settings icon
share icon
ప్రశ్న

ప్రవచనమనే ఆత్మీయ వరము ఏమిటి?

జవాబు


1 కొరింథీయులు 12:10 మరియు రోమీయులు 12:6 వచనాలలో ఆత్మ వరములలో ప్రవచనం అనే ఆత్మీయ వరము పేర్కొనబడింది. ఈ రెండు భాగాలలో "ప్రవచించడం" లేదా "ప్రవచనం" అని అనువదించబడిన గ్రీకు పదం యొక్క సరైన అర్థం, దైవిక చిత్తాన్ని "పేర్కొనడం" లేదా ప్రకటించడం, దేవుని ఉద్దేశాలను వివరించడం, లేదా ప్రజలను ప్రభావితం చేయడానికి ఉద్దేశించిన దేవుని సత్యాన్ని ఏ విధంగానైనా తెలియజేయడం. భవిష్యత్తును ఊహించే సామర్థ్యమే ప్రవచన వరమని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. భవిష్యత్తు గురించి ఏదైనా తెలుసుకోవడం కొన్నిసార్లు ప్రవచన వరంలో ఒక అంశంగా ఉన్నప్పటికీ, అది ప్రధానంగా ప్రకటన వరమే ("ముందు చెప్పడం"), ఊహించడం కాదు ("ముందుగా చెప్పడం").

బైబిలును ప్రకటించే ఒక పాస్టర్/ప్రబోధకుడు, అతడు దేవుని సలహాను ప్రకటిస్తున్నందున అతనిని ఒక "ప్రవక్త"గా పరిగణించవచ్చు. కొత్త నిబంధన కానన్ పూర్తవడంతో, ప్రవచనం కొత్త ప్రత్యక్షతను ప్రకటించడం నుండి, దేవుడు ఇప్పటికే ఇచ్చిన పూర్తి ప్రత్యక్షతను ప్రకటించడానికి మారింది. యూదా 3లో "పవిత్రులకు ఒకప్పుడు అప్పగింపబడిన విశ్వాసం" గురించి చెప్పబడింది (నొక్కి చెప్పబడింది). మరో మాటలో చెప్పాలంటే, మనము పట్టుకున్న విశ్వాసం శాశ్వతంగా స్థిరపరచబడింది, మరియు దానికి బైబిలుకు అతీతమైన ప్రత్యక్షతల నుండి వచ్చే జోడింపు లేదా పరిష్కరణ అవసరం లేదు.

అలాగే, 2 పేతురు 2:1లో ప్రవక్త నుండి బోధకుడికి జరిగిన మార్పును గమనించండి: "ప్రజలలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అలాగే మీలో అబద్ధ బోధకులు ఉంటారు" (నొక్కి చెప్పబడింది). పేతురు సూచిస్తున్నదేమిటంటే, పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ఉండేవారు, అయితే సంఘంలో బోధకులు ఉంటారు. ఇతరులకు ప్రకటించడానికి దేవుని నుండి కొత్త ప్రత్యక్షతలను పొందే అర్థంలో, ప్రవచనము అనే ఆత్మీయ వరము బైబిల్ పూర్తయిన తర్వాత నిలిచిపోయింది. ప్రవచనము ఒక ప్రత్యక్షత వరముగా ఉన్న సమయంలో, అది మనుష్యుల ఉపగ్రహణమునకు, ఉత్సాహపరచుటకు, ఓదార్చుటకు ఉపయోగించబడవలసియుండెను (1 కొరింథీయులు 14:3). బోధనకు ఎక్కువగా దగ్గరగా ఉండే ఆధునిక ప్రవచన వరము, ఇప్పటికీ దేవుని సత్యమును ప్రకటిస్తుంది. మారిన విషయం ఏమిటంటే, ఈ రోజు దేవుని సత్యం ఆయన వాక్యంలో పూర్తిగా వెల్లడించబడింది, అయితే ప్రారంభ సంఘంలో అది ఇంకా పూర్తిగా వెల్లడించబడలేదు.

దేవుని నుండి "కొత్త" సందేశం కలిగి ఉన్నామని చెప్పుకునే వారి పట్ల క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాలి. "నేను నిన్న రాత్రి ఒక ఆసక్తికరమైన కల కన్నాను" అని చెప్పడం ఒక విషయం. అయితే, "దేవుడు నాకు నిన్న రాత్రి ఒక కల ఇచ్చాడు, మరియు మీరు దానికి విధేయత చూపాలి" అని చెప్పడం పూర్తిగా భిన్నమైన విషయం. మానవుని వాక్కును వ్రాయబడిన వాక్యానికి సమానంగా గానీ లేదా దానికంటే ఉన్నతంగా గానీ పరిగణించకూడదు. దేవుడు ఇప్పటికే ఇచ్చిన వాక్యానికే మనం కట్టుబడి ఉండాలి మరియు సోలా స్క్రిప్టురా—కేవలం లేఖనమే అని మనల్ని మనం అంకితం చేసుకోవాలి.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

ప్రవచనమనే ఆత్మీయ వరము ఏమిటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries