settings icon
share icon
ప్రశ్న

దేవదూతలు మరియు దుష్టశక్తులు చనిపోలేకపోతే, వారు యుద్ధం చేయడంలో అర్థం ఏమిటి?

జవాబు


ఫ్రాంక్ పెరెట్టి రాసిన 'దిస్ ప్రెసెంట్ డార్క్‌నెస్' నవల వంటి ప్రసిద్ధ కల్పిత కథలు, ఆత్మీయ యుద్ధాల గురించి ఉత్కంఠభరితమైన వర్ణనలను తరచుగా అందిస్తాయి, వాటిలో దుష్టశక్తులు కత్తి పట్టుకున్న దేవదూతలచే ఒక కోత, ఒక మెరుపు, మరియు పొగ కణాలతో పారేయబడతాయి. దేవదూతల కత్తులతో రెండుగా చీలినప్పుడు దుష్టశక్తులు ఏదో విధంగా "చనిపోతారని" దీని అర్థం. మన వేదాంతశాస్త్రం బైబిల్ చెప్పే వాటిపై ఆధారపడాలి కానీ సమకాలీన నవలలపై కాదని చెప్పనవసరం లేదు. బైబిల్ ఆత్మీయ యుద్ధం యొక్క వాస్తవికతను బోధిస్తుంది (యూదా 1:9). కానీ అంత్య న్యాయానికి తర్వాత, దుష్టాత్మలు నిత్యత్వముగా అగ్ని సరస్సులోకి పంపబడతారని కూడా బైబిల్ చెబుతుంది (మత్తయి 25:41). దుష్టాత్మలు (మరియు దేవదూతలు) "చనిపోరు" లేదా శారీరక గాయాలను భరించరు కాబట్టి, ఆత్మీయ పోరాటం చేయడంలో ఉద్దేశ్యం ఏమిటి?

మొదటగా, అన్ని యుద్ధాలు "చావు వరకు" జరగవని మనం గుర్తుంచుకోవాలి. దెయ్యాలతో పోరాడటంలో దేవదూతల లక్ష్యం వాటిని చంపడం కాదు, వాటి ప్రణాళికలను అడ్డుకుని, దేవుని ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడం. బైబిల్‌లో, దేవదూతలు ప్రజలకు దైవిక సందేశాలను అందించడానికి (దానియేలు 10:12-14) మరియు పరలోక స్థలాల నుండి సైతాను సైన్యాన్ని తొలగించడానికి (ప్రకటన 12:7–8) దుష్టశక్తులతో పోరాడటం మనం చూస్తాము. దెయ్యాలను ఎదిరించవచ్చు (యాకోబు 4:7), దేవునిచే హింసించబడవచ్చు (లూకా 8:28), వారు కలిగి ఉన్నవాటిని కోల్పోవచ్చు (మార్కు 9:25–26), వేరొక ప్రదేశానికి పంపబడవచ్చు (మత్తయి 8:32), మరియు అగాధంలోకి త్రోయబడతాయి (లూకా 8:31).

రెండవదిగా, సైతాను మరియు అతని దుష్టాత్మలు బైబిల్ "రెండవ మరణం" అని పిలిచే అగ్ని సరస్సును అనుభవించే సమయం వస్తుంది (ప్రకటన 21:8). మనం ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాము, ఎందుకంటే యుద్ధంలో దుష్టాత్మల ప్రధాన లక్ష్యం ప్రజల జీవితాలలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేయడమే—విశ్వాసులు మరియు అవిశ్వాసులు అందరిలోనూ (1 పేతురు 5:8). దేవుడు తన పిల్లలను హెచ్చరించడానికి, నడిపించడానికి మరియు రక్షించడానికి తన దేవదూతలను పంపిన ఉదాహరణలు బైబిల్‌లో మనకు చాలా ఉన్నాయి. కొన్ని గొప్ప ఉదాహరణలు క్రిస్మస్ కథలో ఉన్నాయి. జెకర్యాకు తనకు యోహాను అనే కుమారుడు పుట్టబోతున్నాడని తెలియజేయడానికి (లూకా 1:8–20), మరియకు ఆమె మెస్సయ్యకు జన్మనిస్తుందని చెప్పడానికి (లూకా 1:26–38), గొర్రెల కాపరులకు క్రీస్తు జన్మం గురించి ప్రకటించడానికి (లూకా 2:8–12), దేవుడు దేవదూతలను ఉపయోగించాడు, మరియు తన కుటుంబాన్ని హేరోదు రాజు యొక్క కోపం నుండి కాపాడుకోవాలని యోసేపుకు హెచ్చరించడానికి (మత్తయి 2:13).

దేవుడు ఇంకా అన్ని దుష్టశక్తులను బంధించడానికి సమయం రాలేదని భావించాడు, కానీ చివరిలో వారు, సాతానుతో పాటు, అగ్ని సరస్సులోకి విసిరివేయబడతారని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈ గతి నుండి తప్పించుకోవడానికి మార్గం లేదు, మరియు అన్ని దుష్ట ఆత్మలు దేవుని నుండి శాశ్వతంగా ఏకాంత నిర్బంధంలో బాధించబడతాయి (ప్రకటన 20:10).ఆత్మీయ యుద్ధం అనే వాస్తవికత ప్రతి విశ్వాసిని ప్రభావితం చేస్తుంది. ఈ ఆత్మీయ యుద్ధం జరుగుతోందని గుర్తించడం మరియు దానికి సిద్ధంగా ఉండటం ముఖ్యం. సైతాను యొక్క ఉపాయములకు వ్యతిరేకముగా నిలబడటానికి కావలసినవన్నీ దేవుడు మనకు ఇచ్చారు మరియు పూర్తి ఆత్మీయ ఆయుధములను ధరించమని మనకు ఆజ్ఞాపించారు (ఎఫెసయులు 6:10–18).

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

దేవదూతలు మరియు దుష్టశక్తులు చనిపోలేకపోతే, వారు యుద్ధం చేయడంలో అర్థం ఏమిటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries