ప్రశ్న
యేసు క్రీస్తు ఎందుకు ప్రత్యేకమైనవాడు?
జవాబు
1. యేసు క్రీస్తు దేవుని ఏకైక కుమారుడుగా ప్రత్యేకమైనవాడు (కీర్తనలు 2:7, 11–12; యోహాను 1:14; 3:16; లూకా 1:35). యేసు దేవునితో సమానమైన దైవిక స్వభావాన్ని పంచుకుంటాడు కాబట్టి, అతను దేవుని యొక్క "ఒక్కడే అయిన" కుమారుడు.
2. యేసు క్రీస్తు నిత్యమైనవాడు కావడంలో ప్రత్యేకమైనవాడు. ఆయన ఆది నుండి ఉన్నాడు, వర్తమానంలో ఉన్నాడు, మరియు భవిష్యత్తులో నిత్యత్వమంతా ఉంటాడు (యోహాను 1:1–3, 14; యోహాను 8:58).
3. యేసు క్రీస్తు పాపరహితుడు కావడంలో ప్రత్యేకమైనవాడు. ఆయన ఎన్నడూ పాపం చేయలేదు మరియు పూర్తిగా మనిషి అయినప్పటికీ, ఆయనకు పాప స్వభావం లేదు. ఆయన దేవుని పరిశుద్ధుడు (అపొస్తలుల కార్యములు 3:14; యోహాను 6:69; 1 పేతురు 2:22; 1 యోహాను 3:5).
4. యేసు క్రీస్తు ప్రత్యేకమైన వారు, ఎందుకంటే మన పాపాలను మోసిన ఏకైక వ్యక్తి ఆయనే. మన పాపాలను మోసే వ్యక్తిగా, ఆయన మనకు క్షమాపణను, రక్షణను మరియు దేవునితో సరైన సంబంధాన్ని అనుగ్రహిస్తారు. మన పాపాన్ని తొలగించడానికి మరెవరూ శక్తిలేనివారు (యెషయా 53; మత్తయి 1:21; యోహాను 1:29; 1 పేతురు 2:24; 1 కొరింథీయులు 15:1–3).
5. యేసు క్రీస్తు ప్రత్యేకమైన వారు, ఎందుకంటే తండ్రియొద్దకు వెళ్ళడానికి ఆయన మాత్రమే ఏకైక మార్గము (యోహాను 14:6; అపొస్తలుల కార్యములు 4:12; 1 తిమోతి 2:5). రక్షణకు మరే ఇతర మార్గము లేదు. ఆయన మాత్రమే నీతిమంతుడు, మరియు ఆయన మన పాపము కొరకు తన పరిపూర్ణమైన నీతిని మార్చుకున్నారు (2 కొరింథీయులకు 5:21).
6. యేసు క్రీస్తు ప్రత్యేకమైనవాడు, ఎందుకంటే తన సొంత మరణంపై ఆయనకు మాత్రమే అధికారం ఉంది మరియు తన జీవితాన్ని తిరిగి పొందే శక్తి ఆయనకు ఉంది (యోహాను 2:19; 10:17–18). గమనిక: ఆయన పునరుత్థానం ఒక "ఆత్మీయ" పునరుత్థానం కాదు, శారీరకమైనది (లూకా 24:39). మళ్ళీ ఎప్పటికీ చనిపోకుండా మృతులలో నుండి ఆయన పునరుత్థానం, ఆయనను దేవుని ప్రత్యేక కుమారునిగా వేరు చేసింది (రోమీయులు 1:4).
7. యేసు క్రీస్తు ప్రత్యేకమైనవాడు, ఆయన తండ్రికి సమానుడిగా ఆరాధనను ఒక్కడే స్వీకరించాడు అనే వాస్తవం ద్వారా ఇది స్పష్టమవుతుంది (యోహాను 20:28–29; ఫిలిప్పీయులు 2:6). నిజానికి, కుమారుడు తండ్రి గౌరవించబడినట్లుగా గౌరవించబడాలని దేవుడైన తండ్రి పేర్కొన్నాడు (యోహాను 5:23). లేఖనములో ఉన్న ఇతరులందరూ, అవి యేసు శిష్యులైనా లేదా దేవదూతలైనా, ఆ ఆరాధనను సరిగ్గా తిరస్కరించారు (అపొస్తలుల కార్యములు 10:25–26; 14:14–15; మత్తయి 4:10; ప్రకటన 19:10; 22:9).
8. యేసు క్రీస్తు ప్రత్యేకమైన వారు, ఎందుకంటే ఆయనకు నచ్చిన వారికి జీవం ఇచ్చే శక్తి ఆయనకు ఉంది (యోహాను 5:21).
9. తండ్రియే తీర్పు తీయుటకు సమస్తము ఆయనకు అప్పగించినందున (యోహాను 5:22) యేసు క్రీస్తు ప్రత్యేకుడు. ఈ లోకములో పరిపూర్ణముగా జీవించినందున, లోకమును తీర్పు తీయుటకు అర్హత ఉన్న ఏకైక వ్యక్తి ఆయనే.
10. యేసు క్రీస్తు ప్రత్యేకమైనవాడు, ఎందుకంటే ఆయన తండ్రితో కలిసి సృష్టిలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారు. క్రీస్తు చేతితోనే సమస్తములు కలిపి ఉంచబడ్డాయి (యోహాను 1:1–3; ఎఫెసయులు 3:9; హెబ్రీయులు 1:8–10; కొలొస్సయులు 1:17).
11. ఈ ప్రస్తుత యుగం చివరిలో ఆయన లోకమును పరిపాలించును గనుక యేసు క్రీస్తు ప్రత్యేకుడు (హెబ్రీయులు 1:8; యెషయా 9:6–7; దానియేలు 2:35, 44; ప్రకటన 19:11–16).
12. యేసు క్రీస్తు ప్రత్యేకమైనవాడు, ఎందుకంటే ఆయన మాత్రమే పరిశుద్ధాత్మ ద్వారా గర్భంలో నిలిచి, కన్య నుండి జన్మించారు (యెషయా 7:14; మత్తయి 1:20–23; లూకా 1:30–35).
13. యేసు క్రీస్తు దేవుని గుణలక్షణాలను ప్రదర్శించడంలో ప్రత్యేకమైనవారు. తన పరిచర్యలో, పాపాలను క్షమించే మరియు రోగులను స్వస్థపరిచే శక్తి తనకు ఉందని యేసు చూపించారు (మత్తయి 9:1–7); గాలిని మరియు అలలను శాంతపరచగలరని (మార్కు 4:37–41; కీర్తనలు 89:8–9); మనుష్యులను లోపల బయట తెలిసికొనగలరని (కీర్తనలు 139; యోహాను 1:46–50; 2:23–25); మరియు చనిపోయిన వారిని లేపగల శక్తి తనకు ఉందని యేసు తన పరిచర్యలో చూపించారు (యోహాను 11; లూకా 7:12–15; 8:41–55).
14. యేసు క్రీస్తు ప్రవచనాలను నెరవేర్చినందున ఆయన ప్రత్యేకమైనవాడు. మెస్సయ్య యొక్క జననం, జీవితం, పునరుత్థానం, వ్యక్తిత్వం మరియు ఉద్దేశ్యం గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ ఆయన ద్వారానే నెరవేరాయి తప్ప మరెవరి ద్వారానో కాదు (ఉదా., యెషయా 7:14; 9:6–7; 53; మికా 5:2; కీర్తనలు 16:10; 22; జెకర్యా 11:12–13; 13:7).
English
యేసు క్రీస్తు ఎందుకు ప్రత్యేకమైనవాడు?