ప్రశ్న
పరిశుద్ధాత్మ ముద్ర అంటే ఏమిటి?
జవాబు
క్రైస్తవుల హృదయాలలో పరిశుద్ధాత్మను "అడ్వాన్సుగా ఇచ్చినది," "ముద్ర," మరియు "పూచీ" అని పిలుస్తారు (2 కొరింథీయులు 1:22; 5:5; ఎఫెసయులు 1:13-14; 4:30). పరిశుద్ధాత్మ దేవుని ప్రజలపై ఆయన వేసిన ముద్ర, మనం ఆయన సొంతమైనవారమని ఆయనకున్న హక్కు. ఈ వాక్యభాగాలలో "ముట్టె" అని అనువదించబడిన గ్రీకు పదం అర్రాబోన్ (arrhabōn), దీని అర్థం "ఒక వాగ్దానం" లేదా "హామీ". అనగా, మిగిలిన మొత్తానికి భద్రతగా ముందుగా ఇచ్చే కొనుగోలు ధనం లేదా ఆస్తిలో కొంత భాగం. విశ్వాసులకు ఆత్మ యొక్క వరము మన పరలోక స్వాస్థ్యమునకు ఒక ముందస్తు చెల్లింపు, దీనిని క్రీస్తు మనకు వాగ్దానం చేసి, సిలువ మీద మన కొరకు సురక్షితం చేసారు. ఆత్మ మనకు ముద్ర వేసినందున మన రక్షణకు మనకు నిశ్చయత కలుగుతుంది. దేవుని ముద్రను ఎవరూ విచ్ఛిన్నం చేయలేరు.
మనము దేవుని బిడ్డలమై సంపూర్ణ స్వత్వాన్ని పొందుతామని మనకు నిర్ధారించడానికి పరిశుద్ధాత్మ విశ్వాసులకు "మొదటి కిస్తీ"గా ఇవ్వబడింది. కృప మరియు విశ్వాసం బహుమతులు అయినట్లే (ఎఫెసయులు 2:8-9), మనకు తన ఆత్మను బహుమతిగా ఇచ్చే దేవునికి మనము చెందినవారమని మనకు ధృవీకరించడానికి పరిశుద్ధాత్మ మనకు ఇవ్వబడింది. ఆత్మ యొక్క వరము ద్వారా, దేవుడు మనలను నూతనపరచి పరిశుద్ధపరుస్తాడు. మనం దేవునిచే అంగీకరించబడ్డామని, మనం ఆయన దత్తపుత్రులుగా పరిగణించబడుతున్నామని, మన నిరీక్షణ నిజమైనదని, మరియు ఒక ముద్ర ఒక వీలునామా లేదా ఒడంబడికకు హామీ ఇచ్చినట్లే మన విమోచన మరియు రక్షణ నిశ్చయమైనవని రుజువు చేసే ఆ భావనలను, ఆశలను, మరియు కోరికలను ఆయన మన హృదయాలలో కలుగజేస్తాడు. మనం ఎల్లకాలం ఆయనవారమే అని, అంత్యదినమున రక్షణ పొందుదుమని నిర్ధారించే నిశ్చయమైన హామీగా దేవుడు మనకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆత్మ ఉనికికి రుజువు, ఆయన హృదయంపై చేసే కార్యములు, అవి పశ్చాత్తాపమును, ఆత్మ ఫలమును (గలతీయులకు 5:22-23), దేవుని ఆజ్ఞలకు మరియు చిత్తానికి అనుగుణ్యతను, ప్రార్థన మరియు స్తుతి పట్ల అభిలాషను, మరియు ఆయన ప్రజల పట్ల ప్రేమను ఉత్పత్తి చేస్తాయి. పవిత్రాత్మ హృదయాన్ని నూతనపరిచాడని మరియు విమోచన దినమునకై క్రైస్తవుడు ముద్ర వేయబడ్డాడని చెప్పడానికి ఈ విషయాలే రుజువులు.
కాబట్టి, పాపమును సమాధి యొక్క క్షయం నుండి సంపూర్ణముగా మరియు స్వతంత్రముగా విమోచన దినము వరకు మనం ముద్ర వేయబడి, నిర్ధారించబడటం పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన బోధనలు మరియు మార్గనిర్దేశ శక్తి ద్వారానే జరుగుతుంది. మన హృదయాలలో ఆత్మ యొక్క ముద్ర మనకు ఉన్నందున, ఊహించలేని మహిమలను కలిగి ఉన్న భవిష్యత్తులో మన నిశ్చయమైన స్థానం పట్ల విశ్వాసంతో, మనం ఆనందంగా జీవించగలము.
English
పరిశుద్ధాత్మ ముద్ర అంటే ఏమిటి?