settings icon
share icon
ప్రశ్న

యేసు రాజ్యపు తాళాల కోసం సైతానుతో పోరాడాడా?

జవాబు


తాళాలు నియంత్రణకు ప్రతీక. తాళాలు ప్రజలను లోపల గానీ బయట గానీ ఉంచుతాయి. వారి వద్ద తాళం చెవి లేకపోతే, వారు లోపలికి వెళ్ళలేరు లేదా బయటకు రాలేరు. తాళాలు వాటిని కలిగి ఉన్నవారికి లోపలి ప్రదేశాలకు మరియు వాటిలోని వస్తువులకు ప్రవేశం కల్పిస్తాయి, మరియు ప్రాచీన కాలంలో పెద్ద తాళాలను ధరించడం సమాజంలో హోదాకు చిహ్నంగా ఉండేది. కొత్త నిబంధనలో, "హేదీస్" అనే పదం రెండు విధాలుగా వాడబడింది: కొన్ని సందర్భాలలో ఇది మరణించిన వారందరి ఆత్మలు ఉండే స్థలాన్ని సూచిస్తుంది (సమాధి - అపొస్తలుల కార్యములు 2:27,31); ఇతర సందర్భాలలో, ఇది మరణించిన దుర్మార్గుల ఆత్మలు ఉండే స్థలాన్ని సూచిస్తుంది (నరకం - లూకా 16:23; ప్రకటన 20:13-14). క్రీస్తు మాత్రమే మరణాన్ని జయించి, స్వయంగా సమాధి నుండి బయటకు వచ్చినందున, ఎవరు మరణంలోకి మరియు పాతాళంలోకి ప్రవేశిస్తారో, ఎవరు బయటకు వస్తారో ఆయన మాత్రమే నిర్ణయించగలరు. ఆయన వద్ద "తాళాలు" ఉన్నాయి. ఆయనకు మరణం మరియు మృతుల స్థలంపై అధికారం ఉంది.

సాతానుకు ఈ "తాళాలు" ఎప్పుడూ లేవు. ఎవరు స్వర్గం (దేవుని రాజ్యం)కు వెళ్తారు, ఎవరు నరకానికి వెళ్తారు అని నిర్ణయించే అధికారం సాతానుకు ఎప్పుడూ లేదు. ఆ తాళాలు ఎప్పుడూ సాతాను స్వాధీనంలో లేనందున, యేసు వాటి కోసం సాతానుతో పోరాడవలసిన అవసరం రాలేదు. మరణము మీదను పాతాళము మీదను అధికారము దేవునికే యున్నది (ప్రకటన గ్రంథము 1:18). యేసు ఏ విషయానికైనా సైతానుతో పోరాడవలసిన అవసరం లేదు, ఎందుకంటే సిలువ మీద యేసు మరణమే ఆయన అంతిమ విజయం. కొలొస్సయులు 2:15 మనకు ఇలా చెబుతుంది, "...మరియు శక్తులను అధికారములను నిస్సత్తువుగా చేసి, వాటిని సిలువ ద్వారా జయించి, బహిరంగముగా ప్రదర్శించెను."

క్రైస్తవునికి, మరణానికి మరియు నరకానికి భయపడాల్సిన అవసరం లేదు. క్రీస్తు ఇద్దరినీ నియంత్రిస్తాడు, మరియు క్రీస్తుపై విశ్వాసం ఉన్నవాడు ఎప్పటికీ నరకానికి వెళ్ళడు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, రాజ్యపు తాళాలు కేవలం క్రీస్తు వద్ద మాత్రమే ఉన్నాయి. అందుకే యేసు మనతో, "నేనే మార్గమును, సత్యమును, జీవమును; నేను ద్వారా తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు" అని చెప్పాడు (యోహాను 14:6).

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

యేసు రాజ్యపు తాళాల కోసం సైతానుతో పోరాడాడా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries