క్షమాపణ లభించిందా? మనం దేవుని నుండి క్షమాపణ ఎలా పొందుకోగలం?
ప్రశ్న: క్షమాపణ లభించిందా? మనం దేవుని నుండి క్షమాపణ ఎలా పొందుకోగలం?
సమాధానము:
అ.కా. 13:38“సహోదరులారా, మీకు తెలియచేసే విషయం ఏమిటంటే యేసు క్రీస్తు ద్వారానే మీ పాపములు క్షమింపబడుతాయి” అని ప్రకటించబడింది.
క్షమాపణ అంటే ఏమిటి మరియు నాకెందుకది అవసరం
“క్షమాపణ” అనే పదానికి అర్దం పలకను శుభ్రంగా తుడిచివేయడం, క్షమించటం, ఋణాన్ని రద్దు చేయటం అన్నమాట. మనము తప్పు చేసినప్పుడు తిరిగి మన సంబంధాలను కలుపుకోవటానికి క్షమాపణ కొరకు ఎదురుచూస్తాము. క్షమాపణకు సమ్మతి ఇవ్వబడలేదు ఎందుకంటే ఒక వ్యక్తి క్షమించబడుటకు అర్హుడు కాబట్టి. ఎవరూ క్షమించబడుటకు అర్హులు కారు. క్షమాపణ అనేది ప్రేమ, దయ మరియు కనికరము అనే క్రియలతో కూడినది. క్షమాపణ అనేది మీకు ఏది చేసినప్పటికీ, ఎదుటి వ్యక్తికి వ్యతిరేకముగా వారు చేసినది ఏదైనా గట్టిగా పట్టుకోవటం కాదు.
బైబిల్ ఏం చెపుతుందంటే మనమందరికీ దేవుని నుండి క్షమాపణ పొందవలసిన అవసరము ఎంతైనా వుంది. మనమందరము పాపము చేసాము. ప్రసంగి 7:20 లో, “పాపము చేయక మేలుచేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు”. “1 యోహాను 1:8 లో మనము పాపము లేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు”. కీర్తనలు 51:4 లో చెప్పినట్లుగా నేను కేవలము నీకే విరోధముగా పాపము చేసియున్నాను, నీ దృష్టి యెదుట చెడుతనము చేసియున్నాను. దీని ఫలితమే, మనందరికి ఖచ్చితంగా క్షమాపణ అవసరమై వున్నది. మన పాపములు క్షమింపబడనియెడల (మత్తయి 25:46: యోహాను 3:36) ప్రకారము మన పాపముల విషయమై మనము నిత్యశిక్షకు పాత్రులగుదుము.
క్షమాపణ—అది నేను ఎలా తెచ్చుకోగలను?
కృతజ్ఙతపూర్వకంగా, దేవుడు ప్రేమ మరియు దయగలవాడు—ఆయన మన పాపములను క్షమించటానికి ఎంతో ఆసక్తి కలవాడు. 2 పేతురు 3.9 లో మనకు తెలుపుతుంది... “ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలెనని దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నారు”. ఆయన మనలను క్షమించాలని కోరుకుంటున్నారు, అందుకే మనకొరకు క్షమాపణ ఏర్పాటు చేసారు.
మన పాపములకు వెల కేవలము మరణము. రోమా మొదటి సగభాగంలో 6:23లో “పాపము వలన వచ్చు జీతము మరణము”…. మన పాపముల వలన మనము సంపాదించుకున్నది నిత్య మరణము. దేవుడు తన ఖచ్చితమైన ప్రణాళిక ద్వారా యేసు క్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద అవతరించి మనకు రావాల్సిన శిక్షను శిలువలో చనిపోవుట ద్వారా మనకొరకు వెల చెల్లించారు. 2 కొరింథి 5:21 లో, "మనము ఆయనయందు దేవుని నీతి అగునట్లుగా, ఏ పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను”.యేసు శిలువ మీద చనిపోయి, మనకు చెందవలసిన శిక్షను ఆయన తీసుకొనెను. దేవుడిగా యేసు యొక్క మరణము సమస్త మానవాళి పాపములకు క్షమాపణ అందచేయబడినది! (1 యోహాను 2:2) ప్రకారము ఆయన మన పాపముల మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు. ( 1 కొరింథి 15:1-28 ) యేసు మరణము నుండి లేచి, పాపము మరియు మరణము మీద విజయము సాధించారని ప్రకటించబడింది. దేవునికి స్తోత్రము, యేసు క్రీస్తు మరణము మరియు పునరుద్దానము ద్వారా రోమా6:23 రెండవ భాగము లో చెప్పింది నిజము... “కాని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్యజీవము అనే వరము అనుగ్రహించబడింది”.
మీకు మీ పాపములు క్షమించబడాలి అని వుందా? మీకు ఈ పాపములలో నుండి పారిపోలేననే అపరాధ భావన మిమ్మల్ని పట్టి పీడిస్తుందా? మీ విశ్వాసాన్ని మీ రక్షకుడైన యేసుక్రీస్తు మీద వుంచిన ఎడల మీ పాపములకు క్షమాపణ అవకాశం కలుగుతుంది. ఎఫెసి 1:7 లో చెప్పినట్లుగా “ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి మనకు కలిగి యున్నది”. ఆయన మన అపరాధములకు వెల చెల్లించెను కాబట్టే మన పాపములు క్షమింబడినవి. యేసుద్వారా మీకు క్షమాపణ కలిగిందా అని అడిగితే---నాకు క్షమాపణ యివ్వటానికే యేసు చనిపోయారు అని నమ్మినఎడల ఆయన ఖచ్చితంగా మిమ్ములను క్షమిస్తారు. యోహాను 3.16,17 లో చెప్పిన అద్బుతమైన సమాచారము ఏమిటంటే, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు".
క్షమాపణ—అది నిజముగా చాలా తేలికా?
అవును అది చాలా తేలిక! మీరు దేవునినుండి క్షమాపణ సంపాదించుకోలేరు. దేవుని దగ్గర నుండి మీ క్షమాపణ కొరకు మీరు ఏమి చెల్లించలేరు. దేవుని కృప మరియు కనికరము ద్వారా విశ్వాసంతో మాత్రమే మీరు దానిని పొందుకోగలరు. మీరు యేసుక్రీస్తుని మీ రక్షకుడిగా అంగీకరించి మరియు దేవుని వద్దనుండి క్షమాపణ పొందుకోవాలంటే ఈ ప్రార్దనను మీరు చేయవచ్చు. ఈ ప్రార్దన చెప్పటం వలన గాని లేదా మరి ఏ ఇతర ప్రార్దన మిమ్ములను రక్షించలేదు. యేసు క్రీస్తు నందు విశ్వాసము వుంచుట ద్వారా మాత్రమే మన పాపములకు క్షమాపణ లభిస్తుంది. ఈ ప్రార్దన యేసు నందు మనకున్న విశ్వాసాన్ని వివరించటానికి మరియు ఆయన మనకు అనుగ్రహించిన క్షమాపణకు కృతజ్ఞతలు చెల్లించటానికి ఒక సులభమైన మార్గము మాత్రమే. “ప్రభువా! నాకు తెలుసు నేను మీకు విరోధముగా పాపము చేసాను మరియు నేను శిక్షకు పాత్రుడను. కాని యేసు క్రీస్తు నాకు చెందవలసిన శిక్షను తీసుకుని విశ్వాసం ద్వారా నేను క్షమించబడ్డాను. నా రక్షణ కొరకు నా నమ్మకాన్ని మీలో వుంచుతాను. మీ అద్బుతమైన కృప మరియు క్షమాపణ కొరకు కృతజ్ఙతలు ! ఆమెన్ !”
మీరు ఇక్కడ చదివారు కాబట్టి మీరు క్రీస్తు కొరకు ఒక నిర్ణయానికి వచ్చారా? అలా అయితే, క్రింద "ఈ రోజు నేను క్రీస్తును అంగీకరించాను" బటన్ క్లిక్ చేయండి.
తెలుగు హొం పేజికి తిరిగి రండి
క్షమాపణ లభించిందా? మనం దేవుని నుండి క్షమాపణ ఎలా పొందుకోగలం?
|