ప్రశ్న
పడిపోయిన దేవదూతలకు పశ్చాత్తాపపడటానికి దేవుడు ఎందుకు అవకాశం ఇవ్వడు?
జవాబు
పడిపోయిన దేవదూతలకు పశ్చాత్తాపపడే అవకాశం ఉందనే విషయాన్ని బైబిల్ ప్రత్యేకంగా ప్రస్తావించదు, కానీ బైబిల్ చెప్పే విషయాల నుండి మనం కొంత అవగాహన పొందవచ్చు. మొదటగా, సైతాను (లూసిఫర్) అత్యున్నత దేవదూతలలో ఒకడు, బహుశా అత్యున్నతమైనవాడు (యెహెజ్కేలు 28:14). లూసిఫర్—మరియు దేవదూతలందరూ—నిరంతరం దేవుని సన్నిధిలో ఉండేవారు మరియు దేవుని మహిమను గూర్చిన జ్ఞానం కలిగి ఉన్నారు. అందువల్ల, దేవునికి విరోధంగా తిరగడానికి మరియు ఆయన నుండి దూరం కావడానికి వారికి ఎటువంటి సాకు లేదు. వారు శోధింపబడలేదు. వారు ఎరిగినప్పటికీ దేవునికి విరోధంగా తిరుగుట లూసిఫర్ మరియు ఇతర దేవదూతల అత్యంత దుష్టత్వం.
రెండవదిగా, దేవుడు మానవాళికి చేసినట్లుగా దేవదూతల కోసం విమోచన ప్రణాళికను అందించలేదు. మానవ జాతి పతనం పాపమునకు ప్రాయశ్చిత్త బలిని అవసరం చేసింది, మరియు దేవుడు ఆ బలిని యేసు క్రీస్తులో అందించాడు. తన కృపలో, దేవుడు మానవ జాతిని విమోచించి, తనకు తానే మహిమను తెచ్చుకున్నాడు.
దేవదూతల కోసం అటువంటి బలి ఏదీ ప్రణాళిక చేయబడలేదు. అంతేకాకుండా, దేవుడు తనయందు విశ్వాసముగానుండు ఆ దూతలను తన "ఎన్నుకొనబడిన దూతలు" అని ప్రస్తావించాడు (1 తిమోతి 5:21). దేవుడు రక్షణ కొరకు ఎన్నుకొన్న వారు రక్షించబడతారని, మరియు ఏదీ వారిని దేవుని ప్రేమ నుండి వేరు చేయలేదని బైబిల్ యొక్క ఎంపిక సిద్ధాంతం నుండి మనకు తెలుసు (రోమీయులకు 8:38-39). స్పష్టంగా, తిరుగుబాటు చేసిన ఆ దేవదూతలు దేవుని యొక్క "ఎన్నుకొనబడిన దేవదూతలు" కారు.
చివరగా, దేవుడు అవకాశం ఇచ్చినా కూడా దేవదూతలు పశ్చాత్తాపపడతారని నమ్మడానికి బైబిల్ మనకు ఎటువంటి కారణం ఇవ్వదు (1 పేతురు 5:8). పడిపోయిన దేవదూతలు దేవుని వ్యతిరేకించడానికి మరియు దేవుని ప్రజలను దాడులు చేయడానికి పూర్తిగా అంకితమైనవారిగా కనిపిస్తారు. ఒక వ్యక్తికి ఎంత ఎక్కువ జ్ఞానం ఉంటే, దేవుని తీర్పు యొక్క తీవ్రత అంత ఎక్కువగా ఉంటుందని బైబిల్ చెబుతోంది (లూకా 12:48). అప్పుడు, తమకున్న గొప్ప జ్ఞానంతో, పతనమైన దూతలు దేవుని కోపానికి బాగా అర్హులు.
English
పడిపోయిన దేవదూతలకు పశ్చాత్తాపపడటానికి దేవుడు ఎందుకు అవకాశం ఇవ్వడు?