settings icon
share icon
ప్రశ్న

ప్రార్థన ఎందుకు?

జవాబు


క్రైస్తవునికి, ప్రార్థించడం శ్వాస తీసుకోవడం లాంటిది, చేయకుండా ఉండటం కంటే చేయడం సులువు. మనము విభిన్న కారణాలచే ప్రార్థన చేయుదము. ఒక విషయానికి, ప్రార్థన దేవుని సేవించి (లూకా 2:36-38) మరియు ఆయనకు విధేయతచూపే ఒక విధానం. దేవుడు మనలను ప్రార్థించమని ఆజ్ఞాపించెను గనుక మనము ప్రార్థింతుము (ఫిలిప్పీ. 4:6-7). ప్రార్థన మనకు క్రీస్తుచే మరియు ప్రారంభ సంఘముచే ఉదహరింపబడెను (మార్కు 1:35; అపొ. 1:14; 2:42; 3:1; 4:23-31; 6:4; 13:1-3). ఒకవేళ ప్రార్థించడం ఆవశ్యకమని యేసు తలంచితే, మనము కూడా చేయాలి. ఒకవేళ ఆయన తండ్రి చిత్తములో నిలచుటకు ప్రార్థించుట అవసరమైతే, మనమింకెంత ఎక్కువగా ప్రార్థించడం అవసరము?

ప్రార్ధించుటకు మరియొక కారణము దేవుడు ప్రార్థన చాలా పరిస్థితులలో ఆయన పరిష్కారములను పొందుటకన్న ఉద్దేశ్యము. గొప్ప నిర్ణయాలకు సిద్ధపడేటప్పుడు (లూకా 6:12-13); దురాత్మ అడ్డంకులను జయించుటకు (మత్తయి 17:14-21); పనివారిని వారి ఆత్మీయ కోతకు సమకూర్చుటకు (లూకా 10:2); శోధన జయించుటకు బలమును పొందుటకు (మత్తయి 26:41); మరియు ఇతరులను ఆత్మీయంగా బలపరచుట కొరకు (ఎఫెసీ. 6:18-19) మనము ప్రార్థన చేయుదుము.

మనము దేవుని యొద్దకు మన నిర్దిష్ట అభ్యర్థనలతో వచ్చి, మరియు ఒకవేళ మనము అడిగినది స్పష్టముగా పొందుకొనక పోయినా, మన ప్రార్థనలు నిష్ఫలంకావని మనకు దేవుని వాగ్దానం ఉండెను (మత్తయి 6:6; రోమా 8:26-27). ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను, మనమాయనను వేడుకొనినది మనకిచ్చునని ఆయన వాగ్దానం చేసెను (1 యోహాను 5:14-15). కొన్నిసార్లు ఆయన తన సమాధానమును మన మేలుకై ఆయన జ్ఞానమును బట్టి ఆలస్యం చేయును. ఇలాంటి పరిస్థితులలో, మనము ప్రార్థనలో శ్రద్ధ మరియు పట్టుదల కలిగియుండాలి (మత్తయి 7:7; లూకా 18:1-8). ప్రార్థన భూమిపై మన చిత్తమును నెరవేర్చుటకు దేవునిని పొందడముగా చూడకూడదు గాని, దేవుని చిత్తమును భూమిపై జరిగేలా చూడాలి. దేవుని జ్ఞానము మన జ్ఞానమును చాలా అధిగమించును.

మనకు దేవుని చిత్తము ప్రధానముగా తెలియని పరిస్థితులలో, ప్రార్థన ఆయన చిత్తమును వివేచించేది. ఒకవేళ ఆ సురోఫెనికయ స్త్రీ క్రీస్తుకు తన అపవిత్రాత్మ పట్టిన కుమార్తె గూర్చి ప్రార్థించక పోతే, ఆమె కుమార్తె విడిపింపబడేది కాదు (మార్కు 7:26-30). ఒకవేళ యెరికో ముందున్న గ్రుడ్డివాడు క్రీస్తుని పిలవకపోతే, అతడు గ్రుడ్డివానిగానే మిగిలిపోవును (లూకా 18:35-43). మనము అడుగనందున మనకేమి తరచుగా దొరకదని దేవుడు చెప్పెను (యాకోబు 4:2). ఒక భావనలో, ప్రార్థన ఇతరులతో సువార్త పంచుకొనుట. మనము దానిని పంచుకొనేంత వరకు ఆ వర్తమానమునకు ఎవరు స్పందిస్తారో తెలియదు. అదే విధముగా, మనము ప్రార్థించకపోతే సమాధానమివ్వబడిన ప్రార్థన ఫలితాలను ఎప్పటికీ చూడలేము.

ప్రార్థన లోపము విశ్వాసంలో లోపమును మరియు దేవుని వాక్యముపై నమ్మకము యొక్క కొరతను ప్రదర్శించును. మనము దేవునిలో మన విశ్వాసమును, ఆయన వాక్యములో వాగ్దానం చేసిన రీతిగా ఆయన చేయునని మరియు మనము అడిగిన దానికంటే లేక ఆశించిన దానికంటే సమృద్ధిగా మన జీవితాలను ఆశీర్వదిoచునని ప్రదర్శించుటకు ప్రార్థన చేయుదుము (ఎఫెసీ. 3:20). ప్రార్థన ఇతరుల జీవితాలలో దేవుని పనిని చూచుటకు మనకు ప్రాధమిక మార్గము. ఎందుకంటే అది దేవుని శక్తిలోనికి “అనుసంధానమగుటకు” ఒక మార్గం, అది సాతానును మరియు అతని సైన్యమును మనకు మనమే జయించుటకు శక్తిహీనులమని అర్థము. అందువలన, దేవుడు తరచుగా మనలను ఆయన సింహాసనము ఎదుట కనుగొనును గాక, ఎందుకంటే మనము అనుభవించే సమస్త విషయములలో మనకు ఆకాశమండలములో ఒక గొప్ప ప్రధాన యాజకుడు ఉండెను (హెబ్రీ. 4:15-16). నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండునని మనకు ఆయన వాగ్ధానము ఉండెను (యాకోబు 5:16-18). దేవుడు మన జీవితాలలో మనము ఆయనను చాలినంతగా నమ్ముచు ప్రార్థనలో తరచుగా ఆయన యొద్దకు వచ్చునప్పుడు ఆయన నామమును మహిమపరచెదము.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

ప్రార్థన ఎందుకు?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries