settings icon
share icon
ప్రశ్న

యేసు 'నేను ఉన్నవాడిని' అని చెప్పినప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏమిటి?

జవాబు


ఫరిశీయులు, "నువ్వు ఎవనిగా చెప్పుకుంటున్నావు?" అని అడిగిన ప్రశ్నకు జవాబుగా యేసు, "'నీ తండ్రియైన అబ్రాహాము నా దినమును చూచెదనని ఆనందించెను; దానిని చూచి సంతోషించెను'" అని చెప్పెను. దానికి యూదులు, "నీకు ఇంకా యాభై ఏళ్లు కూడా నిండలేదు, అప్పుడే అబ్రహంను చూశావా?" అని అతనితో చెప్పిరి. యేసు, "నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, అబ్రహం పుట్టకముందే నేను ఉన్నాను!" అని జవాబిచ్చెను. దీనితో వారు ఆయనను రాళ్లతో కొట్టడానికి రాళ్లు చేతపట్టుకున్నారు, అయితే యేసు అక్కడి నుండి జారుకుని ఆలయ ప్రాంగణం నుండి మాయమయ్యాడు." యేసు యొక్క "నేను ఉన్నవాడిని" అనే ప్రకటన పట్ల యూదుల ఈ హింసాత్మక ప్రతిస్పందన, ఆయన తాను నిత్యుడైన, అవతారమెత్తిన దేవుడనని ప్రకటిస్తున్నాడనే విషయాన్ని వారు స్పష్టంగా అర్థం చేసుకున్నారని సూచిస్తుంది. యేసు తనను తాను, నిర్గమకాండము 3:14లో దేవుడు తనకు తానుగా ఇచ్చుకున్న "నేను ఉన్నవాడను" అనే బిరుదుతో సమానంగా చేసుకుంటున్నాడు.

యేసు కేవలం తాను అబ్రాహాము కాలమునకు ముందు ఉన్నానని చెప్పాలనుకుని ఉంటే, ఆయన, "అబ్రాహామునకు ముందు, నేను ఉన్నాను" అని చెప్పేవారు. అబ్రాహాము విషయంలో "ఉన్నాడు" అని, యేసు విషయంలో "ఉన్నాను" అని అనువదించబడిన గ్రీకు పదాలు చాలా భిన్నమైనవి. ఆత్మచే ఎన్నుకోబడిన పదాలు, అబ్రాహాము సృష్టించబడ్డాడని, కానీ యేసు నిత్యముగా ఉన్నాడని స్పష్టం చేస్తున్నాయి (యోహాను 1:1 చూడండి). ఆయన దేవునితో సమానుగా చేసుకొంటున్నాడని యూదులు అర్థం చేసుకోలేదని కాదు, ఎందుకంటే ఆయనను చంపడానికి రాళ్లు తీసుకున్నారు (యోహాను 5:18). అటువంటి ప్రకటన నిజం కాకపోతే, అది దేవుని నింద అవుతుంది మరియు మోషే ధర్మశాస్త్రం ప్రకారం దానికి విధించిన శిక్ష మరణం (లేవీయకాండము 24:11-14). కానీ యేసు దేవదూషణ చేయలేదు; ఆయన దేవుడే, దేవత్వములో రెండవ వ్యక్తి, ప్రతి విధంగాను పితరునికి సమానుడు.

యేసు తన గురించి ఏడు ప్రకటనలలో "నేనే" అనే అదే పదబంధాన్ని ఉపయోగించారు. ఆ ఏడు ప్రకటనలలోనూ, ఆయన "నేనే" అనే మాటను ప్రపంచానికి తన రక్షణ సంబంధాన్ని వ్యక్తపరిచే అద్భుతమైన రూపకాలతో కలిపి ఉపయోగించారు. ఇవన్నీ యోహాను సువార్తలో కనిపిస్తాయి. అవి: నేనే జీవపు రొట్టెను (యోహాను 6:35, 41, 48, 51); నేనే లోకమునకు వెలుగును (యోహాను 8:12); నేనే గొఱ్ఱెల ద్వారమును (యోహాను 10:7,9); నేనే మంచి కాపరిని (యోహాను 10:11, 14); నేనే పునరుత్థానమును జీవమును (యోహాను 11:25); నేనే మార్గమును సత్యమును జీవమును (యోహాను 14:6); మరియు నేనే నిజమైన ద్రాక్ష తీగను (యోహాను 15:1,5).

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

యేసు 'నేను ఉన్నవాడిని' అని చెప్పినప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏమిటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries