుడైన సీమోను అనికూడ పిలిచేవారు (మార్కు 3:18). యూదా ఇస్కరియోతు ఎవడైతే యేసును అప్పగించాడో, అతనికి బదులుగా మత్తయి అనే శిష్యుడుని భర్తీ చేసారు (చూడండి అపోస్తలుల కార్యములు 1:20-26). కొంతమంది బైబిలు భోధకుల ధృక్పధములో మత్తయిని “అశక్తుడుడైన” అపోస్తలుడుగా మరియు పండ్రెండవ అపోస్తలుడైన యూదా ఇస్కరియోతుకు బదులుగా పౌలును భర్తి చేయటం అనేది దేవుని ఎన్నికగా నమ్మారు.

పండ్రెండు శిష్యులు / అపోస్తలులు సధారనమైన పురుషులను దేవుడు అసామాన్యమైన పద్దతిలో వాడుకున్నాడు. వారిలో చేపలను పట్టేవరు, సుంకపు గుత్తదారులు, మరియు విప్లవకారులు. సువార్తలు ఆ పండ్రెండుమంది యొక్క నిరంతరముగా పడిపోయిన స్థితిని, కష్టాలు మరియు యేసుక్రీస్తుని వెంబడించిన స్థితిని సువార్తలలో లిఖించెను. అయన పునరుత్ధానము మరియు పరలోకమునకు ఆరోహణము అయినతరువాత, పరిశుధ్ధాత్ముడు శిష్యులు / అపోస్తలులు భూమిని తలక్రిందులు చేసేటటువంటి శక్తివంతమైన దేవుని పురుషులుగా వారిని రూపాంతర పరచెను(అపోస్తలుల కార్యములు 17:6). ఆ మార్పు ఎటువంటిది? "యేసుతో నుండిన" ఆపండ్రెండుమంది శిష్యులు / అపోస్తలులైనా(అపోస్తలుల కార్యములు4:13). మనగురించి కూడా అదేవిధముగా సాక్ష్యమిచ్చును గాక!


తెలుగు హోం పేజికు వెళ్ళండి


యేసుక్రీస్తుయొక్క పండ్రెండు శిష్యులు (12)అపోస్తలులు ఎవరు?