settings icon
share icon
ప్రశ్న

బైబిల్‌లో మరణ దేవదూత ఉన్నాడా?

జవాబు


"మృత్యు దేవదూత" అనే భావన అనేక మతాలలో ఉంది. యూదు మతంలో "మృత్యు దేవదూత"ను సామాయెల్, సారియెల్, లేదా అజ్రాయెల్ అని; ఇస్లాంలో మలక్ అల్ మౌత్ అని; హిందూ మతంలో యముడు లేదా యమరాజు అని; మరియు ప్రసిద్ధ కల్పనలలో గ్రిమ్ రీపర్ అని పిలుస్తారు. వివిధ పురాణాలలో, మృత్యు దేవదూతను గొర్రెకత్తి పట్టుకున్న పైవస్త్రం ధరించిన అస్థిపంజరం నుండి, ఒక అందమైన స్త్రీ వరకు, ఒక చిన్న బిడ్డ వరకు ఏ రూపంలోనైనా ఊహించుకుంటారు. వివరాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, మరణ క్షణంలో ఒక జీవి వ్యక్తి వద్దకు వస్తుందని, అది మరణాన్ని కలిగిస్తుందో లేదా కేవలం దానిని గమనిస్తుందో అనేది ప్రాథమిక నమ్మకం—ఆ తర్వాత ఆ వ్యక్తి ఆత్మను మృతుల నివాసానికి తీసుకువెళ్ళడమే దాని ఉద్దేశ్యం.

ఈ "మృత్యు దేవదూత" భావన బైబిల్‌లో బోధించబడలేదు. మృత్యుకు బాధ్యత వహించే లేదా ఒక వ్యక్తి చనిపోయినప్పుడల్లా ఉనికిలో ఉండే ప్రత్యేకమైన దేవదూత ఒకరు ఉన్నారని బైబిల్ ఎక్కడా బోధించదు. 2 రాజులు 19:35లో, ఇశ్రాయేలుపై దాడి చేసిన 1,85,000 అస్సిరియన్లను ఒక దేవదూత చంపినట్లు వర్ణించబడింది. మరికొందరు నిర్గమకాండము 12వ అధ్యాయంలో, ఐగుప్తులో ప్రథమజన్మకుల మరణమును ఒక దేవదూత యొక్క పనిగా చూస్తారు. ఇది సాధ్యమే అయినప్పటికీ, బైబిలు ఎక్కడా ప్రథమజన్మకుల మరణానికి ఒక దేవదూత కారణమని చెప్పదు. ఏది ఏమైనప్పటికీ, బైబిలు ప్రభువు ఆజ్ఞానుసారంగా దేవదూతలు మరణాన్ని కలిగిస్తున్నట్లు వివరించినప్పటికీ, లేఖనములో మరణానికి ఒక ప్రత్యేక దేవదూత ఉన్నాడని ఎక్కడా బోధించదు.

మన మరణాల సమయం విషయంలో దేవుడే, కేవలం దేవుడే, సర్వోన్నతుడు. దేవుడు నిర్ణయించిన సమయం రాకముందు ఏ దేవదూత గానీ లేదా దుష్టశక్తి గానీ మన మరణానికి కారణం కాలేవు. రోమీయులు 6:23 మరియు ప్రకటన గ్రంథము 20:11-15ప్రకారం, మరణము అనగా వియోగము, అనగా మన ఆత్మ-ఆత్మము శరీరము నుండి విడిపోవడము (శారీరక మరణము) మరియు అవిశ్వాసుల విషయములో దేవుని నుండి నిత్యమైన వియోగము (నిత్య మరణము). మరణం అనేది జరిగే ఒక విషయం. మరణం ఒక దేవదూత, ఒక దెయ్యం, ఒక వ్యక్తి లేదా మరే ఇతర జీవి కాదు. దేవదూతలు మరణానికి కారణం కావచ్చు మరియు మరణం తర్వాత మనకు జరిగే విషయాలలో పాలుపంచుకోవచ్చు—కానీ "మృత్యు దేవదూత" అనేది అసలు లేదు.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

బైబిల్‌లో మరణ దేవదూత ఉన్నాడా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries