ప్రశ్న
అమెనాడియల్ అనే దేవదూత ఉన్నాడా?
జవాబు
అమెనాడియల్ అనే దేవదూత (లేదా రాక్షసుడు) ఉండవచ్చు, కానీ, ఒకవేళ అలా ఒకరు ఉంటే, బైబిల్ ఎక్కడా అతని గురించి ప్రస్తావించలేదు. అమెనాడియల్ అనే దేవదూత అనే ఆలోచన, సొలొమోను యొక్క లెసర్ కీలో భాగమైన, ఆర్స్ థియోర్జియా గోటియా అనే గ్రంథం నుండి వచ్చింది. అందువల్ల అమెనాడియెల్ ఒక పురాణ పాత్ర.
అయితే, అమెనాడియెల్ యొక్క పురాణ హోదా కొంతమంది అతన్ని తీవ్రంగా పరిగణించకుండా నిరోధించదు. మంత్రవిద్య మరియు నల్లమంత్రాలకు సంబంధించిన వివిధ పుస్తకాలు అమెనాడియెల్ గురించి వివరాలు ఇస్తాయి: అతను సృష్టించబడిన మొదటి దేవదూత మరియు లూసిఫర్ సోదరుడు. అతను పాపం చేసి స్వర్గం నుండి బహిష్కరించబడ్డాడు. ఈ రోజు, అతను పశ్చిమ సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్న ఒక ఉన్నత స్థాయి రాక్షసుడు, అతని వద్ద అసంఖ్యాకమైన చిన్న రాక్షసులు ఉంటారు. ది థియూర్జియాలో అమెనాడియెల్‌ను ఆవాహన చేసే పద్ధతులు, అలాగే మాయ చేసే విద్యలు, మంత్రాలు, ఆచారాలు మరియు ఇతర అతీంద్రియ జ్ఞానం ఉన్నాయి.
అమెనాడియెల్ అనే పేరు ప్రముఖ సంస్కృతిలో కూడా కనిపిస్తుంది. DC/వర్టిగో కామిక్ పుస్తక శ్రేణి అయిన 'లూసిఫర్'లో, అమెనాడియల్ లూసిఫర్‌తో పోరాడే ఒక మంచి దేవదూత. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'లూసిఫర్'లో కూడా అమెనాడియల్ ఒక ప్రధాన పాత్రగా కనిపిస్తాడు. కామిక్ పుస్తక శ్రేణిలో లాగే, అమెనాడియల్ మంచి పక్షంలో ఉంటాడు, అయినప్పటికీ కొన్నిసార్లు ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి లూసిఫర్‌తో చేతులు కలిపుతాడు.
కీ ఆఫ్ సొలొమోన్‌లో ప్రయోజనకరమైనది ఏదీ లేదు, మరియు అందులో వివరించిన దెయ్యాల శాస్త్రం మరియు అతీంద్రియ పద్ధతులను క్రీస్తు అనుచరులందరూ నివారించాలి.
మనకు మార్గదర్శకంగా లేఖనములు ఉన్నాయి, మరియు బైబిల్ పవిత్రమైన లేదా దుష్టమైన దేవదూతల గురించి మనకు ఎక్కువ సమాచారాన్ని ఇవ్వదు. మనం దుష్టశక్తుల గురించి మరింత తెలుసుకోవలసిన అవసరం ఉంటే, బైబిల్ మనకు చెప్పేది. ఆత్మ జీవులు మరియు వాటి అధికార క్రమం గురించిన సంక్లిష్టమైన పురాణ కథలు, చివరికి, దుష్టశక్తులచే ప్రభావితమైన మానవ ఊహాజనితాల కంటే మరేమీ కావు. మనం దుష్టశక్తులను ఎదిరించడానికి, "తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి," "దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి" మరియు "అపవాది తంత్రములను ఎదిరించుటకు" అనే దేవుని ఆజ్ఞను పాటించడానికి దుష్టశక్తుల పేర్లు తెలుసుకోవలసిన అవసరం లేదు. (ఎఫెసీయులకు 6:10–11).
English
అమెనాడియల్ అనే దేవదూత ఉన్నాడా?