settings icon
share icon
ప్రశ్న

నాకు వ్యతిరేకముగా పాపము చేసినవారిని ఎలా క్షమించగలను?

జవాబు


ప్రతీవారు ఏదో ఒకచోట తప్పుచేసి, ఖండించబడి, మరియు వ్యతిరేకముగా పాపం చేశారు. అలాంటి నేరాలు జరిగినప్పుడు క్రైస్తవులు ఎలా స్పందిస్తారు? బైబిలు ప్రకారం, మనము ఇతరులను క్షమించాలి. ఎఫెసీ. 4:32 ప్రకటిస్తూ, “ఒకని యెడల ఒకడు దయకలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.” అదేవిధముగా కొలస్సి. 3:13 ప్రకటిస్తూ, “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడు, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.” ఈ రెండు లేఖనములలో ఉన్న తాళంచెవి మనము ఇతరులను దేవుడు మనలను క్షమించినట్లు క్షమించవలెను. మనము ఎందుకు క్షమించాలి? ఎందుకంటే మనము క్షమించబడ్డాము!

క్షమాపణ ఒకవేళ మనలను ఎవరైతే దానిని దుఃఖముతో మరియు పశ్చాత్తాపముతో అడుగునో అలాంటి వారికి అది చేయడం సులువు. బైబిలు మనకు చెప్పుచున్నది మనము, షరతులు లేకుండా, మనకు వ్యతిరేకముగా పాపము చేసినవారిని క్షమించవలెను. ఆగ్రహము, క్రూరము , మరియు కోపము చూపే వ్యక్తిని క్షమించుటకు తిరస్కరించుట, ఇందులో ఏదీకూడా నిజక్రైస్తవుని లక్షణాలు కాదు. ప్రభుప్రార్థనలో, మనము దేవునిని మన పాపములను, మనకు వ్యతిరేకముగా పాపము చేసినవారిని మనము క్షమించినట్లు క్షమించుమని అడుగుదుము (మత్తయి 6:12). మత్తయి 6:14-15 లో యేసు చెప్పెను, “మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.” దేవుని క్షమాపణ గూర్చి మాట్లాడే ఇతర లేఖనములతో పోల్చితే, మత్తయి 6:14-15 ఇతరులను క్షమించుటకు వ్యతిరేకించేవారికి వారిపట్ల దేవుని క్షమాపణను అనుభవించనివారికి మంచిగా అర్థమగును.

ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపుతామో, మనము ఆయనకు వ్యతిరేకముగా పాపము చేయుదుము. మనము ఒక వ్యక్తిని తప్పుపట్టినప్పుడు, మనము ఆ వ్యక్తికి విరోధముగానే కాకుండా, దేవునికి వ్యతిరేకముగా కూడా పాపము చేయుదుము. మనము మన అతిక్రమములన్నిటినీ క్షమించిన మేరకు పరిగణిస్తే, మనము ఆ కృపను ఇతరులనుండి దూరముగా ఉంచుటకు తెలిసికొందము. మనము యే వ్యక్తికంటే ఎక్కువగా దేవునికి విరోధముగా అపరిమితముగా పాపము చేశాము. ఒకవేళ మనలను దేవుడు అంతగా క్షమిస్తే, ఇతరులను చాల చిన్న విషయాలపట్ల క్షమించుటకు ఎలా తిరస్కరిస్తాము? మత్తయి 18:23-35 లో యేసు ఉపమానము ఈ సత్యమును గూర్చి ఒక శక్తివంతమైన ఉదాహరణ. దేవుడు మనము ఆయనయొద్దకు క్షమాపణ కొరకు వస్తే, ఆయన ఉచితముగా ఇచ్చునని వాగ్ధానము చేసెను (1 యోహాను 1:9). దేవుని క్షమాపణ పరిమితులులేనట్లుగా, మనము ఇచ్చే క్షమాపణకు కూడా పరిమితులు ఉండకూడదు (లూకా 17:3-4).

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

నాకు వ్యతిరేకముగా పాపము చేసినవారిని ఎలా క్షమించగలను?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries