settings icon
share icon
ప్రశ్న

రెండవ మరణం అంటే ఏమిటి?

జవాబు


ప్రకటన గ్రంథంలో రెండవ మరణం అనేక సందర్భాలలో ప్రస్తావించబడింది మరియు అది అగ్ని సరస్సుతో సమానార్థకం. అది జీవదాతయైన దేవుని నుండి వియోగం కావడమే ఒక "మరణం". అది శారీరక మరణం తర్వాత సంభవించడం వల్ల దానిని "రెండవ" మరణం అని పిలుస్తారు.

ప్రకటన గ్రంథం 21:8 రెండవ మరణాన్ని అత్యంత వివరంగా వివరిస్తుంది: "పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము."

ప్రకటన గ్రంథంలో మరో మూడు ప్రదేశాలలో కూడా రెండవ మరణం ప్రస్తావించబడింది. వాటిలో మొదటిది ప్రకటన 2:11: "జయించువాడు రెండవ మరణమువలన ఏ హానియుచెందడు." ఈ వాక్యంలో, విశ్వాసులు అగ్ని సరస్సును అనుభవించరని యేసు వాగ్దానం చేస్తున్నారు (1 యోహాను 5:4తో పోల్చండి). రెండవ మరణము కేవలం క్రీస్తును తిరస్కరించిన వారి కోసమే. ఇది క్రీస్తులో విశ్వాసముంచిన వారు భయపడవలసిన ప్రదేశము కాదు.

ప్రకటన గ్రంథం 20:6, సహస్రాబ్ది అని పిలువబడే భవిష్యత్ కాలానికి సంబంధించి రెండవ మరణం గురించి చెబుతుంది: "ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు." ఈ వచనం మూడు ముఖ్యమైన వాస్తవాలను పేర్కొంటుంది. మొదటిది, శ్రమకాలంలో యేసుపై తమ విశ్వాసమునుబట్టి చనిపోయిన వారు సహస్రాబ్దిలో ప్రవేశించడానికి మరియు ఆయనతో నివసించడానికి తిరిగి లేపబడతారు. రెండవది, ఈ హెచ్చులపాటుకు గురైనవారు అగ్ని సరస్సు నుండి లేదా రెండవ మరణం నుండి తప్పించుకుంటారు. మూడవది, వారు క్రీస్తుతో ఏలుతారు.

రెండవ మరణం గురించి ప్రకటన గ్రంథం 20:14-15లో కూడా ప్రస్తావించబడింది: "మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను." కాలము ముగింపున, మరణము మరియు స్మశానము (హేడెస్) కూడా అగ్ని సరస్సులోకి విసిరివేయబడతాయి. అంతేకాకుండా, జీవగ్రంథములో చేర్చబడని ప్రతి వ్యక్తి అగ్ని సరస్సులోకి విసిరివేయబడతాడు. ఈ పరిస్థితి అంతిమమైనది; ఆ గమ్యస్థానం శాశ్వతమైనది.

సంగ్రహంగా చెప్పాలంటే, రెండవ మరణం అగ్ని సరస్సును సూచిస్తుంది, అక్కడ తమ పాపాల వలన దేవుని నుండి వేరు చేయబడిన వారు శాశ్వతంగా నివసిస్తారు. ఈ తీర్పు, యేసు క్రీస్తు అందించే రక్షణను కోరుకోవాలని అవిశ్వాసులకు హెచ్చరికగా లేఖనాలలో నమోదు చేయబడింది. రాబోయే ఈ తీర్పు, విశ్వాసులు తమ విశ్వాసాన్ని ఇతరులకు పంచడానికి కూడా ఒక సవాలుగా ఉండాలి. క్రీస్తును తెలిసిన వారి మరియు తెలియని వారి అంతిమ గమ్యస్థానాల మధ్య చాలా పెద్ద తేడా ఉంది.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

రెండవ మరణం అంటే ఏమిటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries