settings icon
share icon
ప్రశ్న

పరిశుద్ధాత్మను దూషించుట అంటే ఏమిటి?

జవాబు


“పరిశుద్ధాత్మను దూషించుట” అను ఆలోచన మార్కు 3:22–30 మరియు మత్తయి 12:22–32లో ప్రస్తావించబడింది. యేసు అప్పుడే ఒక అద్భుతమును చేశాడు. ఒక దయ్యము పట్టిన వ్యక్తిని ప్రభువు దగ్గరకు తేగా, ఆయన ఆ దయ్యమును వెళ్లగొట్టి, ఆ వ్యక్తి కన్నులను మరియు నోరును తెరిచాడు. వారు ఎదురుచూస్తున్న మెస్సీయ యేసేనా అని ఆ దృశ్యమును చూసిన కొందరు చూపరులు ఆశ్చర్యపోయారు. మెస్సీయను గూర్చి మాటలను విన్న ఒక పరిసయ్యుల సమూహం, జనులలో కలుగుతున్న విశ్వాసమును అణచివేయుటకు వెంటనే ప్రయత్నించారు: “పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్య ములకు అధిపతియైన బయెల్జెబూలు వలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదనిరి” (మత్తయి 12:24).

తాను సాతాను ప్రభావముతో దయ్యములను వెళ్లగొట్టుట లేదని కొన్ని తర్కములతో యేసు పరిసయ్యులను వ్యతిరేకించాడు (మత్తయి 12:25–29). తరువాత ఆయన పరిశుద్ధాత్మ దూషణను గూర్చి మాట్లాడుతున్నాడు: “కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు” (వచనములు 31–32).

దూషణ అనే పదమును సాధారణంగా “ధిక్కార అమర్యాద” అని నిర్వచించవచ్చు. దేవుని శపించుట లేక దేవునికి సంబంధించిన విషయములను కావాలని కించపరచు పాపములకు ఈ పదమును ఉపయోగించవచ్చు. దేవునికి కొంత కీడు చేయుట లేక ఆయనకు మనం ఇవ్వవలసిన మంచిని ఇవ్వకపోవుట కూడా దైవదుషణ అని అనవచ్చు. అయితే మత్తయి 12:31లో ఈ సన్నివేశమును “పరిశుద్ధాత్మను దూషించుట” అని పిలిచారు. యేసు పరిశుద్ధాత్మ శక్తితో అద్భుతములు చేస్తున్నాడనుటకు ఖండించలేని రుజువులు చూసిన తరువాత కూడా పరిసయ్యులు, ప్రభువుకు దయ్యము పట్టెనని చెబుతున్నారు (మత్తయి 12:24). పరిశుద్ధాత్మకు విరోధముగా దైవదూషణ చేయుటకు పరిసయ్యులు చేసినదానిని గూర్చి మార్కు 3:30లో యేసు స్పష్టముగా మాట్లాడుతున్నాడు: “ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి.”

యేసు క్రీస్తు ఆత్మపూర్ణుడని ఒప్పుకొనుటకు బదులుగా ఆయనకు దయ్యము-పట్టెనని నిందించుట పరిశుద్ధాత్మను దూషించుట. ఇట్టి దూషణ నేడు మనం అనుకరించలేము. పరిసయ్యులు చరిత్రలో ఒక విశేష సమయంలో ఉన్నారు: వారి యొద్ద ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు ఉన్నారు, వారి ఎదుట దైవ కుమారుడు స్వయంగా నిలబడియున్నాడు, మరియు వారి సొంత కన్నులతో వారు ఆయన చేసిన అద్భుతాలు చూసారు. చరిత్రలో అంతకు ముందు ఎన్నడు అట్టి (మరియు ఆ తరువాత కూడా) దైవిక వెలుగు మానవులకు ఇవ్వబడలేదు; ఒకవేళ ఎవరైనా యేసును గుర్తించగలిగితే వారు పరిసయ్యులై యుండాలి. అయినను వారు వ్యతిరేకించారు. వారికి సత్యము తెలిసి దానికి రుజువులు ఉన్నప్పటికీ, వారు ఉద్దేశపూర్వకంగా ఆత్మ కార్యమును దయ్యముతో పోల్చారు. వారు కావాలని చూపు గుడ్డితనము క్షమించరానిదని యేసు చెప్పెను. పరిశుద్ధాత్మను వారు దూషించుట వారి ద్వారా దేవుని కృప యొక్క అంతిమ తిరస్కరణ. వారు వారి పనిని ఆరంభించారు, మరియు వారిని ఆపకుండా దేవుడు వారిని విధ్వంశంలోనికి పోనిచ్చాడు.

పరిశుద్ధాత్మకు విరోధముగా పరిసయ్యుల యొక్క దూషణ “ఈ యుగమందైనను రానునయుగమందైనను క్షమించరానిదని” యేసు జనులకు తెలియజేశాడు (మత్తయి 12:32). వారు పాపము ఎన్నడు క్షమించబడదు అనుటకు ఇది ఒక విధానము. మార్కు 3:29 చెప్పునట్లు వారు, “నిత్యపాపమునకు” పాత్రులైయున్నారు.

పరిసయ్యులు క్రీస్తును బహిరంగంగా దూషించుట (మరియు దేవుడు వారిని తిరస్కరించుట) యొక్క ఆకస్మిక పరిణామం తరువాత అధ్యాయములో మనం చూడవచ్చు. యేసు మొదటి సారిగా వారితో, “ఉపమానాల ద్వారా అనేక విషయములు చెప్పెను” (మత్తయి 13:3; cf. మార్కు 4:2). యేసు యొక్క మారిన బోధా విధానం ద్వారా శిష్యులు తికమకపడ్డారు, మరియు యేసు వారికి ఉపమానాలను వివరించాడు: “పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింప బడలేదు. . . . మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయునున్నారు” (మత్తయి 13:11, 13). యూదా నాయకులు అధికారికంగా ఆయనను తిరస్కరించుటకు పరిణామంగా యేసు ఉపమానాలు మరియు రూపకాల ద్వారా సత్యమునకు ముసుగువేశాడు.

మరియు, కొందరు ప్రయత్నిస్తున్నప్పటికీ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము నేడు పునరావృత్తం చేయలేము. యేసు క్రీస్తు భూమిపై లేడు-ఆయన దేవుని కుడిపర్శ్యమందు కూర్చొనియున్నాడు. యేసు స్వయంగా అద్భుతమును చేయుట చూసినవారు ఆ ఘనతను ఆత్మకు ఇచ్చుటకు బదులుగా సాతానుకు ఇవ్వలేరు.

తరచుగా అవిశ్వాసం చూపుట నేడు క్షమించరాని పాపము. రక్షణపొందని లోకమును పాపం, నీతి మరియు తీర్పు ద్వారా ఆత్మ నేడు ఖండిస్తుంది (యోహాను 16:8). ఆ ఖండనను వ్యతిరేకించి కావాలని పశ్చాత్తాపపడకపోవుట ఆత్మను “దూషించుటతో సమానం.” ఆత్మ తాకిడిని వ్యక్తిరేకించి యేసు క్రీస్తును నమ్మక అవిశ్వాసంలో మరణించువారికి, ఈ యుగములోను మరియు రానున్న యుగాములోను క్షమాపణ లేదు. దేవుని ప్రేమ రుజువవుతుంది: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” (యోహాను 3:16). మరియు ఇక్కడ వికల్పం స్పష్టముగా ఉంది: “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచియుండును” (యోహాను 3:36).

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

పరిశుద్ధాత్మను దూషించుట అంటే ఏమిటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries