ప్రశ్న
నిబిరు అంటే ఏమిటి?
జవాబు
నిబిరు అనేది భూమికి దగ్గర భవిష్యత్తులో ఎప్పుడో ఢీకొంటుందని చెప్పబడుతున్న ఒక పెద్ద గ్రహ పరిమాణ వస్తువుకు ఇవ్వబడిన పేరు. ఈ సంఘటనను సాధారణంగా నిబిరు విలయం అని పిలుస్తారు. కొందరు నిబిరు అనే భావనను మాయన్ క్యాలెండర్ యొక్క డిసెంబర్ 21, 2012 "రీసెట్" తేదీతో ముడిపెడతారు. బైబిల్ "వర్మ్‌వుడ్" అని ప్రస్తావించినది నిబిరునే అని కొందరు నమ్ముతారు (ప్రకటన 8:10-11). నిబిరు విపత్తు / ప్రపంచ అంతం సిద్ధాంతంలో ఏమైనా నిజం ఉందా?
మొదట, నిబిరు విపత్తును నమ్మే కొందరు ఈ వాక్యాన్ని ఉటంకిస్తున్నందున, మనం ప్రకటన 8:10-11 ను చూద్దాం. అందులో ఇలా ఉంది, “మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటీవలె మండుచున్న గొప్ప నక్షత్రము ఆకాశమునుండి పడెను; అది నదులలో మూడవ భాగముమీదను, జలబుగ్గలమీదను పడెను. ఆ నక్షత్రమునకు వార్మ్‌వుడ్ అని పేరు. నీళ్లలో మూడవ భాగము చేదుగా మారెను; ఆ చేదు నీళ్లవలన అనేకులు చనిపోయిరి.” అనేక మంది బైబిల్ వ్యాఖ్యాతలు ఈ భాగం భూమిని ఢీకొట్టిన ఏదో ఒక గ్రహశకలము లేదా తోకచుక్క వంటి గ్రహాల మధ్య ఉన్న వస్తువును సూచిస్తుందని నమ్ముతారు. ఇది నిబిరు ఆలోచనను పోలి ఉన్నప్పటికీ, బైబిల్ వివరించే వస్తువు చాలా చిన్నది. ఒకవేళ గ్రహం పరిమాణంలో ఉన్న వస్తువు భూమిని ఢీకొంటే, అది నీటిని విషపూరితం చేయడం కంటే చాలా ఎక్కువ చేస్తుంది. అది బహుశా మొత్తం గ్రహాన్నే నాశనం చేస్తుంది. కాబట్టి, బైబిల్ "వర్మ్‌వుడ్" అని సూచించేది నిబిరుతో సమానం కాదు.
ప్రతిష్టాత్మక ఖగోళ శాస్త్రవేత్తలు మరియు గ్రహ శాస్త్రవేత్తలు సమీప భవిష్యత్తులో ఒక గ్రహం పరిమాణంలో ఉన్న వస్తువు భూమిని ఢీకొంటుందనే ఆలోచనను తిరస్కరిస్తున్నారు. ప్రాచీన బాబిలోనియన్ పురాణాలలో నిబిరు భావనతో కొన్ని సారూప్యతలు ఉన్నప్పటికీ, ఆధునిక నిబిరు సిద్ధాంతాన్ని 1990లలో జేటాస్ అని పిలువబడే గ్రహాంతరవాసులతో తాను సంప్రదించానని చెప్పిన ఒక మహిళ కనిపెట్టింది. అప్పటి నుండి ఆమె అనేకసార్లు నిబిరు రాకను అంచనా వేసింది. ఆమె యొక్క ప్రతి విపత్కరమైన అంచనా విఫలమైనప్పుడు, ఆమె కేవలం తేదీని సర్దుబాటు చేస్తుంది. నిబిరు సిద్ధాంతం యొక్క మూలం కూడా దానిని తిరస్కరించడానికి మరొక కారణం.
నిబిరు విపత్తు అనే ఆలోచనకు బైబిల్ లేదా శాస్త్రం మద్దతు ఇవ్వవు. మాయన్ భవిష్యవాణి మరియు ఇతర ప్రపంచ అంతం సిద్ధాంతాల వలె, నిబిరు ఆలోచన కూడా అహేతుకమైన భయం మరియు బైబిల్ పట్ల అజ్ఞానం యొక్క ఫలితం. అంత్య దినాలలో ఏమి జరుగుతుందో బైబిల్ చాలా సమాచారాన్ని ఇస్తుంది. భూమిని ఒక అంతరిక్ష వస్తువు ఢీకొంటుందనే ఆలోచనకు బైబిల్‌లో మద్దతు ఉన్నప్పటికీ, నిబిరు లేదా భూమిని ఢీకొనే మరే ఇతర విషయం వల్ల ప్రపంచం అంతం కాదని కూడా బైబిల్ స్పష్టం చేస్తుంది. దేవుడు సకలములను నూతనముగా చేసినప్పుడు లోకము అంతం అవుతుంది: "అప్పుడు నేను నూతనమైన ఆకాశమును నూతనమైన భూమిని చూసితిని; మొదటి ఆకాశమును మొదటి భూమిని అవి మాయమైపోయినవి…" (ప్రకటన 21:1).
English
నిబిరు అంటే ఏమిటి?