settings icon
share icon
ప్రశ్న

నాలుగు ఆత్మీయ నియమాలు ఏవి?

జవాబు


నాలుగు ఆత్మీయ నియమాలు యేసు క్రీస్తు నందు విశ్వాసము ద్వారా కలుగు రక్షణ యొక్క శుభవార్తను ఇతరులకు పంచు మార్గములు. సువార్తలోని ముఖ్య సందేశమును నాలుగు బిందువులలో సమకూర్చు సులువైన మార్గమిది.

నాలుగు ఆత్మీయ నియమాలలో మొదటిది, “దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, మరియు నీ జీవితం కొరకు గొప్ప ప్రణాళిక కలిగియున్నాడు.” “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని యోహాను 3:16 చెబుతుంది. “గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని” అని యేసు రాక యొక్క కారణమును యోహాను 10:10 ఇస్తుంది. దేవుని ప్రేమ నుండి మనలను ఏమి ఆపుతుంది? సమృద్ధి జీవితము కలగకుండా మనలను ఏమి ఆపుతుంది?

నాలుగు ఆత్మీయ నియమాలలో రెండవది, “మానవ జాతి పాపముతో మలినమై దేవునికి దూరమాయెను. అందువలన, మన జీవితాలలో దేవుని యొక్క అద్భుత ప్రణాళికను మనం తెలుసుకోలేము.” “అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” అని రోమా. 3:23 ఈ విషయమును నిశ్చయిస్తుంది. “పాపము వలన వచ్చు జీతము మరణము” అని రోమా. 6:23 పాపము యొక్క పరిణామమును తెలియజేస్తుంది. తనతో సహవాసం కలిగియుండుటకు దేవుడు మనలను సృష్టించెను. అయితే, మానవులు లోకములోనికి పాపము తెచ్చి, దేవుని నుండి వేరుచేయబడెను. మనతో దేవుడు కలిగియుండాలని ఆశించిన అనుబంధమును మనం నాశనం చేశాము. పరిష్కారం ఏమిటి?

నాలుగు ఆత్మీయ నియమాలలో మూడవది, “మన పాపం కొరకు యేసు క్రీస్తు మాత్రమే దేవుడిచ్చిన పరిష్కారం. యేసు క్రీస్తు ద్వారా, మన పాపములు క్షమించబడి దేవునితో సరైన అనుబంధం పునరుద్ధరించవచ్చు.” “అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమైయుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను,” అని రోమా. 5:8 చెబుతుంది. “...లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను,” అని రక్షణ పొందుటకు మనం తెలుసుకొనవలసిన, విశ్వసించవలసిన విషయములను గూర్చి 1 కొరింథీ. 15:3-4 చెబుతుంది. ఆయన మాత్రమే రక్షణ మార్గమని యోహాను 14:6లో యేసు ప్రకటించుచున్నాడు, “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.” ఈ గొప్ప రక్షణ బహుమానమును నేను ఎలా పొందగలను?

నాలుగు ఆత్మీయ నియమాలలో నాల్గవది, “రక్షణ బహుమానమును పొందుటకు మరియు మన జీవితాలలో దేవుని అద్భుత ప్రణాళికను తెలుసుకొనుటకు యేసు క్రీస్తు రక్షకుడని విశ్వసించాలి.” “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను” అని యోహాను 1:12 దీనిని మన కొరకు వివరించుచున్నది. “ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నే యింటివారును రక్షణ పొందుదురు” అని అపొ. 16:31 ఈ విషయమును స్పష్టముగా చెబుతుంది. మనం కేవలం కృప వలనే, విశ్వాసం ద్వారానే, యేసు క్రీస్తులోనే రక్షించబడగలము (ఎఫెసీ. 2:8-9).

మీ రక్షకునిగా యేసు క్రీస్తు పైన నమ్మిక ఉంచాలని మీరు కోరితే, దేవునితో ఈ మాటలు చెప్పండి. ఈ మాటలు చెప్పుట మిమ్మును రక్షించదు, క్రీస్తును నమ్ముట రక్షించగలదు! ఈ ప్రార్థన కేవలం దేవునిలో మీకున్న విశ్వాసమును తెలియజేయుటకు మరియు మీకు రక్షణ ఇచ్చినందుకు ఆయనకు వందనములు చెల్లించుటకు ఒక మార్గము మాత్రమే. “దేవా, నేను నీకు విరోధముగా పాపము చేసితిని మరియు శిక్షకు పాత్రుడనని నాకు తెలుసు. అయితే నేను పొందవలసిన శిక్షను యేసు క్రీస్తు తీసుకొనెను మరియు ఆయనను విశ్వసించుట ద్వారా నేను క్షమాపణ పొందగలను. రక్షణ కొరకు నా విశ్వాసమును నీ మీద మోపుచున్నాను. నీ అద్భుత కృప కొరకు క్షమాపణ కొరకు-నిత్య జీవమను బహుమానము కొరకు వందనములు! ఆమేన్!”

మీరు ఇక్కడ చదివిన వాటి ఆధారంగా క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకున్నారా? అయిన యెడల, “క్రీస్తును నేడు అంగీకరించితిని” అను ఈ క్రింది బటన్ ను నొక్కండి.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

నాలుగు ఆత్మీయ నియమాలు ఏవి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries