settings icon
share icon
ప్రశ్న

దేవదూతలకు రెక్కలు ఉంటాయా?

జవాబు


దేవదూత యొక్క అత్యంత సాధారణ చిత్రం అంటే రెక్కలు గల ఒక మానవుడు. ఇది బైబిలులో చెప్పబడిన చిత్రం కాదు. బైబిలులో దేవదూతలు తరచుగా మానవులుగా కనిపిస్తారని ప్రస్తావించబడింది. కానీ ఇది, దేవదూతలు తమ సహజ స్వరూపంలో మనలాగా కనిపిస్తారని సూచించదు. బైబిల్ రెండు రకాల దేవదూతలకు రెక్కలు ఉన్నట్లు వర్ణిస్తుంది: నాలుగు రెక్కలు గల కెరూబులు (నిర్గమకాండము 25:20; యెహెజ్కేలు 10) మరియు ఆరు రెక్కలు గల సెరాఫీములు (యెషయా 6). కెరూబులుమరియు సెరాఫీములు బహుశా దేవదూతలలో రెండు అత్యున్నత శ్రేణులు కావచ్చు.

దేవదూతలు ఆత్మ జీవులు (హెబ్రీయులు 1:14). యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయంలో కెరూబుల వివరణలు మరియు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సెరాఫీముల వివరణలు అలౌకికమైనవి. ప్రత్యేకించి యెహెజ్కేలు తాను చూసిన దర్శనాన్ని కచ్చితంగా వర్ణించడానికి చాలా ఇబ్బంది పడినట్లు కనిపిస్తుంది. అతను వ్రాసిన "జీవులకు" రెక్కలు ఉన్నాయి, అయితే, ఆత్మ జీవులుగా వారికి అవి ఎందుకు అవసరమో అస్పష్టంగా ఉంది. భౌతిక విశ్వానికి సంబంధించిన నియమాలకు ఆత్మ జీవులు కట్టుబడి ఉండవు కాబట్టి, వారికి ఎగరడానికి ఖచ్చితంగా రెక్కలు అవసరం లేదు.

అయితే, దేవదూతలకు రెక్కలు ఉంటాయా? అవును, కొంతమంది దేవదూతలకు రెక్కలు ఉన్నాయి. అయితే, బైబిల్‌లో వర్ణించబడినట్లుగా కొంతమంది దేవదూతలు కలిగి ఉన్న రెక్కల ఆధారంగా, దేవదూతలు ఏమి చేయగలరో లేదా చేయలేరో అని మనం పరిమితం చేయకూడదు.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

దేవదూతలకు రెక్కలు ఉంటాయా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries