ప్రశ్న
అంత్యకాలంలో యెరూషలేములో మళ్లీ ఆలయం నిర్మించబడుతుందా?
జవాబు
యెరూషలేములోని ఒక ఆలయంలో కొన్ని అంత్యకాల సంఘటనలు జరుగుతాయని బైబిల్ ప్రస్తావిస్తుంది (దానియేలు 9:27; మత్తయి 24:15). రెండవ థెస్సలొనీకయులకు 2:4, అంతిక్రీస్తు గురించి మాట్లాడుతూ, మనకు ఇలా చెబుతుంది, "ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును." అంత్యకాలం సంభవించడానికి ముందు, ఈ సంఘటనలు జరగడానికి ఒక ఆలయం ఉండాలి.
యూదుల ఆలయం నిర్మించాల్సిన ప్రదేశంలో ఇస్లామిక్ డోమ్ ఆఫ్ ది రాక్ ఉండటం అనే "చిన్న" సమస్య ఇంకా ఉంది. ముహమ్మద్ స్వర్గానికి ఎక్కిన ప్రదేశం ఇదేనని ముస్లింలు నమ్ముతారు, దీనితో ఇది ముస్లింల పుణ్యక్షేత్రాలలో మూడవ అత్యంత పవిత్రమైనదిగా మారింది. నేటి రాజకీయ వాతావరణంలో, యూదులు ఈ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకుని, దానిపై ఆలయం నిర్మించడం అనేది ఊహించలేనిది. కానీ శ్రమకాలంలో, అంతిక్రీస్తు రక్షణతో ఆలయ నిర్మాణం జరుగుతుంది (దానియేలు 9:24-27).
ఆలయం నిర్మించబడుతున్నప్పుడు, మనం చివరి కాలం నిజంగా సమీపించిందని నిర్ధారించుకోవచ్చు. అప్పటికి అంతిక్రీస్తుపాలనలో ఉంటాడు, సంఘం అప్పటికే పరలోకమునకు తీసుకుపోబడి ఉంటుంది, మరియు శ్రమకాలపు మొదటి సగభాగం గడిచిపోయి ఉంటుంది. అయినప్పటికీ, ప్రజలు రక్షణ కొరకు క్రీస్తు వద్దకు రావడానికి ఇంకా సమయం ఉంటుంది.
English
అంత్యకాలంలో యెరూషలేములో మళ్లీ ఆలయం నిర్మించబడుతుందా?