settings icon
share icon
ప్రశ్న

బైబిల్ వివాహం గురించి ఏమి చెప్తుంది?

జవాబు


వివాహము యొక్క ప్రారంభం ఆదికాండము 2:23- 24లో చెప్పబడింది: “అప్పుడు ఆదాము ఇట్లనెను, నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.” దేవుడు ఆదామును చేసెను మరియు ఆయనను సంపూర్ణం చేయుటకు తదుపరి స్త్రీని చేసెను. బైబిల్ లో వివాహము అనేది దేవుడు “జతచేసింది” ఎందుకంటే “నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు” (ఆదికాండము 2:18).

బైబిల్ మొదటి వివాహమును వివరిస్తుండగా, హవ్వను సూచించడానికి ‘సహాయము’ అను పదం ఉపయోగించబడింది (ఆది. 2:20). ఈ సందర్భంలో, “సహాయం” చేయుట అంటే “ఆవరించుట, రక్షించుట లేదా చికిత్స చేయుట” అని అర్థం. దేవుడు హవ్వను చేసింది ఆదాముకు అతని “మరో సగభాగంగా” ఉండుటకు, ఆయనకు సహాయపడుటకు మరియు సహాయకురాలిగా ఉండుటకు.” పురుషుడు మరియు స్త్రీ “ఏక శరీరమగుటకు” వివాహం కారణమౌతుంది అని బైబిల్ చెప్తుంది. ఈ ఏకత్వం భౌతిక లైంగిక సంబంధంలో పూర్తిగా వ్యక్తపరచబడింది. ఈ ఏకత్వమును గూర్చి క్రొత్త నిబంధన గ్రంధం మరొక హెచ్చరికను చేర్చింది: కాబట్టి వారు ఇద్దరుకాకా ఏకశరీరముగా ఉన్నారు. గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను” (మత్తయి. 19:6).

పౌలు యొక్క అనేక పత్రికలు వివాహమును గూర్చి మరియు వివాహ సంబంధంలో విశ్వాసులు ఏ విధంగా ఉండాలను విషయమును బట్టి వివరిస్తున్నవి. అలాటి ఒక వాక్యభాగమే ఎఫెసీ. 5:22-33. ఈ వాక్యభాగమును చదువుట ద్వార వివాహము ఏ విధంగా ఉండాలని బైబిల్ వివరిస్తుందోనన్న విషయమును గూర్చి కొన్ని మూల సత్యాలను తెలియజేస్తుంది.

విజయవంతమైన వివాహం భార్యభర్తలు నెరవేర్చు కొన్ని పాత్రలను కలిగియుంటుందని బైబిల్ లోని ఎఫెసీ 5లో చెప్పబడింది: అవేమనగా “స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు” (ఎఫెసీ. 5:22-23). పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, తన్నుతాను అప్పగించుకొనెను” (ఎఫెసీ. 5:25). “అటువలె పురుషులు కూడ తమ సొంత శరీరములవలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును” (ఎఫెసీ. 5:28-29). ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరు ఏక శరీరమగుదురు” (ఎఫెసీ. 5:31).

ఎప్పుడైతే విశ్వాసులైన భార్యాభర్తలు వివాహమునకు బైబిల్ లోని దేవుని యొక్క సూత్రాలను పాటిస్తే, పటిష్టమైన, ఆరోగ్యకరమైన వివాహ ఫలితాలు వస్తాయి. బైబిల్ ప్రకారమైన వివాహం క్రీస్తు పురుషునికి శిరస్సు మరియు స్త్రీని ఒకే విధంగా ఉంచుతుంది. బైబిల్ ప్రకారమైన వివాహం క్రీస్తు సంఘమునకు ఏకంగా ఎలా ఉన్నాడో భార్యాభర్తల ఏకత్వం కూడా అలానే ఉంటుంది.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

బైబిల్ వివాహం గురించి ఏమి చెప్తుంది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries