settings icon
share icon
ప్రశ్న

మెటాట్రాన్ అంటే ఎవరు లేదా ఏమిటి?

జవాబు


మెటాట్రాన్ అనేది కొన్ని యూదుల రచనలలో ప్రస్తావించబడిన ఒక పురాణ దేవదూత. ఒక పురాణ కథనం ప్రకారం, మెటాట్రాన్ అనేక బాధ్యతలతో ఒక ఉన్నత స్థాయి దేవదూతగా దేవునిచే సృష్టించబడ్డాడు. రెండవ పురాణ కథనం ప్రకారం, మెటాట్రాన్ వాస్తవానికి ఎనోకు అనే మనిషి, అతను కొన్నిసార్లు స్వర్గానికి వెళ్లి, చివరికి ఒక శక్తివంతమైన దేవదూతగా మార్చబడ్డాడు.

పురాణ కథనం ప్రకారం, మెటాట్రాన్ దేవుని ముఖాన్ని చూడటానికి అనుమతించబడిన దేవదూతల యొక్క ఒక ఎంపిక చేసిన సమూహంలో ఒక భాగం. ఈ గౌరవం సెరాఫీములు వంటి చాలా దేవదూతలకు లభించదు (యెషయా 6:2). మెటాట్రాన్‌ను కొన్నిసార్లు "ముఖాధిపతి" అని కూడా పిలుస్తారు.

మెటాట్రాన్‌కు అపారమైన శక్తి మరియు జ్ఞానం ఉన్నట్లుగా చిత్రీకరించబడింది. పురాణాల ప్రకారం, మహిమ, జ్ఞానం మరియు బలంలో మెటాట్రాన్ దేవుని తర్వాత రెండవ స్థానంలో ఉంటాడు. మిగతా దేవదూతలందరూ అతనికి విధేయత చూపాలి. అతని స్వర్గీయ పనులలో దేవుని లేఖకుడిగా పనిచేయడం మరియు ఇశ్రాయేలు జాతికి వాదిగా లేదా స్వర్గీయ పూజారిగా ఉండటం ఉన్నాయి. ఒక పురాణ కథ ప్రకారం, ఇశ్రాయేలును అరణ్యమార్గంలో నడిపించిన దేవదూత మెటాట్రాన్.

మెటాట్రాన్ పేరు బైబిల్‌లో ఎక్కడా ప్రస్తావించబడలేదని చెప్పడం ముఖ్యం. అతను బాబిలోనియన్ తల్ముద్‌లో మూడుసార్లు, మధ్యయుగాల నుండి కొన్ని రహస్య గ్రంథాలలో మరియు కొన్ని అతీంద్రియ పుస్తకాలలో ప్రస్తావించబడ్డాడు.మెటాట్రాన్ ఉనికిలో ఉందని నమ్మడానికి ఎటువంటి కారణం లేదు. వాస్తవానికి, మెటాట్రాన్‌కు సంబంధించిన కొన్ని పురాణగాథలు ఖచ్చితంగా బైబిల్ బోధనలకు విరుద్ధమైనవి. "దేవునికి, మనుష్యులకు మధ్య మధ్యవర్తి యెడనైనవాడు" ఉన్నాడు, మరియు అతడు ఒక దేవదూత కాదు. ఆ మధ్యవర్తి "మనుష్యుడైన క్రీస్తు యేసు" (1 తిమోతి 2:5).

అటువంటి పురాణ కథలు, అవాస్తవ గాథలు ప్రయోజనకరమైనవి కావని బైబిల్ చెబుతోంది. "దేవుని లేని కల్పనలతోను, ముసలి స్త్రీల కట్టుకథలతోను సంబంధము పెట్టుకొనక, దైవభక్తికి నీవు అభ్యాసము చేయుము" (1 తిమోతి 4:7; కొలొస్సయులు 2:18-19 కూడా చూడండి).

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

మెటాట్రాన్ అంటే ఎవరు లేదా ఏమిటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries