settings icon
share icon
ప్రశ్న

బైబిల్ యొక్క ప్రామాణిక సూత్రం ఎప్పుడు ఎలా జతపరచబడింది?

జవాబు


“canon” అను పదము దైవ ప్రేరితమై బైబిల్ కు చెందిన పుస్తకాలను వివరించుటకు ఉపయోగించబడుతుంది. బైబిల్ యొక్క ప్రామాణిక సూత్రమును నిర్థారించుటలో కష్టము ఏమిటంటే బైబిల్కు చెందిన పుస్తకముల యొక్క పట్టిక బైబిల్ మనకు ఇవ్వదు. ప్రామాణిక సూత్రమును నిర్ధారించు ప్రక్రియ మొదటిగా యూదా రబ్బీలు మరియు పండితుల ద్వారా చేపట్టబడి తరువాత ఆదిమ క్రైస్తవుల ద్వారా కొనసాగించబడినది. దేవుడు ఒక పుస్తకము వ్రాయుటకు ప్రేరేపణ ఇచ్చిన తక్షణమే ఆ లేఖన పుస్తకము ప్రామాణిక సూత్రములో భాగమవుతుంది.

క్రొత్త నిబంధనతో పోలిస్తే, పాత నిబంధన ప్రామాణిక సూత్రమును గూర్చి పెద్ద వివాదం లేదు. హెబ్రీ విశ్వాసులు దేవుని సందేశకులను గుర్తించి వారి రచనలను దైవ ప్రేరితమని అంగీకరించారు. పాత నిబంధన ప్రామాణిక సూత్రము విషయంలో నిశ్చయముగా కొంత చర్చ ఉన్నప్పటికీ, క్రీ.శ. 250 నాటికి హెబ్రీ లేఖనముల యొక్క ప్రామాణిక సూత్రమును గూర్చి సార్వత్రిక అంగీకారం ఉంది. అపోక్రిపా గురించి మాత్రం కొంత సమస్య ఉంది, మరియు అది నేటికి కూడా కొంత చర్చతో కొనసాగుతుంది. అపోక్రిపా మంచి చారిత్రక మరియు మతపరమైన గ్రంథము అని చాలా వరకు హెబ్రీ పండితులు అంగీకరిస్తారు, అయితే హెబ్రీ లేఖనముల స్థాయిలో కాదు.

క్రొత్త నిబంధన విషయంలో, గుర్తింపు మరియు సేకరణ క్రైస్తవ సంఘము యొక్క మొదటి శతాబ్దాలలోనే ఆరంభమయ్యింది. ఆరంభములోనే, క్రొత్త నిబంధన పుస్తకములలో కొన్ని గుర్తించబడ్డాయి. పాత నిబంధన వలె లూకా రచనలు అధికారికమైనవని పౌలు ఎంచాడు (1 తిమోతి 5:18; ద్వితీ. 25:4 మరియు లూకా 10:7 కూడా చూడండి). పౌలు రచనలు లేఖనములుగా పేతురు గుర్తించాడు (2 పేతురు 3:15-16). క్రొత్త నిబంధనలో కొన్ని పుస్తకాలు సంఘములలో చెలామణిలో ఉన్నాయి (కొలస్సి. 4:16; 1 థెస్స. 5:27). రోమాకు చెందిన క్లెమెంట్ కనీసం ఎనిమిది క్రొత్త నిబంధన పుస్తకాలను ప్రస్తావించాడు (క్రీ.శ. 95). అంతియోకయకు చెందిన ఇగ్నేసియస్ ఏడు పుస్తకాలను గుర్తించాడు (క్రీ.శ. 115). అపొస్తలుడైన యోహాను యొక్క శిష్యుడైన పోలికార్ప్ 15 పుస్తకాలను గుర్తించాడు (క్రీ.శ. 108). తరువాత, ఐరేనియస్ 21 పుస్తకాలను ప్రస్తావించాడు (క్రీ.శ. 185). హిప్పోలిటస్ 22 పుస్తకాలను గుర్తించాడు (క్రీ.శ. 170-235). ఎక్కువ వివాదమును ఎదుర్కొను క్రొత్త నిబంధన పుస్తకాలు హెబ్రీయులకు, యాకోబు, 2 పేతురు, 2 యోహాను, మరియు 3 యోహాను.

మొదటి కేనన్ పేరు మురటోరియన్ కేనన్, మరియు ఇది క్రీ.శ. 170లో సంకలనం చేయబడింది. మురటోరియన్ ప్రామాణిక సూత్రములో హెబ్రీయులకు, యాకోబు, మరియు 3 యోహాను మినహా మిగిలిన క్రొత్త నిబంధన పుస్తకాలన్నీ ఉన్నాయి. కేవలం పాత నిబంధన (అపోక్రిపాతో సహా) మరియు క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలు మాత్రమే సంఘాలలో చదవబడాలని క్రీ.శ. 363లో కౌన్సిల్ అఫ్ లవోడిసియ వ్యాఖ్యానించింది. అవే 27 పుస్తకాలు అధికారికమైనవని కౌన్సిల్ అఫ్ హిప్పో (క్రీ.శ. 393)మరియు కౌన్సిల్ అఫ్ కార్తగే (క్రీ.శ. 397) ఘోషించాయి.

క్రొత్త నిబంధన పుస్తకము నిజముగా పరిశుద్ధాత్మ ప్రేరితమని నిర్థారించుటకు ఈ సభలు ఈ క్రింది నియమాలను అనుసరించాయి: 1) రచయిత అపొస్తలుడా లేక అపొస్తలులతో సన్నిహిత సంబంధం కలిగియున్నాడా? 2) పుస్తకము క్రీస్తు శరీరంలో అధిక శాతం వారిచే అంగీకరించబడిందా? 3) పుస్తకములో సిద్ధాంతం యొక్క స్థిరత్వము మరియు సనాతన బోధ ఉన్నదా? 4) పరిశుద్ధాత్మ కార్యమును ప్రతిబింబించునట్లు పుస్తకములో గొప్ప నైతిక మరియు ఆత్మీయ విలువలు ఉన్నాయా? మరొకసారి, సంఘము ప్రామాణిక సూత్రమును నిర్థారించలేదని గుర్తుంచుకొనుట ముఖ్యము. బైబిల్ కు ఏ పుస్తకాలు చెందవలెను అనునది కేవలం దేవుడు, దేవుడు మాత్రమే నిర్థారించాడు. ఆయన ముందుగానే నిర్థారించిన దానిని దేవుడు తన అనుచరులకు అందించాడు అనంత సులువైన విషయం ఇది. బైబిల్ పుస్తకాలను సేకరించు మానవ ప్రక్రియ తప్పులతో నిండినది, కాని దేవుడు తన సార్వభౌమత్వంలో, మన కాటిన్యము మరియు అజ్ఞానత మధ్య కూడా, ఆయన ప్రేరేపించిన పుస్తకములను గుర్తించుటకు ఆదిమ సంఘమును ఐక్యతలోనికి తెచ్చాడు.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

బైబిల్ యొక్క ప్రామాణిక సూత్రం ఎప్పుడు ఎలా జతపరచబడింది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries